iDreamPost
android-app
ios-app

HYD నిమ్స్ లో పారామెడికల్ కోర్సులు.. ఇవి చేస్తే జాబ్ పక్కా!.. అర్హులు ఎవరంటే?

  • Published Aug 10, 2024 | 12:48 PM Updated Updated Aug 10, 2024 | 12:48 PM

NIMS Paramedical UG Courses 2024: మీరు తక్కువ సమయంలోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందాలనుకుంటున్నారా? అయితే ఈ కోర్సులు చేయండి. ఇవి చేస్తే జాబ్ పక్కా పొందే వీలుంటుంది.

NIMS Paramedical UG Courses 2024: మీరు తక్కువ సమయంలోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందాలనుకుంటున్నారా? అయితే ఈ కోర్సులు చేయండి. ఇవి చేస్తే జాబ్ పక్కా పొందే వీలుంటుంది.

HYD నిమ్స్ లో పారామెడికల్ కోర్సులు.. ఇవి చేస్తే జాబ్ పక్కా!.. అర్హులు ఎవరంటే?

త్వరగా ఉపాధి పొందాలన్నా.. ఉద్యోగావకాశాలు దక్కించుకోవాలన్నా డిమాండ్ ఉండే కోర్సులు చేస్తే బెటర్ గా ఉంటుంది. ఏదో చదువుతున్నామంటే చదువుతున్నట్టుగా కాకుండా రోటీన్ కు భిన్నంగా ఉండే కోర్సులు ఎంచుకోవాలి. ఏదైనా కోర్సు చేస్తే పక్కా జాబ్ వచ్చేలా ఉండాలి లేదా స్వయం ఉపాధి పొందేలా ఉండాలి. మరి మీరు కూడా ఇలాంటి కోర్సులు చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసం పారామెడికల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ లోని నిజాం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ కోర్సులు చేస్తే జాబ్ పక్కాగా పొందే అవకాశం ఉంటుంది.

హైదరాబాద్‌లోని నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌)లో 2024 విద్యా సంవత్సరానికి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, అనుబంధ హెల్త్‌ సైన్సెస్‌లో బీఎస్సీ డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బీపీటీలో 50 సీట్లు, బీఎస్సీ నర్సింగ్‌లో 100 సీట్లు, బీఎస్సీ డిగ్రీ (అలైడ్ హెల్త్ సైన్సెస్) కోర్సులో 100 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్‌(బైపీసీ) ఉత్తీర్ణతతో పాటు ఎప్‌సెట్ పరీక్షలో అర్హత సాధించినవారు అప్లై చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 23 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీలను ఆగస్టు 27లోగా సంబంధిత చిరునామాలో సమర్పించాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Nims

ముఖ్యమైన సమాచారం:

బీఎస్సీ నర్సింగ్ (మహిళలకు మాత్రమే)

  • కోర్సు వ్యవధి: 4 సంవత్సరాలు.

అర్హత:

  • ఇంటర్(బైపీసీ) లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. వివాహిత మహిళలు కూడా దరఖాస్తుకు అర్హులు. తెలంగాణ ఎప్‌సెట్ పరీక్షలో అర్హత తప్పనిసరి.

వయోపరిమితి:

  • 31.12.2024 నాటికి 17 – 35 సంవత్సరాల మద్య ఉండాలి.

బీపీటీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ)

  • కోర్సు వ్యవధి: 4.5 సంవత్సరాలు.

అర్హత:

  • ఇంటర్(బైపీసీ) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. లేదా ఫిజియోథెరపీ (ఒకేషనల్ – బ్రిడ్జ్ కోర్సు – బయాలజీ, ఫిజిక్స్)తోపాటు తెలంగాణ ఎప్‌సెట్-2024 పరీక్షలో అర్హత తప్పనిసరి.

వయోపరిమితి:

  • 31.12.2024 నాటికి 17 – 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

బీఎస్సీ (అలైడ్ హెల్త్ సైన్సెస్)

  • కోర్సు వ్యవధి: 4 సంవత్సరాలు.

అర్హత:

  • ఇంటర్(బైపీసీ) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. దీంతోపాటు తెలంగాణ ఎప్‌సెట్-2024 పరీక్షలో అర్హత తప్పనిసరి.

వయోపరిమితి:

  • 31.12.2024 నాటికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి.

దరఖాస్తు ఫీజు:

  • అభ్యర్థులు రూ.2,500 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2000 చెల్లించాలి.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌లైన్

ఎంపిక విధానం:

  • తెలంగాణ ఎప్‌సెట్-2024 ర్యాంకు, ఇంటర్ మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఎంపికైనవారికి కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

  • 09-08-2024

ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరితేది:

  • 23-08-2024

దరఖాస్తు హార్డ్ ‌కాపీలు పంపాల్సిన చిరునామా:

  • ది అసోసియేట్ డీన్,
    అకాడమిక్-2, 2 ఫ్లోర్, ఓల్డ్ ఓపీడీ బ్లాక్,
    నిజామ్స్ ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్,
    హైదరాబాద్ 500082.