P Krishna
దీపావళికి రెండు రోజుల ముందు వచ్చే కృష్ణ పక్షంలోని త్రయోగదశి రోజున హిందువులు ధన త్రయోదశి పండుగ జరుపుకుంటారు.
దీపావళికి రెండు రోజుల ముందు వచ్చే కృష్ణ పక్షంలోని త్రయోగదశి రోజున హిందువులు ధన త్రయోదశి పండుగ జరుపుకుంటారు.
P Krishna
భారత దేశం హిందూ సంప్రదాయంలో ధన త్రయోదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఏడాది దీపావళికి రెండు రోజుల ముందు వచ్చే కృష్ణ పక్షంలోని త్రయోగదశి రోజున హిందువులు ఈ పండుగ జరుపుకుంటాయి. ధన త్రయోదశి పండుగ రోజు లక్ష్మీ దేవికి చాలా ఇష్టం అని అంటారు. ఈ ఏడాది ధన త్రయోదశి నవంబర్ 10వ తేదీన వస్తుంది. ధన త్రయోదశి అంటే సంపద, శ్రేయస్సు కు సంబంధించిన వివిత్రమైన పండుగ అని అంటారు. ధన త్రయోదశి కొంతమంది రాశుల వారికి గొప్ప అదృష్టాన్ని కలిగిస్తుంది. వివరాల్లోకి వెళితే..
మహాలక్ష్మికి ఎంతో ప్రితికరమైన పండుగల్లో ఒకటి ధన త్రయోదశి. ధన త్రయోదశి పర్వదినం రోజున శని స్వరాశి అనగా కుంభరాశిలో ఉంటారు. శుక్రుడు కన్యారాశి, బృహస్పతి మేశరాశి, సూర్యడు తులరాశి లో ఉంటారు. ఈ ఏడాది మరో విషయం ఏంటంటే.. ఈ గ్రహాల కలయిక దాదాపు 59 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. శుక్రుడు కన్యారాశిలో.. చంద్రుడు కూడా కన్యారాశిలో ఉంటాడు. ధన త్రయోదశి కన్యారాశిలో శుక్రుడు, చంద్రుడు కలయిక వల్ల శుక్ర శశి యోగం ఉంటుంది.. ఈ అరుదైన కలయికల వల్ల ఐదు రాశుల వారు గొప్ప ప్రయోజనం పొందుతారు.
ధనుస్సు రాశి : ధన త్రయోదశి లో ధనుస్సు రాశి వారికి ఎప్పటి నుంచో ఉన్న ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. దీపావళి సందర్భంగా రావాల్సిన బకాయిలు వస్తాయి. వ్యాపారులకు మంచి లాభాలు సమకూరుతాయి. కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. కొత్త ఆదాయ వనరులు సమకూరుతాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారికి మంచి అనుకూలం. ఉద్యోగస్తులకు బోనస్ తో పాటు ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు విదేశీ ప్రయాణం అవకాశం ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
వృశ్చిక రాశి : ఈ ఏడాది దీపావళి పండుగ సందర్భంగా వృశ్చిక రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులకు మంచి విజయాలు సాధిస్తారు. కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. ఆర్థిక సమస్యల నుంచి బయట పడతారు. ఉద్యోగులకు ప్రమోషన్లు, బోనస్ లు వచ్చే అవకాశం ఉంది. తోబుట్టువుల సహాయసహకారాలు ఉంటాయి.
సింహ రాశి : ఈ ఏడాది ధన త్రయోదశి నుంచి సింహరాశి వారికి గొప్ప అదృష్టం కలిసి వస్తుంది. మంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు. వారసత్వ సంపద కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు.. చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు.
కర్కాటక రాశి : దీపావళి పండుగ నుంచి ఈ రాశి గల వారికి ఆకస్మిక ధన లాభం. వ్యాపారం చేసుకునేవారికి బాగా కలిసి వస్తుంది. ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. డబ్బు చాలా జాగ్రత్తగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. మానసిక ప్రశాంతతను పొందే అవకాశం ఉంటుంది. ఆద్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
మేష రాశి : ఈ రాశి గల వారికి శుభ గ్రహ కలయిక ఫలితం గొప్పగా ఉండబోతుంది. మంచి ఆరోగ్యంతో ఉంటారు. ఏళ్లనాటి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. దాంపత్య జీవితం చక్కగా ఉంటుంది. గతంలో ఉన్న సమస్యలు సమసిపోతాయి. వృత్తి వ్యాపారాల్లో మంచి గుర్తింపు వస్తుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు, బోనస్ లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో ఉంటారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.