iDreamPost
android-app
ios-app

అంగరంగ వైభవంగా శ్రీ రామలింగేశ్వరస్వామి తిరునాళ్ళు! రాముడే మొదటి భక్తుడు!

Sri Ramalingeswara Swamy Brahmotsavam: ఏపీలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో నెల్లూరు జిల్లాలోని శ్రీరామతీర్థం ఒకటి. ఇక్కడ వెలసిన శ్రీ కామాక్షి సమేత శ్రీరామలింగేశ్వర స్వామికి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆలయ చరిత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం...

Sri Ramalingeswara Swamy Brahmotsavam: ఏపీలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో నెల్లూరు జిల్లాలోని శ్రీరామతీర్థం ఒకటి. ఇక్కడ వెలసిన శ్రీ కామాక్షి సమేత శ్రీరామలింగేశ్వర స్వామికి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆలయ చరిత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం...

అంగరంగ వైభవంగా శ్రీ రామలింగేశ్వరస్వామి తిరునాళ్ళు! రాముడే మొదటి భక్తుడు!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో నెల్లూరు జిల్లాలోని రామతీర్ధం వెలసిన శ్రీరామలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం ఒకటి. స్వామి వారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇది ఇలా ఉంటే.. ఏటా రామతీర్థం బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. ఈ ఏడాది కూడా శ్రీరామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకలకు రామతీర్థం సిద్ధమైంది. విద్యుత్ కాంతుల వెలుగులో రామతీర్థం మెరిసిపోతుంది. పది రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రేపు, ఎల్లుండి ముఖ్య కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రామతీర్థం పుణ్యక్షేత్ర వృత్తాంతం  ఏమిటో ఇప్పుడు చూద్దాం…

నెల్లూరుకు 30 కిలోమీటర్ల దూరంలో విడవలూరు మండలం రామతీర్థంలో శ్రీ కామాక్షి సమేత శ్రీరామలింగేశ్వర స్వామి వెలిశారు. త్రేతాయుగంలో శ్రీరాముడు రావణుడి సంహరం చేసే సమయంలో నెల్లూరు ప్రాంతంలో నడియాడారు. ఈ క్రమంలోనే ఇక్కడి సముద్ర తీర ప్రాంతంలో శ్రీరాముడు శివుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అందుకే ఈ క్షేత్రానికి రామతీర్థమని, ఇక్కడ వెలసిన శివుడిని శ్రీరామలింగేశ్వర స్వామి అని పిలుస్తుంటారు. ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తుంటారు. 14 శతాబ్దంలో పల్లవరాజు.. ఇక్కడ శ్రీరాముడు ప్రతిష్టించిన శివలింగాన్ని గుర్తించారు. ఆయనకు దేవులపై ఉన్న భక్తితో ఈ ఆలయాన్ని నిర్మించారు. అనంతరం 18వ శతాబ్దంలో నెల్లూరు జిల్లాకు చెందిన స్థానికుడైన..కోటంరెడ్డి శేషాద్రి రెడ్డికి కలలో శివుడు కనిపించాడంట. దీంతో ఆయన ఈ ఆలయాన్ని పున: నిర్మించారు. అంతేకాక ఏటా ఈ స్వామి వారికి వేడుకలు నిర్వహించేవారు. అలా శ్రీరామ లింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.

సముద్ర తీరాన ఉన్న రామతీర్ధంలో కొలువైన రామలింగేశ్వరస్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అయితే ఇక బ్రహ్మోత్సవాల సమయంలో ఈ సంఖ్య భారీగా ఉంటుంది. శ్రీ రామలింగేశ్వస్వామి వారి బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు సముద్రస్నానం ఆచరిస్తారు.  అనంతరం శ్రీరాముడు శివార్చన చేసిన శివలింగాన్ని దర్శించి.. పూజలు నిర్వహిస్తూ.. కోరిన కోరికలు తీరుతాయని అక్కడి భక్తుల నమ్మకం. శివ కేశవలును ఒక్కేసారి దర్శనం చేసుకున్నంత పుణ్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తున్నారు.  శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఇప్పటికే అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలు ప్రారంభానికి సూచికగా పుట్ట మన్నులో, పాలలో నానబెట్టి మొలకేత్తిన నవధాన్యాలను బీజావాపన చేస్తారు దీనినే అంకురారోపణగా పిలుస్తారు.

అనంతరం గణపతి పూజ, పుణ్యావహచన, యాగశాల ప్రవేశం, యాగశాల శుద్ధి, శోభ కుంభ ప్రతిష్ఠ, పుట్టమన్ను సేకరణ, మృత్క సంగ్రహణం, నవబీజావాపన కార్యక్రమాలను నిర్వహించారు. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా జులై 4వ తేదీన శ్రీరామలింగేశ్వర స్వామి కల్యాణం జరగనుంది. అలానే జులై 5వ తేదీన స్వామివారి సముద్ర స్నానం ఉంటుంది. 10 రోజుల పాటు జరగనున్న ఈ బ్రహొత్మవాల్లో..స్వామి వారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇస్తుంటారు. ఇక శ్రీరామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల భక్తులు భారీగా తరలివస్తారు. రామతీర్థం బ్రహ్మోత్సవాల్లో రథోత్సవం, శివకల్యాణం, తీర్థవాధి ఘట్టాలు మహావైభవంగా జరుగుతాయి. సుమారు రెండు లక్షల మంది భక్తులకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.