iDreamPost
android-app
ios-app

ఈ ఉగాది నాడు బుధ, శుక్ర, సూర్యుని సంయోగం వల్ల 5 రాశులకు రాజయోగం!

  • Published Apr 04, 2024 | 7:19 PM Updated Updated Apr 05, 2024 | 5:03 PM

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. కొత్త సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా చైత్ర నవరాత్రులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఈ క్రోధి నామ సంవత్సరం ఉగాది నాడు బుధుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఆ సమయంలో బుధుడు, శుక్రుడు సూర్యుని కలయిక వలన ఈ 5 రాశుల వారకిి రాజయోగం పట్టనుంది. మరి ఆ 5 రాశులు ఏమిటో తెలుసుకుందాం.

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. కొత్త సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా చైత్ర నవరాత్రులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఈ క్రోధి నామ సంవత్సరం ఉగాది నాడు బుధుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఆ సమయంలో బుధుడు, శుక్రుడు సూర్యుని కలయిక వలన ఈ 5 రాశుల వారకిి రాజయోగం పట్టనుంది. మరి ఆ 5 రాశులు ఏమిటో తెలుసుకుందాం.

  • Published Apr 04, 2024 | 7:19 PMUpdated Apr 05, 2024 | 5:03 PM
ఈ ఉగాది నాడు బుధ, శుక్ర, సూర్యుని సంయోగం వల్ల 5 రాశులకు రాజయోగం!

సాధారణంగా ప్రతి ఏడాది చైత్రమాసం పాడ్యమి రోజున.. కొత్త సంవత్సరం, ఉగాది పండుగను జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇది హిందువులకు అత్యంత ముఖ్యమైన తెలుగు పండుగ. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 8 అమావాస్యతో శోభకృతనామ సంవత్సరం పూర్తయ్యి, క్రోధి నామ సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఇక ఈ ఉగాది పండుగ నుంచి చైత్ర నవరాత్రులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. అయితే క్రోధి నామ సంవత్సరం ఉగాది సందర్భంగా.. బుధుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. అనగా ఏప్రిల్ 9వ తేదీ రాత్రి 9:30 గంటలకు బుధుడు మీన రాశిలో సంచరిస్తాడు. అంటే నవరాత్రి మొదటి రోజున బుధుడు, శుక్రుడు సూర్యుని కలయిక వలన కొన్ని రాశుల వారికి చాలా అదృష్టాన్ని చేకూర్చి రాజయోగ ప్రయోజనాలు కలగనున్నాయి. మరి, ఈ ఉగాది నాటికి అదృష్టం పట్టాబోతున్న ఈ 5 రాశులేవో తెలుసుకుందాం.

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. కొత్త సంవత్సరం క్రోధి నామ సంవత్సరం.. ఏప్రిల్ 9, 2024 మంగళవారం ఉగాది నాడు ప్రారంభమవుతుంది. కనుక అదే రోజున చైత్ర నవరాత్రులు కూడా ప్రారంభమవుతున్నాయి. ఇక ఈ కొత్త సంవత్సరం సందర్భంగా.. బుధుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఏప్రిల్ 9వ తేదీ రాత్రి 9:30 గంటలకు బుధుడు మీన రాశిలో సంచరిస్తాడు. కనుక ఈ నవరాత్రి సందర్భంగా.. బుధుడు, శుక్రుడు సూర్యుని కలయిక కొన్ని రాశుల వారికి చాలా అనుకూలమైన సమయంగా మారబోతుంది. ఇక మీనరాశిలో బుధుడు సంచరించడం వల్ల బుధుడు, శుక్రుడు, సూర్యుడు కలయిక వల్ల ఈ 5 రాశుల వారకిి రాజయోగం పట్టనుంది. మరి ఆ 5 రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మిథున రాశి

