Holiday: ఏప్రిల్ 11న విద్యాసంస్థలు, ఆఫీస్ లకు సెలవు.. కారణం ఇదే

ఉగాది పండుగ అయిపోయింది. నేడు స్కూల్స్ ఓపెన్ చేయనున్నారు. మళ్లీ రేపు అనగా ఏప్రిల్ 11, గురువారం నాడు సెలవు. ఎందుకంటే..

ఉగాది పండుగ అయిపోయింది. నేడు స్కూల్స్ ఓపెన్ చేయనున్నారు. మళ్లీ రేపు అనగా ఏప్రిల్ 11, గురువారం నాడు సెలవు. ఎందుకంటే..

కొన్నేళ్ల క్రితం వరకు ఏప్రిల్ నెల 12-15 లోపు విద్యాసంస్థలకు వేసవి సెలవులు మొదలయ్యేవి. కానీ గత కొన్నాళ్లుగా ఇవి ఆలస్యం అవుతూ వస్తున్నాయి. ఇక ఈ ఏడాది కూడా ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు మొదలు కాబోతున్నాయి. దాంతో ఈ నెల స్కూల్స్ పని చేస్తాయి అన్నమాట. ఇక వేసవి సెలవుల సంగతి అలా ఉంచితే.. ఏప్రిల్ నెలలో విద్యార్థులకు బోలేడు సెలవులు రానున్నాయి. ఇప్పటికే ఉగాది పండుగ అయిపోగా.. రేపు అనగా ఏప్రిల్ 11న విద్యాసంస్థలు, ఆఫీసులకు సెలవు. కారణం ఏంటంటే..

ఉగాది పండుగ సందర్భంగా నిన్ననే అనగా ఏప్రిల్ 9న విద్యాసంస్థలు, ఆఫీస్లు, బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ఒక్క రోజు గ్యాప్ తర్వాత అనగా ఏప్రిల్ 11, గురువారం నాడు మళ్లీ వీటన్నింటికి సెలవు ఉండనుంది. కారణం ఏంటంటే.. ఏప్రిల్ 11వ తేదీన(గురువారం) రంజాన్ పండ‌గ. దాంతో ప్ర‌భుత్వం స్కూల్‌, కాలేజీలు, ఆఫీస్‌లు, బ్యాంకులకు సెల‌వు ఇచ్చింది. ఇదిలా ఉంచితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవ‌లే టెన్త్‌, ఇంట‌ర్ విద్యార్థుల‌కు ప‌రీక్ష‌లు ముగిసి.. వేస‌వి సెల‌వులు ప్రారంభమైన సంగతి తెలిసిందే.

ఇక ఈ వారం ఏప్రిల్ 11తో పాటు మరో రెండు రోజులు కూడా సెలవులు రానున్నాయి. అది ఏప్రిల్ 13, 14నాడు ప్రభుత్వ విద్యాసంస్థలు, కార్యాలయాలు, బ్యాంకులకు వరుసగా రెండు రోజులు సెలవులు రానున్నాయి. మళ్లీ ఈ హాలీడేస్ ఏందుకంటే.. రెండో శనివారం, ఆదివారం. సాధారణంగా ఈ 2 రోజులు ప్రభుత్వ విద్యాసంస్థలు, కాలేజీలు, బ్యాంకులకు సెలవు ఉంటుంది. అందుకే ఇదే వారంలో ఏప్రిల్ 11తో పాటు మరో రెండు రోజులు కూడా సెలవులు రానున్నాయి అన్న మాట.

అలాగే ఏప్రిల్ 17వ తేదీన‌ (బుధ‌వారం) శ్రీరామనవమి పండ‌గ సంద‌ర్భంగా దేశ‌వ్యాప్తంగా అన్ని స్కూల్స్‌, కాలేజీలు ఆఫీస్‌ల‌కు హాలిడే ఉంటుంది. ఇక ఇదే నెల‌లో విద్యార్థులకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 24 నుంచి సమ్మర్ హాలీడేస్ మొదలవుతాయి. జూన్ వరకు ఇవి కొనసాగుతాయి. ఇక ఏప్రిల్ నెలలో బ్యాంకులకు కూడా భారీగానే సెలవులు వచ్చాయి.

Show comments