Krishna Kowshik
చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా.. చదువు లేకపోతే మన బ్రతుకు పెద్ద సున్నా అని కవి అన్నట్లుగా.. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. చదువుకోవడం ఆపకూడదు. ఇదిగో ఈ నిరుపేద ఇంట్లో మెరిసిన ఆణి ముత్యం కూడా అంతే.. కరెంట్ లేని పూరి గుడిసెలో చదివి..
చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా.. చదువు లేకపోతే మన బ్రతుకు పెద్ద సున్నా అని కవి అన్నట్లుగా.. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. చదువుకోవడం ఆపకూడదు. ఇదిగో ఈ నిరుపేద ఇంట్లో మెరిసిన ఆణి ముత్యం కూడా అంతే.. కరెంట్ లేని పూరి గుడిసెలో చదివి..
Krishna Kowshik
చదువుకోవాలన్న పట్టుదల, సంకల్పం ఉండాలే కానీ.. అవరోధాలను కూడా అవకాశాలుగా మలుచుకోవచ్చు. కరెంట్, ఇంటర్నెట్ సదుపాయాలు లేని రోజుల్లో పూరి గుడిసెలో, విద్యుత్ దీపాల కింద చదివి ఉన్నత స్థానాలకు ఎదగవచ్చునని నిరూపించారు చాలా మంది. ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ లేని ఇల్లే ఉండదు.. అలాంటిది విద్యుత్ లేని ఇల్లు ఊహించగలమా. అలాగే పూరీళ్లు కూడా చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ఇలాంటి ఇంట్లోనే ఉంటూ కొవ్వొత్తుల వెలుగులో చదువుకుని టాప్ ర్యాంకర్‌గా నిలిచింది ఓ విద్యార్థిని. దీంతో ప్రభుత్వమే దిగివచ్చింది. చివరకు ఆ ఇంటికి ఉచితంగా విద్యుత్ సరఫరాను తెప్పించుకోగలిగింది. ఈ చదువుల తల్లిది మన పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో. వివరాల్లోకి వెళితే..
తమిళనాడులోని తిరువరూర్ జిల్లా కొరడా చెరి పాతూరు శివ్‌కోవిల్ వీధిలో నివసిస్తున్నారు బాల, సుధ దంపతులు. వీరి కుమార్తె దుర్గాదేవి 10వ తరగతి పరీక్షలో 500లకు గానూ 492 మార్కులు సాధించింది. తమిళంలో 96, ఇంగ్లిష్‌లో 100, గణితంలో 98, సైన్స్ 100, సోషల్ సైన్స్‌లో98 సాధించి జిల్లాలోనే 2వ స్థానంలో నిలిచింది. ఆమె అన్ని సదుపాయాలున్న ఇంట్లో ఈ మార్కులు సాధించలేదు. పూరి ఇంట్లో, కొవ్వెత్తుల వెలుగులో, చార్జర్ ల్యాంప్ కింద చదువుకుని ఈ మార్కులు సాధించింది. ఓ పేపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తనకు డాక్టర్ కావాలని లక్ష్యమని చెప్పింది. తన ఇంట్లో కరెంట్ సౌకర్యం లేదని, చార్జర్ ల్యాంప్ వెలుతురులో చదువుకున్నట్లు తెలిపింది. కరెంట్ కోసం దరఖాస్తు చేసుకోగా 3 విద్యుత్ స్తంభాలు వేయాలని, అందుకు లక్ష రూపాయలు ఖర్చు అవుతుందని విద్యుత్ శాఖ తెలిపింది.
తన తండ్రికి అంత స్థోమత లేకపోవడంతో.. కరెంట్ సదుపాయాన్ని పొందలేకపోయాడు. కానీ ఆమె చదువును నిర్లక్ష్యం చేయలేదు. కొవ్వొత్తి, చార్జర్ ల్యాంప్ వంటి సదుపాయాలతోనే 10వ తరగతి చదువుకుంది. మంచి మార్కులతో పాసైంది. కాగా, ఆమె జిల్లా ఫస్ట్ రావడంతో ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు తమిళనాడు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. దీనిపై స్టాలిన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దుర్గాదేవి ఇంటికి ప్రభుత్వ ఖర్చుతో ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని కల్పించారు. తమకు ఈ సౌకర్యాన్ని అందించినందుకు దుర్గాదేవి తల్లిదండ్రులు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌కు, తమిళనాడు ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. స్టూడెంట్ తల్లి సుధ మాట్లాడుతూ.. ఎంకె స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ విద్యార్థులను ప్రగతి పథంలో తీసుకెళ్తోందన్నారు. తన కూతురు చదువుకు ప్రాధాన్యతనిస్తూ కొంత ఆర్థిక సాయాన్ని అందించిందని తెలిపారు.