iDreamPost
android-app
ios-app

వరలక్ష్మీ వ్రతం శుభముహూర్త వివరాలు!

వరలక్ష్మీ వ్రతం శుభముహూర్త వివరాలు!

శ్రావణ మాసం వచ్చిందంటే చాలు.. మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు పూజలు, వ్రతాలతో ఆ దేవుడిని పరమపవిత్రంగా కొలుస్తుంటారు. ఇక వరలక్ష్మీ వ్రతం వచ్చిందంటే చాలు ఎంతో భక్తి శ్రద్ధాలతో వ్రతాలు చేయడానికి సిద్దమవుతుంటారు. ఇక అందరూ ఎంతో పవిత్రంగా భావించే ఆ వరలక్ష్మీ వ్రతం కూడా రానే వచ్చింది. ఈ నెల 25న వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకోవడానికి తెలుగు రాష్ట్రాల్లోని భక్తులు అప్పటికే అన్ని సిద్దం చేసుకున్నారు. మహిళలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఇలా ఎంతో మంది మహిళలు వరలక్ష్మీ వత్రం రోజు పూజలు చేస్తుంటారు. అయితే వరలక్ష్మీ వ్రతం రోజు ఏ సమయంలో వ్రతాన్ని ప్రారంభించాలి? అసలు ఆ రోజులో ఉన్న శుభముహూర్తాల గురించి పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా వరలక్ష్మీ వ్రతం చేయదలిచిన మహిళలు  ఆ రోజు తెల్లవారుజామున నిద్రలేవాలి. సూర్యుడు ఉదయించక ముందే తలంటూ స్నానం చేసి కొత్త బట్టలు లేదా ఉతికిన బట్టలు ధరించాలి. ఆ తర్వాతే ఉపవాస దీక్షను ప్రారంభించాలి. అనంతరం ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఇక మనసు నిండ దైవ భక్తితో ఓం హ్రీం శ్రీం లక్ష్మీ భయో నమ: అనే మంత్రాన్ని జపించి ఆ దేవుడిని ప్రార్థించాలి. ఇలా చేయడం వల్ల అనుకున్న మహిళలు అనుకున్న కోరికలు నెరవేరతాయని భక్తుల నమ్మకం.

వరలక్ష్మీ వత్రం రోజు శుభ ముహుర్తం:

నక్షత్రం : అనురాధ
అనురాధ నక్షత్ర సమయం : శుక్రవారం ఉదయం 9:15 గంటల వరకు
వృషభ లగ్నం పూజా ముహుర్తం : రాత్రి 10:50 గంటల నుంచి అర్ధరాత్రి 12:45 గంటల వరకు
సింహ లగ్న పూజా ముహుర్తం : ఉదయం 5:55 గంటల నుంచి ఉదయం 7:42 గంటల వరకు
వృశ్చిక లగ్నం పూజా ముహుర్తం : మధ్యాహ్నం 12:17 గంటల నుంచి మధ్యాహ్నం 2:36 గంటల వరకు
కుంభ లగ్నం పూజా ముహుర్తం : సాయంత్రం 6:12 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు
రాహుకాలం : 25 ఆగస్టు 2023 శుక్రవారం ఉదయం 10:52 గంటల నుంచి మధ్యాహ్నం 12:25 గంటల వరకు
యమ గండం : 25 ఆగస్టు 2023 శుక్రవారం మధ్యాహ్నం 3:31 నుంచి సాయంత్రం 5:04 గంటల వరకు
వర మహాలక్ష్మీ 2023 పూజకు అనుకూలమైన సమయం : 25 ఆగస్టు 2023న ఉదయం 9:15 గంటలకు పూజను ప్రారంభించొచ్చు.