iDreamPost
android-app
ios-app

ఉచితంగా AI కోర్సులు అందిస్తున్న Google.. నేర్చుకుంటే జాబ్ పక్కా!

టెక్నాలజీయుగంలో రాణించాలంటే ఎప్పటికప్పుడు స్కిల్స్ అప్ గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడంతా ఏఐ కాలం నడుస్తోంది. గూగుల్ ఉచితంగా ఏఐ కోర్సులను అందిస్తోంది. ఇవి నేర్చుకుంటే జాబ్ గ్యారంటీ అంటున్నారు నిపుణులు.

టెక్నాలజీయుగంలో రాణించాలంటే ఎప్పటికప్పుడు స్కిల్స్ అప్ గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడంతా ఏఐ కాలం నడుస్తోంది. గూగుల్ ఉచితంగా ఏఐ కోర్సులను అందిస్తోంది. ఇవి నేర్చుకుంటే జాబ్ గ్యారంటీ అంటున్నారు నిపుణులు.

ఉచితంగా AI కోర్సులు అందిస్తున్న Google.. నేర్చుకుంటే జాబ్ పక్కా!

టెక్నాలజీలో వస్తున్న విప్లవాత్మక మార్పులు అనేక ఆవిష్కరణలకు మూలం అవుతున్నాయి. ఇటీవలి కాలంలో బాగి వినిపిస్తున్న విషయం ఏదైనా ఉందంటే అది కేవలం ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ మాత్రమే. కృత్రిమ మేధా ప్రపంచాన్ని ఏలడానికి రెడీ అవుతోంది. ఒక్క టెక్నాలజీ రంగంలోనే కాకుండా అన్ని రంగాల్లో ఏఐ ప్రభావం చూపిస్తోంది. కొన్ని న్యూస్ ఛానల్స్ ఏఐ యాంకర్స్ ను కూడా ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. సినిమా హీరోలు, ఇతర సెలబ్రిటీల ఏఐ వీడియోలు నెట్టింటా వైరల్ గా మారిన విషయం తెలిసిందే. రానున్న కాలమంతా ఏఐ టెక్నాలజీదే అంటున్నారు నిపుణులు. భవిష్యత్తులో ఉద్యోగాలు రావాలంటే ఏఐ పై దృష్టి సారించాలని సూచిస్తున్నారు.

ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీ గూగుల్ ఏఐ కోర్సులను ఫ్రీగా అందిస్తోంది. విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నాయి. ఈ కోర్సులను నేర్చుకుంటే భవిష్యత్తులో ఉద్యోగం గ్యారంటీ అంటున్నారు. ఏఐ కోర్సులను బయట ఇన్సిట్యూట్ లలో నేర్చుకుంటే వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అంత పెట్టుబడి పెట్టడం కష్టమే కదా. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీరు గూగుల్ ప్రీగా అందించే ఏఐ కోర్సులను నేర్చుకుని ఉద్యోగాలు సాధించొచ్చు. ఉచితంగా నేర్చుకుని స్కిల్స్ అప్ గ్రేడ్ చేసుకుని ఉద్యోగ అవకాశాలను పొందొచ్చు. విద్యార్థులు, ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ ఫ్రీగా నేర్చుకోవచ్చు.

గూగుల్ ఫ్రీ ఏఐ కోర్సులు:

  • ఇంట్రడక్షన్ టు జనరేటివ్ ఏఐ
  • ఇంట్రడక్షన్ టు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్
  • ఇంట్రడక్షన్ టు రెస్పాన్సిబుల్ ఏఐ
  • ఇంట్రడక్షన్ టు ఇమేజ్ జనరేషన్
  • ఎన్‌కోడర్ -డీకోడర్ ఆర్కిటెక్చర్
  • అటెన్షన్ మెకానిజం
  • ట్రాన్స్‌ఫార్మర్ మోడల్స్ అండ్ BERT మోడల్
  • క్రియేట్ ఇమేజ్ క్యాప్షనింగ్ మోడల్స్
  • ఇంట్రడక్షన్ టు జనరేటివ్ ఏఐ స్టూడియో
  • జనరేటివ్ ఏఐ ఎక్స్‌ప్లోరర్ – వెర్టెక్స్ ఏఐ (క్వెస్ట్)

ఇక ఈ కోర్సుల్లో చాలా వరకు వన్డే కోర్సులే ఉన్నాయి. ఈ కోర్సులను నేర్చుకోవడం ద్వారా అన్ని రంగాల్లో ఉద్యోగాలు పొందే వీలు ఏర్పడుతుంది. గూగుల్ అందించే ఫ్రీ ఏఐ కోర్సులను సద్వినియోగం చేసుకోండి.