iDreamPost
android-app
ios-app

రేపు స్కూల్స్- కాలేజీలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

Tomorrow Holiday For Schools And Colleges: ఆంధ్రప్రదేశ్- తెలంగాణ ప్రభుత్వాలు రేపు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాయి. మొహర్రం సందర్భంగా రేపు అన్ని కాలేజీలు- స్కూల్స్ కి సెలవు ఇచ్చారు.

Tomorrow Holiday For Schools And Colleges: ఆంధ్రప్రదేశ్- తెలంగాణ ప్రభుత్వాలు రేపు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాయి. మొహర్రం సందర్భంగా రేపు అన్ని కాలేజీలు- స్కూల్స్ కి సెలవు ఇచ్చారు.

రేపు స్కూల్స్- కాలేజీలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యా సంస్థలకు ప్రభుత్వాలు రేపు(బుధవారం) సెలవు ప్రకటించింది. ముస్లింలు జరుపుకునే ముఖ్యమైన పండగల్లో ఒకటైన మొహర్రం సందర్భంగా ఈ సెలవును ప్రకటించారు. రంజాన్, బక్రీద్ తర్వాత మెహర్రంనే ముస్లింలు ప్రముఖంగా జరుపుకుంటారు. దీనిని పీర్ల పండగ అని కూడా అంటారు. ఈ నేపథ్యంలోనే ఏపీ, తెలంగాణలోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అందుకు సంబంధించి ఆయా విద్యాశాఖల అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే జులై 17వ తారీఖున తొలి ఏకాదశి కూడా ఉంది. హిందువులకు ఎంతో ముఖ్యమైన పండుగల్లో తొలి ఏకాదశి కూడా ఒకటి. ఈరోజు విష్ణుమూర్తి- లక్ష్మీదేవిలను ఆరాధిస్తారు.

సెలవులు పొడిగించే ఛాన్స్?:

రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న 5 రోజుల్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన విషయం అందరికీ తెలిసిందే. ఆగ్నేయ- పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనంతో పాటుగా.. షియర్ జోన్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే ఆస్కారం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అలాగే ఈశాన్య తెలంగాణలోని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. జులై 18, 19 తేదీల్లో ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఈ పరిస్థితి ఇక్కడే కాదు.. గోవా, కర్ణాటక, కేరళలో కూడా ఇలాగే ఉంది. అక్కడ కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే మూడ్రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సెలవులను పొడిగించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే నిజంగానే భారీ వర్షాలు కురిస్తే.. అధికారులు సెలవుల గురించి ఆలోచించే ఆస్కారం ఉంటుంది. లేదంటే.. కేవలం జులై 17న మాత్రం సెలవు దినం అవుతుంది.