P Krishna
Sammakka Sarakka Jatara: ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన ఉత్సవమైన మేడారం సమ్మక్క-సారలమ్మజాతర ఫిబ్రవరి 21 నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది.
Sammakka Sarakka Jatara: ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన ఉత్సవమైన మేడారం సమ్మక్క-సారలమ్మజాతర ఫిబ్రవరి 21 నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది.
P Krishna
తెలంగాణ కుంభమేళ.. ఆసియా ఖండంలోనే అతి పెద్ద ఆదివాసీల ఉత్సవం మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర. ఒకప్పుడు మేడారం జాతర అంటే కేవలం గిరిజనులకు మాత్రమే సొంతమైన జాతరా.. కానీ ఇప్పుడు మేడారం జాతర అందరి జాతర. ఇక్కడ వెలసిని వనదేవతలు సమ్మక్క-సారలమ్మ లను దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి ఇసుకేస్తే రాలనంతగా జనం వస్తుంటారు.. కోట్లాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారు. మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర ఫిబ్రవరి 21 వ తేదీ (బుధవారం) ప్రారంభమై.. ఫిబ్రవరి 24 వరకు, 4 రోజుల పాటు జరుగుతుంది. ఇక మేడారం జాతరలో నాలుగు ప్రధాన ఘట్టాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
తెలంగాణ గిరిజన ఉత్సవం మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర రేపటి నుంచి ప్రారంభం కానుంది. కుంకుమ భరణి రూపంలోనే పూజారులు కట్టుదిట్టమైన భద్రతల మధ్య డోలు, డబ్బు చప్పుళ్లతో నృత్యాలు చేసుకుంటూ గద్దెపై ప్రతిష్టిస్తారు. ఈ జాతరకు రాష్ట్రం నుండి మాత్రమే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వనదేవతలను దర్శించుకోవడానికి వస్తుంటారు. చుట్టు పక్కల ప్రాంతాల నుంచి కాలినడకన, ఎడ్ల బండ్లు, బస్సులు, ప్రైవేట్ వాహనాలు పై వచ్చేవారు. ఇటీవల హెలికాప్టర్ లోనూ మేడారం జాతరకు భక్తులు తరలి వస్తున్నారంటే.. ఇక్కడ అమ్మవార్లు మహిమ ఎంత గొప్పదో తెలుసుకోవచ్చు.
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో ముఖ్యమైనవి నాలుగు ఘట్టాలు ఉంటాయి. ఫిబ్రవరి 21వ తేదీన పడిగిద్దరాజు, సారలమ్మ, గోవింద రాజుల గద్దెల వద్దకు ఊరేగింపుగా తీసుకువస్తారు. కన్నెపల్లి నుంచి సారలమ్మ అమ్మవారిని, ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి పడిగిద్ద రాజును సంస్కృతిక, సంప్రదాయాల ప్రకారం మేడారానికి తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్టిస్తారు. దీంతో తొలి ఘట్టం పూర్తవుతుంది. ఫిబ్రవరి 22వ తేదీన చిలకలగుట్ట నుంచి సమ్మక్క అమ్మవారిని తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్టిస్తారు. ఇదే అత్యంత కీలక ఘట్టం, కుంకుమ భరణె రూపంలో ఉన్న సమ్మక్క అమ్మవారిని ఆగమనం చేసి భక్తులు తరించిపోతారు. అంతకు ముందు అధికార లాంఛనాలతో పోలీసులు తుపాకీ కాల్పుల గౌరవ వందనం చేస్తూ ఆహ్వానిస్తారు. లక్షలాదిమంది భక్తులు జయ జయధ్వానాలతో అమ్మవారికి హారతులిస్తారు. ఫిబ్రవరి 23 సమ్మక్క, సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజు, జంపన్న గద్దెలపై కొలువై కోట్ల మంది భక్తులకు దర్శనమిస్తారు. ఫిబ్రవరి 24 నాలుగు చివరి రోజు సాయంత్రం అమ్మవార్లు తిరిగి వన ప్రవేశం చేస్తారు. దీంతో మేడారం జాతర ముగుస్తుంది. అనంతరం భక్తులు తిరుగు ప్రయాణంమవుతారు.
1968 నుంచి ప్రభుత్వం మేడారం జాతర ఏర్పాట్లు చేస్తుంది. 1996 లో రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. మొదట్లో మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర్లు వేరు వేరు గ్రామాల్లో జరిగేవి.. 1960 నుంచి సారలమ్మను సైతం కన్నెపల్లి నుంచి మేడారంలోని సమ్మక్క గద్దెల వద్దకు చేర్చడం మొదలైంది. కాగా, సమ్మక్క కూతురైన సారలమ్మ నివాసం కన్నెపల్లి. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను ఆసియా ఖండంలోనే అతి ఆదివాసి ఉత్సవంగా పేర్కొంటారు. ఇక్కడ అమ్మవార్లను దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.