గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. మెయిన్స్ పరీక్షా సమయాల్లో మార్పు!

TGPSC Group-1 Mains: ఇటీవల తెలంగాణ గ్రూప్ -1 మెయిన్స్ పరీక్ష తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఖారురు చేసిన విషయం తెలిసిందే. తాజాగా గ్రూప్ -1 అభ్యర్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది టీజీపీఎస్‌సి.

TGPSC Group-1 Mains: ఇటీవల తెలంగాణ గ్రూప్ -1 మెయిన్స్ పరీక్ష తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఖారురు చేసిన విషయం తెలిసిందే. తాజాగా గ్రూప్ -1 అభ్యర్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది టీజీపీఎస్‌సి.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్యలు, రైతు, మహిళా సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటుంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీ పథకాల్లో భాగంగా మహాలక్ష్మి పథకం అమలు చేశారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశారు. ఇక రైతులకు రెండు లక్షణ రుణమాఫీ చేశారు. నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. దీని ప్రకారం ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు శాసన సాక్షిగా వెల్లడించారు. తాజాగా తెలంగాణ గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

ఇటీవల తెలంగాణ గ్రూప్ – 1 మెయిన్స్ ఎగ్జామ్ తేదీలను టీజీపీఎస్‌సీ ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ మెయిన్స్ ఎగ్జామ్స్ అక్టోబర్ 21 వ తేదీ నుంచి 27 వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్‌సీ నిర్ణయించింది. ఎగ్జామ్స్ హైదరాబాద్ (హెచ్ ఎండీఏతో సాహా) పరిధిలో జరగనున్నాయి. మొత్తం 563 గ్రూప్ – 1 పోస్టులకు గాను 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రిలిమ్స్ కు రాష్ట్ర వ్యాప్తంగా 897పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 3.02 లక్షల మంది అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే. ప్రతి పేపర్ కు మూడు గంటల సమయంతో పాటు 150 మార్కులు కేటాయించారు. తాజాగా గ్రూప్ – 1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది.

తెలంగాణలో గ్రూప్ – 1 మోయిన్స్ పరీక్షల సమయంలో స్వల్ప మార్పులు జరిగాయి. గతంలో చెప్పినట్లు అక్టోబర్ 21 నుంచి 27 వ తేదీ వరకు మెయిన్స్ పరీలు జరగనుండగా.. తాజాగా పరీక్ష సమాలను మారుస్తూ టీజీపీఎస్‌సీ నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా, గతంలో మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (TGPSC)పరీక్షా సమయాన్ని అరగంట ముందుకు జరిపింది. పరీక్షల సమయాన్ని గురింవి గ్రూప్ – 1 అభ్యర్థులు గమనించగలరని తెలిపింది.

 

Show comments