iDreamPost
android-app
ios-app

రాఖి పండుగకు ఎందుకంత ప్రాముఖ్యత! దీని వెనుక ఉన్న చరిత్ర ఏమిటి?

  • Published Aug 18, 2024 | 11:38 AM Updated Updated Aug 18, 2024 | 11:38 AM

Rakhi Festival 2024: రాఖీ పండుగ భారత దేశంలో అత్యంత ప్రాముఖమైన పండుగల్లో ఒకటి. రాఖీ పౌర్ణమి లేదా రక్షా బంధన్ అని కూడా పిలుస్తారు. అక్క చెల్లెల్లు తమ అన్నదమ్ములకు ప్రేమ, రక్షణ, ఆశీర్వాదాలను అందించే పర పవిత్రమైన పండుగ.

Rakhi Festival 2024: రాఖీ పండుగ భారత దేశంలో అత్యంత ప్రాముఖమైన పండుగల్లో ఒకటి. రాఖీ పౌర్ణమి లేదా రక్షా బంధన్ అని కూడా పిలుస్తారు. అక్క చెల్లెల్లు తమ అన్నదమ్ములకు ప్రేమ, రక్షణ, ఆశీర్వాదాలను అందించే పర పవిత్రమైన పండుగ.

  • Published Aug 18, 2024 | 11:38 AMUpdated Aug 18, 2024 | 11:38 AM
రాఖి పండుగకు ఎందుకంత ప్రాముఖ్యత! దీని వెనుక ఉన్న చరిత్ర ఏమిటి?

రాఖీ పండుగ భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యమైన పండుగలలో ఒకటి. ఈ పండుగను రాఖీ పౌర్ణమి లేదా రక్షా బంధన్ అని కూడా పిలుస్తారు. ఇది అక్కచెల్లెల్లు తమ అన్నదమ్ములకు ప్రేమ, రక్షణ మరియు ఆశీర్వాదాలను అందించే పండుగ. ఈ పండుగను ప్రతి సంవత్సరం శ్రావణ శుద్ధ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. రాఖీ పండుగ భారతదేశంలో మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు జరుపుకునే ఒక ప్రసిద్ధ పండుగ. ఈ పండుగ భారతీయ సంస్కృతి మరియు ఐక్యతకు ఒక ప్రధాన ప్రతిబింబం.  రేపు రాఖీ పండగు సందర్భంగా తమ పుట్టింటికి వెళ్లి ఆడపడుచులు అన్నదమ్ములకు రాఖీ కడుతారు. రాఖీ పండుగ పూర్వ కాలం నుంచి వస్తుంది.. దీని వెనుక ఎంతో చరిత్ర ఉంది. అదేంటే తెలుసుకుందాం.

రాఖీ అంటగే రక్షాబంధనం.. అన్నా చెల్లెళ్ల ప్రేమానుబంధానికి నిలువెత్తు సాక్ష్యం. శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే రాఖీ సోదర ప్రేమకు సంకేతం. అక్క లేదా చెల్లులు, సోదరుని చేతికి ‘రాఖీ’ కట్టి పదికాలాల పాటు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటుంది. తమ సంతోషాన్ని కోరుకునే సోదరిపై అన్నదమ్ములకు ఆత్మీయత మరింత బలపడుతుంది. రాఖీ పండుగ భారత దేశంలో మాత్రమే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు జరుపుకునే ఒక ప్రసిద్ద పండగ. ఈ పండుగ భారతీయ సంస్కృతి, ఐక్యతకు ఒక ప్రధాన ప్రతిబింభం. రాఖీ పౌర్ణమి రోజు సోదరీమణులు తమ సోదరులకు నుదల తిలకం పెట్టి రాఖీ పట్టీలను కట్టి హారతి ఇస్తుంది. సోదరులు తమకు తోచిన బహుతులు ఇచ్చి వారి దీవెనలు పొందుతారు. రాఖీ పండుగ కేవలం అన్నా చెల్లెలు లేకా అక్క తమ్ముళ్ల మద్యనే కాదు పురాణల ప్రకారం ఏ స్త్రీ అయినా పురుషుడికి కట్టే రక్షా తోరాన్ని రక్షా బంధనం అంటారు. దీని వెనుక విశిష్ట చరిత్ర ఉంది.

rakhi festival 02

పాండవుల రాజాసూయ యాగంలో శిశుపాలుడు వంద తప్పులు చేస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో అతన్ని వధిస్తాడు. ఆ సమయంలో చూపుడు వేలుకు గాయమై రక్తం కారుతుంది. అది గమనించి ద్రౌపతి వెంటనే వచ్చి తన చీర కొంగు చించి గాయపడిన వేలుకు కట్టుకడుతుంది.దానికి కృతజ్ఞతగా ద్రౌపతికి శాశ్తమైన మద్దతు ఇస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. మహాభారతం ప్రకారం ద్రైపతికి వస్త్రాపహరణ సమయంలో మహా రాజ్యాదిపతి అయిన తండ్రి ద్రుపద రారు కానీ.. మహాబలపరాక్రమవంతులైన ఐదుగురు బర్తలు కానీ ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. తనను ఆదుకునే దిక్కు లేదా అని ద్రౌపతి కన్నీరు పెడుతు, నిస్సహాయంగా శ్రీకృష్ణున్ని ప్రార్థిస్తుంది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు ద్రౌపతికి తరగని వస్త్రాన్ని ఇచ్చి ఆమె శీలాన్ని కాపాడుతాడు.. అందరి ముందు అవమానం జరగకుండా రక్షిస్తాడు.ద్రౌపతి, కృష్ణునికి కట్టిన కట్టు ఒక అన్న చెల్లెలికి రాఖీ కట్టినట్టుగా పురణాల్లో చెబుతుంటారు.

పూర్వం దేవతలు, రాక్షసుల మధ్య యుద్దం జరుగుతుంది. దేవతల రాజైన ఇంద్రుడు ఓడిపోయి శక్తీహీనుడవుతాడు. తన పరివారంతో అమరావతిలో ఆశ్రయం పొందుతాడు. తన భర్త నిస్సాహయత చూసి ఇంద్రాణి కన్నీరు పెట్టుకుంటుంది. రాక్షస రాజు అమరావతిని ముట్టడిస్తున్నాడని గ్రహించి దేవేంద్రున్ని పోరాటానికి సిద్దం కావాలని చెబుతుంది. శ్రావణ శుద్ద పౌర్ణమి నాడు పార్వతి పరమేశ్వరుడిని, లక్ష్మీ నారాయణుడిని పూజిస్తారు. దేవతలందరూ తాము పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి యుద్దానికి పంపుతారు.. యుద్దంలో ఇంద్రుడు గెలుస్తాడు. శచీదేవి ప్రారంభించిన రక్షా బంధన్ రాఖీ పండుగగా నేటికి జరుపుకుంటారని పురణాలు చెబుతున్నాయి.