Tirupathi Rao
Sri Rama's Sister Shanta Devi: భారతీయులకు ఎంతో ప్రత్యేకమైన శ్రీరామనవమిని మరి కొన్ని గంటల్లో కన్నుల పండువగా జరపుకోనున్నారు. మరి.. ఈ శ్రీరామనవమి సందర్భంగా ఆ రాములవారి అక్క గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకోండి.
Sri Rama's Sister Shanta Devi: భారతీయులకు ఎంతో ప్రత్యేకమైన శ్రీరామనవమిని మరి కొన్ని గంటల్లో కన్నుల పండువగా జరపుకోనున్నారు. మరి.. ఈ శ్రీరామనవమి సందర్భంగా ఆ రాములవారి అక్క గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకోండి.
Tirupathi Rao
రాముడు గురించి, రామాయణం గురించి భారతీయులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీరాముడి గొప్పతనం అందరికీ తెలుసు. ఒక వ్యక్తి ఎలా ఉండాలి అనే విషయానికి ఉదాహరణగా ముందుగా చూపించేది రాముడినే. అలాంటి రాముడి గురించి అందరికీ స్పష్టంగా తెలుసు. అలాగే రాముడి భార్య సీత, సోదరుడు లక్ష్మణుడు, భక్తుడు హనుమంతుడి గురించి కూడా భారతీయులకు బాగా తెలుసు. కానీ, ఆ శ్రీరాముల వారికి ఒక అక్క ఉందని మీకు తెలుసా? మీకే కాదు.. ఎంతో మందికి ఈ విషయం తెలీదు. ఆ శ్రీరామచంద్రమూర్తి కంటే ముందే దశరథ మహారాజు- కౌసల్యకు ఒక కుమార్తె జన్మించింది. మరి.. ఈ శ్రీరామనవమి సందర్భంగా అయినా ఆ కథ ఏంటో తెలుసుకోండి.
దశరథ మహారాజు- కౌసల్య పుత్ర కామేష్టి యాగం చేసిన తర్వాత శ్రీరాముడు జన్మించారని అందరికీ తెలుసు. అయితే ఈ పుత్రకామేష్టి యాగానికంటే ముందే దశరథ మహారాజు- కౌసల్యకు ఒక పుత్రిక జన్మించింది. ఆ పుత్రికకు శాంత అని నామకరణం చేశారు. అయితే శాంతాదేవి అంగవైకల్యంతో జన్మించడంతో మహర్షులు ఇచ్చిన సలహా మేరకు ఆమెను దత్తత ఇచ్చారు. అంగదేశ రాజైన రోమాపాదుడికి శాంతను దత్తత ఇచ్చారు. అక్కడ ఆమెకు సరైన వైద్యం అందడంతో శాంతాదేవి తిరిగి మామూలు మనిషిగా మారింది. శాంత ఎంతో గొప్ప అందగత్తె కూడా. అంతేకాకుండా వేదాలు వల్లించడం, యుద్ధ కళ, హస్త కళల్లో ప్రావీణ్యం సాధించింది.
శాంతాదేవి అంగదేశంలో ఒకానొక సమయంలో విపరీతమైన కరువు వచ్చింది. ఎవరికీ ఏం చేయాలో తెలియదు. ఆ సమయంలో శాంతాదేవికి రుష్యశృంగ మహర్షిని ఇచ్చి వివాహం జరిపించారు. ఆ తర్వాత రుష్యశృంగ మహర్షి ఒక యజ్ఞం నిర్వహించారు. ఆయన నిర్వహించిన యజ్ఞంతోనే అంగదేశం కరువు నుంచి బయటపడింది. తర్వాత అంగదేశంలో సుఖసంతోషాలతో శోభిల్లింది. అయితే ఈ మొత్తం విషయాలను అబద్దం అనో.. కట్టు కథ అనో కొట్టి పారేయడానికి లేదు. ఈ మొత్తం వివరాలు వశిష్ట రామాయణం ఆదిపర్వంలో వాల్మీకి శాంతాదేవి ప్రస్తావన చేశారు. ఆదిపర్వంలో శాంతాదేవికి సంబంధించిన అన్ని విషయాలను వివరించారు.
ఒక్క రామాయణంలో మాత్రమే కాకుండా.. శాంతాదేవికి సంబంధించి మరో ఆధారం ఏంటంటే ఆమెకు గుడి కూడా ఉంది. హిమాచల్ ప్రదేశ్ లోని కులు దగ్గర బంజారా ప్రాంతంలో రుష్యశృంగ మహర్షికి దేవాలయం ఉంది. ఆ ఆలయంలో రుష్యశృంగ మహర్షితో పాటుగా శాంతాదేవి విగ్రహం కూడా ఉంది. ధర్మపత్నిగా శాంతాదేవి కూడా అక్కడి ప్రజల నుంచి పూజలు అందుకుంటోంది. ఈ శ్రీరామనవమి సందర్భంగా.. ఆ శ్రీరామునికి ఒక అక్క ఉందని తెలుసుకోవడమే కాకుండా.. ఈ విషయాన్ని మీ బంధువులు, మిత్రులకు కూడా షేర్ చేసి వారికి కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. మీకు ఇప్పటికే శాంతాదేవి కథ తెలిసి ఉంటే మీరు ఎలా తెలుసుకున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.