P Krishna
Varalakshmi Vratham 2024: ఇటీవల మార్కెట్‌లో నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతున్నాయి.. దీనికి తోడు పండగలు వచ్చాయంటే చాలు వర్తకులు పూలు, పండ్ల దరలు అమాంతం పెంచేస్తుంటారు. సామాన్యులు మార్కెట్ కి వెళ్లి వస్తువులు కొనాలంటే భయపడే పరిస్థితి ఏర్పడుతుంది.
Varalakshmi Vratham 2024: ఇటీవల మార్కెట్‌లో నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతున్నాయి.. దీనికి తోడు పండగలు వచ్చాయంటే చాలు వర్తకులు పూలు, పండ్ల దరలు అమాంతం పెంచేస్తుంటారు. సామాన్యులు మార్కెట్ కి వెళ్లి వస్తువులు కొనాలంటే భయపడే పరిస్థితి ఏర్పడుతుంది.
P Krishna
శ్రావణ మాసంలో రెండో శుక్రవారం మహిళలు ఎంతో భక్తి శ్రద్దలతో వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. పూజలో అమ్మవారిని పూలు, పండ్లతో అలంకరించి వివిధ నైవేద్యాలు సమర్పిస్తారు. ఎవరి స్థోమతకు తగ్గట్టు వారు అమ్మవారిని బంగారంతో అలంకరిస్తారు. శ్రావణ మాసంలో వరుసగా శుభకార్యాలు, పండగలు మొదలయ్యాయి.. దానికి తగ్గట్టు మార్కెట్ లో పూల ధరలు భారీగా పెరిగిపోయాయి. గురువారం కొంతమంది వ్యాపారులు పూజా సామాగ్రి అమాంతం పెంచేశారు. ఇక పూలు, పండ్ల ధరలు చుక్కలంటుతున్నాయని భక్తులు వాపోతున్నారు. పండుగ పూట వ్యాపారులు దోచుకుంటున్నారని అంటున్నారు. ధరలు ఎంత ఉన్నా మార్కెట్లు మాత్రం కిటకిటలాడిపోయాయి. వివరాల్లోకి వెళితే..
ప్రతి ఏడాది శ్రవాణ మాసంలో రెండో శుక్రవారం మహిళలు తమ సౌభాగ్యం కోసం, సంతానం చల్లగా ఉండాలని అమ్మవారి కరుణ కటాక్షాలు తమపై చూపించాలని ‘వరలక్ష్మీ వ్రతం’ ఆచరిచడం ఆనవాయితీగా వస్తుంది. నేడు ఆగస్టు 16, శుక్రవారం ‘వరలక్ష్మీ వ్రతం’. ఈ సందర్బంగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఉదయం నుంచి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వరలక్ష్మి వ్రతం రోజు కొత్తగా పెళ్లయిన దంపతులు భక్తి శ్రద్దలతో పూజలు చేస్తే సుఖశాంతులతో దీర్ఘ సుమంగళిగా ఉంటారని పండితులు చెబుతుంటారు.ఇదిలా ఉంటే వరలక్ష్మి వ్రతం పండుగ సందర్భంగా మార్కెట్‌లో వ్యాపారులు భక్తులను నిలువునా దోచేస్తున్నారని అంటున్నారు. పూలు, పండు, పూజ సామాగ్రి ధరలు అమాంతం పెంచేశారని వాపోతున్నారు.
గత నెలలో మల్లెల ధర కేజీ రూ.550 ఉంటే.. ప్రస్తుతం హూల్ సేల్ మార్కెట్ లో కేజీ రూ.1500 లకు చేరింది. తెల్ల చామంతి రూ.200 నుంచి 350, పసుపు చామంతి రూ.150 నుంచి రూ.400, కనకాంబం రూ.100 నుంచి రూ.300, లిల్లి రూ.150 నుంచి రూ.500, జాజులు రూ.300 నుంచి రూ.1200 వరకు పెరిగాయి. ఇక బహిరంగ మార్కెట్ లో అయితే వీటి ధర మరింత అధికంగా పలికాయి. యాపిల్స్ వందకు మూడు, దానిమ్మ వందకు రెండు, సీతాఫలాలు సైజు ను బట్టి వందకు నాలుగు, అరటి పండ్ల వ్యాపారులతై మరీ దారుణంగా దోచుకున్నారు. డజను ఏకంగా రూ.100లకు అమ్మారు. ఏది ఏమైనా అడగ్గానే వరాలిచ్చే లక్ష్మీ దేవి కోసం భక్తులు ఎంత ఖర్చయినా భరిస్తారు. అటు ఏపీలో కూడా ఇదే పరిస్థితి ఉందని అంటున్నారు. ధరలు ఎలా ఉన్నా మార్కెట్ మాత్రం గురువారం కిటకిటలాడిపోయింది.