ఈ బుధ సంచారము మిథునరాశి వారికి అదృష్టాన్ని వరించబోతుంది.  ఇక తమ వృత్తిలో కూడా గొప్ప పురోగతిని సాధిస్తారు.  అలాగే గత కొంత కాలంగా కెరీర్‌లో నిరుత్సాహానికి గురవుతున్నా వారికి ఈ ఏడాది ఉద్యోగ ఆవకాశలు పొందనున్నారు.  అదే సమయంలో, కార్యాలయంలో ప్రమోషన్ కోసం  ఎదురు చూసే వారికి అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో, వ్యాపార వ్యక్తులు అనేక కొత్త ఒప్పందాలు, కొత్త ప్రయోజనాలు పొందుతారు. తద్వారా వారి వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతుంది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభించే సమయం ఆసన్నమైంది. కనుక ఈ రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలమైనది. అలాగే కార్యాలయంలో విజయం సాధిస్తారు. మీ  పనిలో ప్రమోషన్స్ కూడా పొందుతారు.  ఇక  మీ పని పట్ల ప్రత్యర్థులతో ప్రశంసలు కూడా పొందుతారు. అంతేకాకుండా.. వ్యాపారంలో ఈ ఏడాది అన్ని కొత్త ఒప్పందాలతో పాటు మంచి లాాభాలను పొందుతారు. పైగా ఈ ఏడాది కర్కాటక రాశి వారికి అన్ని శుభ శకునాలే రాబోతున్నాయి.

కన్యరాశి

బుధుడు, శుక్రుడు సూర్యుని కలయిక కన్య రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.  అలాగే  సమాజంలో వీరికి  గౌరవం పెరగనుంది. ఇక కన్యారాశి వారికి కొత్త అవకాశాలు లభించడంతో అదాయ అవకాశాలు కూడా లభిస్తాయి.  అంతేకాకుండా కన్యా రాశి వారికి వృత్తిలో  చాలా పురోగతిని పొందుతారు. ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులు చాలా మంది గొప్ప వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఇది వారి వ్యాపారానికి ఎంతో  ప్రయోజకరంగా మారుతుంది.  ఒక రకంగా చెప్పలంటే ఈ  కన్యరాశి వారకి ఈ ఏడాది పట్టిదంతా బంగారంలా మారబోతుంది.

మకర రాశి

మకర రాశి వారు ఈ సమయంలో అన్ని వైపుల నుంచి  ప్రయోజనాలను పొందుతారు.  ముఖ్యంగా మీ కెరీర్‌లో కొత్త విజయాన్ని పొందుతారు. అలాగే   ఈ ఏడాది మంచి ఉద్యోగం పొందుతారు. ఇక వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఈ సమయం చాలా మంచిది.  ఇక మీ  కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.  అలాగే  మకర రాశి వారికి ఈ ఏడాది విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు విదేశాలకు వెళ్లి ఆనందిస్తారు.

మీన రాశి

మీనరాశిలో బుధుడు సంచారం మీన రాశి వారికి చాలా మేలు చేస్తుంది. అలాగే ఈ రాశి వారికి  ఆధ్యాత్మికత భావం  మనస్సులను నింపుతుంది, దీని కారణంగా వారు తమ సమస్యలన్నింటినీ ఓపికతో పరిష్కరించుకోగలుగుతారు. అంతేకాకుండా, మీన రాశి వారు తమ వృత్తిలో పురోగతిని సాధిస్తారు. కెరీర్ పరంగా, మీన రాశి వారికి అనేక కొత్త అవకాశాలు అందుకుంటారు.  దీని కారణంగా మీన రాశికి అదృష్టం ప్రకాశిస్తుంది. ఈ శుభ సమయం ప్రభావం కారణంగా మీ  కష్టానికి తగిన ఫలితాలు కూడా పొందుతారు. మీ పని గుర్తించి చాాలామంది మిమ్మల్ని అభినందిస్తారు.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibompiabellacasinojojobet girişbahiscasinoMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabetbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet