P Krishna
Break for Auspicious Programs: ఎండకాలం వచ్చిందంటే పలు శుభకార్యాలతో విధులు డబ్బుల మోతలు, డీజే సౌండ్స్ తో దద్దరిల్లిపోతుంటాయి. కానీ ఈ వేసవి కాలంలో మూడు నెలల వరకు సందడి లేదని పండితులు అంటున్నారు.
Break for Auspicious Programs: ఎండకాలం వచ్చిందంటే పలు శుభకార్యాలతో విధులు డబ్బుల మోతలు, డీజే సౌండ్స్ తో దద్దరిల్లిపోతుంటాయి. కానీ ఈ వేసవి కాలంలో మూడు నెలల వరకు సందడి లేదని పండితులు అంటున్నారు.
P Krishna
దేశంలో ఎండాకాలం వచ్చిందంటే పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలతో పట్టణాలు, పల్లెలు కోలాహలంగా సందడి వాతావరణం నెలకొంటుంది. ఎండాకాలంలో విద్యాసంస్థలకు సెలవులు.. కొంతమంది ఉద్యోగస్తులకు ప్రత్యేక సెలవులు తీసుకొని శుభకార్యాలకు వెళ్తుంటారు. ఎండా కాలంలో నగరాల్లోని ఫంక్షన్ హాల్స్ మొత్తం బిజీగా మారిపోతాయి.. ఒక్కరోజు కూడా ఫ్రీగా ఉండవు. అలాంది ఈ రోజు నుంచి మూడు నెలల వరకు పెళ్లిళ్లు సహా ఇతర శుభకార్యాలకు బ్రేక్ పడబోతునట్లు వార్తలు వస్తున్నాయి. అదేంటీ ఎండ కాలంలోనే మంచి ముహూర్తాలు ఉంటాయి.. శుభకార్యాలు జరుపుతుంటారు. మరి ఈ విపరీతమ పరిణాం ఏంటా? అని ఆలోచనలో పడ్డారా? మరి మూడు నెలలు ఎందుకు బ్రేక్ వచ్చింది అన్న విషయం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
వేసవి కాలం వచ్చిందంటే పెళ్లిళ్ల తో పాటు ఇతర శుభకార్యాలు జరుపుకుంటారు. కానీ.. ఈసారి వేసవి కాలంలో శుభకార్యాలకు బ్రేక్ పడింది. వచ్చే 3 నెలల పాటు ఎలాంటి శుభ ముహూర్తాలు లేకపోవడం దీనికి కారణం అంటున్నారు వేద పండితులు. ఏప్రిల్ 29 నుంచి మూడు నెలల పాటు వైశాఖ, జ్యేష్ట, ఆషాఢ మాసాల్లో గురు,శుక్ర మౌఢ్యమి వల్ల ఎలాంటి ముహూర్తాలు లేవని పండితులు అంటున్నారు. ఈ పరిణామం వల్ల పెళ్లిళ్లు, నూతన గృహ ప్రవేశం, దేవతా విగ్రహ ప్రతిష్టాపన, శంకుస్థాపనల వంటి కార్యక్రమాలకు పూర్తిగా బ్రేక్ పడింది. సాధారణంగా భానుడి కాంతి గురు గ్రహంపై పడినపుడు గురు మౌఢ్యమి, శుక్ర గ్రహం పడితే శుక్ర మౌఢ్యమి సంక్రమిస్తుందని పండితులు చెబుతున్నారు. దీని ఫలితంగా ఆయా గ్రహాల గమనం తెలియక శుభ ముహూర్తాలు పెట్టడం కుదరదని అంటున్నారు.
పండితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 28 చైత్ర బహుళ చవితి ఆదివారం నుంచి జులై 8 ఆశాఢ శుద్ది తదీయ సోమవారం వరకు శుక్ర పౌఢ్యమి, గురు పౌఢ్యమి మే 7 చైత్ర బహుళ చతుర్ది మంగళవారం నుంచి జూన్ 7 జ్యేష్ఠ శుక్ల పాఢ్యమి గురువారం వరకు కొనసాగుతుందని అంటున్నారు. అయితే గురు, శుక్ర మూఢాల్లో ఎలాంటి శుభకార్యాలు చేయడం మంచిది కాదని వేద పండితులు సూచిస్తున్నారు. ఇక మూడు నెలలు ముహూర్తాలు లేకపోవడంతో పెళ్లి కాని ప్రసాదులు నిరుత్సాహంలో మునిగిపోయారు. మరోవైపు మూడు నెలల పాటు వస్త్ర దుఖానాలు, బంగారు ఆభరణాలు, ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులు గిరాకీ లేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాగే డబ్బు వాయిద్యాలు, డీజేలు, బారాత్ లు నిర్వహించే వారికి 3 నెలలు కష్టాలు తప్పవంటున్నారు.