P Venkatesh
P Venkatesh
మీరు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? అలాంటి వారికి ఇండియన్ ఆర్మీ శుభవార్తను అందించింది. ఇంజనీరింగ్ గ్రాడ్యేయేట్స్ కి ఆర్మీలో ఉద్యోగం పొందే అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ నోటిఫికేషన్ తో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ తో పాటు మంచి జీతాన్ని పొందవచ్చు. కాగా అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరుతోంది ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ లో కోరింది. ఇప్పటికే అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబర్ 27 2023 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. అప్లై చేసుకునేందుకు చివరి తేదీ 26 అక్టోబర్ 2023 గా నిర్ణయించింది. మరి ఈ ఉద్యోగాలకు అర్హతలు ఏంటి? జీతం ఎంత? ఆ వివరాలు మీకోసం..
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం పొందే అవకాశం వచ్చింది. ఆర్మీలో 139వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (TGC 139) ద్వారా వివిధ ఇంజనీరింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. TGC 139 అనేది 12 నెలల ట్రైనింగ్ కోర్సు. వచ్చే ఏడాది జులైలో ఈ కోర్సు ప్రారంభం కానుంది. అర్హత ఉన్నవారు ఇండియన్ ఆర్మీ అధికారిక రిక్రూట్‌మెంట్ పోర్టల్ https://joinindianarmy.nic.in/ ద్వారా అక్టోబర్ 26లోపు అప్లై చేసుకోవాలి. కాగా, ఇండియన్ ఆర్మీ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు(TGC)కు ఎంపికయ్యే అభ్యర్థులకు డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA)లో 12 నెలల ట్రైనింగ్ ఉంటుంది.
ముఖ్యమైన సమాచారం:
ఖాళీల వివరాలు:
పోస్టులు: 30
కంప్యూటర్ సైన్స్7, మెకానికల్7, సివిల్ కేటగిరీల్లో 7, ఎలక్ట్రికల్ -3, ఎలక్ట్రానిక్స్- 4, ఆర్కిటెక్చర్-2.
వయోపరిమితి:
అభ్యర్థుల వయసు 2024 జులై 1 నాటికి 20 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్:
ఇంజనీరింగ్ ఉత్తీర్ణత లేదా ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు అప్లై చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ:
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో SSB ఇంటర్వ్యూ, ఇంజనీరింగ్ కోర్సుల్లో సాధించిన మార్కులు కీలకం కానున్నాయి. ఈ రెండు అంశాల ఆధారంగా మెరిట్ లిస్ట్ సిద్ధం చేస్తారు.
అప్లికేషన్ విధానం:
ఆన్ లైన్
జీతభత్యాలు:
ఇండియన్ ఆర్మీ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు(TGC)కు ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.56,000 నుంచి రూ.2,50,000 మధ్య లభిస్తుంది.
అధికారిక వెబ్ సైట్:
https://joinindianarmy.nic.in/