iDreamPost
android-app
ios-app

అయోధ్య రాముడిని రామ్ లల్లా అని ఎందుకు పిలుస్తారు? పెద్ద కారణమే ఉంది!

  • Published Jan 06, 2024 | 1:53 PM Updated Updated Jan 06, 2024 | 1:53 PM

అయోధ్య లో ఆ బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట వేడుకులు.. మరి కొన్ని రోజుల్లో అంగరంగ వైభవంగా మొదలవ్వనున్నాయి. ఇప్పటికే దానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ అయోధ్య రాముడిని రామ్ లల్లా అని కూడా అంటూ ఉంటారు. అలా పిలవడానికి గల కారణం ఇదే.

అయోధ్య లో ఆ బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట వేడుకులు.. మరి కొన్ని రోజుల్లో అంగరంగ వైభవంగా మొదలవ్వనున్నాయి. ఇప్పటికే దానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ అయోధ్య రాముడిని రామ్ లల్లా అని కూడా అంటూ ఉంటారు. అలా పిలవడానికి గల కారణం ఇదే.

  • Published Jan 06, 2024 | 1:53 PMUpdated Jan 06, 2024 | 1:53 PM
అయోధ్య రాముడిని రామ్ లల్లా అని ఎందుకు పిలుస్తారు? పెద్ద కారణమే ఉంది!

కన్నుల పండుగగా అయోధ్యలో కొలువ తీరబోయే శ్రీ రాముని ప్రాణ ప్రతిష్టకు.. కోట్లాది మంది భారతీయులు ఎదురు చూస్తున్నారు. దేశంలోని అందరినీ ఆహ్వానించడం దగ్గర నుంచి.. వచ్చిన భక్తులకు సౌకర్యాలను ఏర్పాటు చేయడం వరకు అన్ని పనులు చక చక జరుగుతున్నాయి. రాముల వారి గర్భ గుడిలో ప్రతిష్టించేందుకు.. చక్కటి శిల్పాలను కూడా సిద్ధం చేశారు. అంతే కాకుండా ఇప్పటికే దేశంలోని చాలా మంది ఇళ్లకు రాముల వారి ఆశీర్వాదంగా.. అక్షింతలను అందచేశారు. జనవరి 22న ఈ మహోన్నత కార్యక్రమం.. పీఎం నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది. అయితే, ఇక్కడ ప్రతిష్టించనున్న ఈ బాల రాముడిని రామ్ లల్లా అని కూడా పిలుస్తూ ఉంటారు. అసలు ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం.

గోస్వామి తులసీ దాస్ హిందీ భాషలో నిష్ణాతుడైన ఓ గొప్ప కవి. ఈయన శ్రీరామునికి పరమ భక్తుడు. ఎల్లపుడూ రామ నామాన్నే జపిస్తూ ఉండేవారు. రామాయణాన్ని హిందీ భాషలో అందించిన మొదటి కవి తులసీ దాస్. వాల్మీకి రచించిన రామాయణాన్ని అందరూ చదవడానికి వీలుగా.. తులసి దాస్ దానిని హిందీలో అనువదించారు. అలా అనువదించిన రామాయణానికి ‘శ్రీ రామ చరిత మానస్’ గా నామకరణం చేశారు. పైగా ఈ మహాకార్యాన్ని శ్రీ రాముని జన్మ భూమి అయిన అయోధ్యలోనే చేపట్టడం విశేషం. అయితే ఈ రామ భక్తుడు ‘రామచరిత మానస్’ పుస్తకంలో ఆ బాల రాముడిని సంబోదించేటపుడు ‘రామ్ లల్లా’ అని పిలిచేవారు. అంటే సహజంగా ఇంట్లో తల్లిదండ్రులు తమ పిల్లలని ముద్దు పేర్లతో ఎలా అయితే.. పిలుచుకుంటారో. తులసీ దాస్ కూడా తన పద్యాలలో ఈ అయోధ్య రాముడిని బాల రాముడిగా భావించి.. ఆ రామునిపై ఉన్న అంతులేని ప్రేమతో ముద్దుగా రామ్ లల్లా అని పిలిచారు.

Why Ayodhya Rama is called Ram Lalla

దానిని అనుసరించి ఇప్పుడు ఆ పేరునే అందరూ ప్రచారంలోకి తీసుకుని వచ్చారు. తులసీదాస్ రామచరిత మానస్ గ్రంధంలో ఈ బాల రాముడిని ఎంతో అద్భుతంగా వర్ణించారు ఆయన. ఈ వర్ణనను దృష్టిలో ఉంచుకుని.. ఇప్పుడు అయోధ్య రామ మందిరంలో ప్రతిష్టించబోయే బాల రాముడి విగ్రహాలను తయారు చేశారు. జనవరి 22 మధ్యాహ్నం 12:30 నిమిషాలకు అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభించిన అనంతరం.. గర్భ గుడిలో బాల రాముని విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. రామ్ లల్లా పేరు వెనుక ఉన్న అసలు కథ ఇది. ఏదేమైనా, దేవుళ్లను సైతం అత్యద్భుతంగా వర్ణించడం కేవలం కవులకు మాత్రమే సాధ్యం. మరి కొద్ది రోజుల్లో అయోధ్యలో కొలువుతీరబోయే శ్రీరాముని కోసం కోట్ల మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు. మరి, బాల రాముడిని రామ్ లల్లా అని ప్రేమతో సంభోదించిన విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.