Srisailam Temple: అరుదైన రికార్డ్ సృష్టించిన మల్లన్న ఆలయం.. లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు?

Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దేవస్థానం ఎంత ప్రసిద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు మల్లన్న దేవ స్థానాన్ని దర్శించుకుంటారు.

Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దేవస్థానం ఎంత ప్రసిద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు మల్లన్న దేవ స్థానాన్ని దర్శించుకుంటారు.

నంద్యాల జిల్లాలోని శ్రీశైలం మల్లన్న దేవస్థానం ఎంత ప్రసిద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భక్తులు మల్లన్న దేవ స్థానాన్ని దర్శించుకుంటారు. గతంలో ఆలయంలోని 7 విభాగాలకు ఐ.ఎస్.ఓ ద్వారా ధ్రువీకరణ పత్రాలని అందుకుంది శ్రీశైలం మల్లన్న ఆలయం. తాజాగా ఈ ఆలయం మరో అరుదైన రికార్డ్ ని సొంతం చేసుకుంది. లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది. ఈ రికార్దుతో అంతర్జాతీయ గుర్తింపుని తెచ్చుకుంది. మన ఆలయానికి ఇంత గుర్తింపు రావడం కేవలం తెలుగు ప్రజలకు మాత్రమే కాదు యావత్ భారతీయులకు కూడా గర్వ కారణం అనే చెప్పాలి.

ఈ రికార్డుకి సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌ సంస్థ దక్షిణ భారత జాయింట్ సెక్రెటరీ డాక్టర్‌ ఉల్లాజి ఇలియాజర్ అందజేశారు. శ్రీశైలక్షేత్ర ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, ప్రధానాలయ విస్తీర్ణం, ప్రధానాలయం చుట్టూ ఉన్న అరుదైన శిల్పప్రాకారం మరియు క్షేత్రంలోని ప్రాచీన కట్టడాలు వంటి కారణాల వల్ల శ్రీశైల ఆలయం ఈ రికార్డు సాధించిందని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఈ ధ్రువీకరణ పత్రాన్ని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆలయ ఈవో పెద్దిరాజుకు అందజేశారు. ఈ శుభ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో శ్రీశైల మల్లన్న ఆలయం చోటు సంపాదించడం చాలా ఆనందం కలిగిస్తుందని అన్నారు.

మల్లన్న దేవస్థానం పౌరాణిక ప్రాముఖ్యత కలిగిన ఆలయం. ఈ ఆలయం విస్తీర్ణం, ఆలయంలోని నంది విగ్రహం ఇంకా ఆలయ నిర్వాహణ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందుకే లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సైతం దీన్ని మెచ్చింది. దీంతో మన మల్లన్న దేవస్థానం స్థానానికి ఇంతటి మహా గౌరవాన్ని ఇచ్చింది. పురాతన సంపద పరంగా మల్లన్న ఆలయం ప్రసిద్ధి చెందింది. ఆధ్యాత్మికంగా, మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా నిలిచింది. అత్యున్నత భాండాగారంతో కూడిన విలువలు గల సజీవ స్వరూపం మన మల్లన్న ఆలయం. మరి మన మల్లన్న దేవ స్థానంకి దక్కిన ఈ గుర్తింపుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

 

Show comments