iDreamPost
android-app
ios-app

కేంద్రీయ విద్యాలయాల్లో 1వ తరగతి అడ్మిషన్స్.. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు!

ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలకు బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే చూస్తారు. ఇలాంటి వారికి మంచి ఛాన్స్. తమ పిల్లల భవిష్యత్ ను బంగారుమయం చేసేందుకు కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి అడ్మిషన్స్ కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి.

ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలకు బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే చూస్తారు. ఇలాంటి వారికి మంచి ఛాన్స్. తమ పిల్లల భవిష్యత్ ను బంగారుమయం చేసేందుకు కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి అడ్మిషన్స్ కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి.

కేంద్రీయ విద్యాలయాల్లో 1వ తరగతి అడ్మిషన్స్.. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు!

ప్రస్తుత రోజుల్లో విద్యకు ప్రాధాన్యత పెరిగింది. తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు తల్లిదండ్రులు కృషి చేస్తున్నారు. పేదరికాన్ని పారద్రోలడానికైనా, ఉన్నత శిఖరాలను అధిరోహించడానికైనా చదువు కీలక పాత్ర పోషిస్తుందని విశ్వసిస్తున్నారు. పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేందుకు ఖర్చుకు కూడా వెనకాడకుండా ప్రముఖ స్కూళ్లలో చేర్పించేందుకు తల్లిదండ్రులు రెడీ అవుతున్నారు. ఇలాంటి వారికి శుభవార్త. తమ పిల్లల భవిష్యత్ ను బంగారుమయంగా మార్చేందుకు అవకాశం వచ్చింది. కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. దరఖాస్తు గడువుకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ సువర్ణావకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు.

మీరు మీ పిల్లలను స్కూళ్లో చేర్పించాలనుకుంటే ఇదే మంచి ఛాన్స్. నాణ్యమైన విద్యను అందించే కేంద్రీయ విద్యాలయాల్లో పిల్లలను చేర్పిస్తే భవిష్యత్ కు తిరుగుండదు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వార్యంలో పనిచేస్తున్న ఈ పాఠశాలలు అత్యున్నత ప్రమాణాలను కలిగి ది బెస్ట్ ఎడ్యుకేషన్ ను అందిస్తుంటాయి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో ప్రవేశాల కోసం అప్లికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 15న ముగియనున్నది. దరఖాస్తు చివరి తేదీలోగా.. ఏప్రిల్ 01 2024 వరకు ఆరేళ్లు నిండిన పిల్లలు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైన తర్వాత కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి చదివేందుకు ఎంపికైన విద్యార్థులతో మొదటి ప్రొవిజినల్ జాబితా ఏప్రిల్ 19న, రెండో ప్రొవిజినల్‌ జాబితా (ఆర్‌టీఈ/సర్వీస్‌ ప్రియారిటీ (I & II)/ రిజర్వేషన్‌ కోటా) ఏప్రిల్‌ 29 విడుదల చేస్తారు (సీట్లు ఖాళీలను బట్టి). ఇకపోతే మూడో ప్రొవిజినల్‌ జాబితాను మే 8న విడుదల చేస్తారు.

కాగా కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ దక్కించుకోవాలంటే అనుకున్నంత ఈజీ కాదు. అప్లికేషన్ నుంచి ఎంట్రెన్స్ ఎగ్జామ్ వరకు ఎంతో జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది. దరఖాస్తులో తప్పులు దొర్లితే అడ్మిషన్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. 2024 ఏప్రిల్ 1 నాటికి 6 ఏళ్లు నిండిన విద్యార్థుల తరఫున వారి తల్లిదండ్రులు కేంద్రీయ విద్యాలయ అధికారిక వెబ్‌సైట్ https://kvsonlineadmission.kvs.gov.in ద్వారా ఆన్‌ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇకపోతే, ఆయా పాఠశాలల్లో సీట్ల ఖాళీలను బట్టి రెండో తరగతి నుంచి ఆ పైతరగతులకు (పదకొండో తరగతి మినహా) ఆఫ్‌లైన్‌ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఏప్రిల్‌ 10 వరకు కొనసాగనుంది. ఎంపికైన అభ్యర్థుల లిస్ట్‌ను ఏప్రిల్‌ 15న విడుదల చేస్తారు. మరి మీ పిల్లలను కేంద్రీయ విద్యాలయాల్లో చేర్పించాలనుకుంటే వెంటనే దరఖాస్తు చేయండి.