iDreamPost
android-app
ios-app

వినాయక చవితికి చందాలు ఇస్తున్నారా? దేవుడి విషయంలో ఈ తప్పు చేయొద్దు!

  • Published Sep 07, 2024 | 6:00 AM Updated Updated Sep 07, 2024 | 6:00 AM

Ganesh Chaturthi 2024: వినాయక చవితి పండుగకు ఇంకా ఒక్క రోజు సమయం మాత్రమే ఉండడంతో.. వీధులు , ఇళ్ళు పండగ వాతావరణంతో సందడిగా ఉన్నాయి. అయితే ప్రతి సంవత్సరం వినాయక చవితికి గణేష్ చందా అంటూ ఎవరు ఒకరు వస్తూనే ఉంటారు. ఈ విషయంలో ఈసారి మాత్రం ఈ తప్పులను చేయకండి.

Ganesh Chaturthi 2024: వినాయక చవితి పండుగకు ఇంకా ఒక్క రోజు సమయం మాత్రమే ఉండడంతో.. వీధులు , ఇళ్ళు పండగ వాతావరణంతో సందడిగా ఉన్నాయి. అయితే ప్రతి సంవత్సరం వినాయక చవితికి గణేష్ చందా అంటూ ఎవరు ఒకరు వస్తూనే ఉంటారు. ఈ విషయంలో ఈసారి మాత్రం ఈ తప్పులను చేయకండి.

  • Published Sep 07, 2024 | 6:00 AMUpdated Sep 07, 2024 | 6:00 AM
వినాయక చవితికి చందాలు ఇస్తున్నారా? దేవుడి విషయంలో ఈ తప్పు చేయొద్దు!

తెలుగు వారందరికీ వినాయక చవితి పండుగ చాలా స్పెషల్. వినాయక చవితి వస్తుందంటే వారం ,పది రోజుల ముందు నుంచే వీధులన్నీ కూడా గణేష్ మండపాలు, విగ్రహాలతో సందడి గా ఉంటాయి. ఇక గణేష్ చతుర్థి అంటే కనీసం 9 రోజుల పాటు.. మండపాలలో నిత్యం పూజలు పునస్కారాలు జరుగుతూ ఉంటాయి. ఈ సంఖ్య ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఇంకా పెరుగుద్ది కూడా. అన్ని రోజుల పాటు ఈ బాధ్యతలన్నీ ఒక్కరే చేయడం సాధ్యం కాదు కాబట్టి.. ఎక్కడ విగ్రహం పెట్టాలి అనుకుంటే అక్కడ.. వారంతా కలిసి ఎంతో కొంత చందా వేసుకుని.. ఈ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ గణేష్ చందా ఇచ్చే విషయంలో చాలా మంది తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం ఇలాంటి తప్పులు అసలు చేయకండి.

ప్రతి ఏటా గణేష్ చందా అంటూ అందరి ఇళ్లకు ఎవరు ఒకరు వస్తూనే ఉంటారు. ఎప్పటినుంచో తెలిసిన వాళ్ళనో.. ఇచ్చేది దేవుడికే కదా ఏమౌతుందిలే అని ఇలా రకరకాలుగా ఆలోచించి.. వారి వద్ద డబ్బులు ఉన్నా, లేకున్నా ఎంతో కొంత ఇస్తూనే ఉంటారు. అయితే ఇలా గణేష్ చందా తీసుకున్న వారంతా కూడా.. ఆ డబ్బును కేవలం దేవుడి కోసం మాత్రమే ఖర్చు చేస్తారు అనుకుంటే పొరపాటే. వినాయకచవితి వస్తే లక్షల్లో సొంత డబ్బు ఖర్చు చేసి అన్నదానాలు చేసే వారు ఉన్నారు. వేలల్లో చందాలు ఇచ్చి, ఆ పండగ కార్యక్రమాలని దగ్గర ఉండి చూసుకునేవారు ఉన్నారు. చందా దండిన ప్రతి రూపాయని నిష్ఠగా స్వామి సేవకి మాత్రమే వాడే పుణ్యాత్ములు ఉన్నారు.

కానీ.., అందరూ ఇలానే ఉంటారు అనుకోవడం మాత్రం అమాయకత్వం అవుతుంది. వినాయకచవితి పందిర్ల దగ్గర.. తప్పతాగి తిరిగే తాగుబోతులకి కొదవే లేదు. ఇక నిమజ్జనం రోజు చందా డబ్బులతోనే మందు ఫ్రీగా పోయించాలని గొడవకి దిగే మందుబాబులు కూడా విగ్రహాలు పెడుతూ ఉంటారు. పండగ జరిగిన కొన్ని రోజులు మహారాజుల్లా మంది సొమ్ము వాడుకుని తినే వాళ్ళు ఉన్నారు. వీరు అందరిని ఒక కంట కనిపెట్టాలి. దేవుడు, భక్తి అనే పేర్లు వాడుకుంటూ డబ్బులు వసూళ్లు చేసి.. వాటిని ఇష్టానికి ఖర్చు పెట్టే వారి ఆట కట్టించాలి. చాలా మందికి ఈ విషయం తెలిసినా కానీ.. ఏమి చేయలేక మొహమాటం కొద్దీ దేవుడుపైన భక్తితో చందాలు ఇస్తూ ఉంటారు. ఇలా చేయడం నూటికి నూరుపాళ్లు తప్పు.

ఎందుకంటే భక్తి ముసుగులో దందాలు చేసే వారిదే తప్పు అంటే.. అలాంటి వారికి డబ్బు ఇచ్చి ప్రోత్సహిస్తూ మీరు కూడా తప్పు చేస్తున్నట్లే. కాబట్టి ఇలా చేయకుండా ఓ మంచి ఆలోచన చేయండి. దేవుడి పేరుతో తప్పుడు కార్యక్రమాలను నిర్వహించే వారి పట్ల కఠినంగా ఉండండి. మీ ఏరియాలో వారిని ఎప్పటినుంచో గమనిస్తూనే ఉంటారు కాబట్టి.. అలాంటి వారికి చందా ఇవ్వకండి. ఎవరైతే భక్తి శ్రద్దలతో, నిష్ఠగా పూజలు చేస్తారో వారికి మాత్రమే.. మనస్ఫూర్తిగా ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వడం మంచిది. ఇక నుంచైనా ఈ మార్పు మొదలైతే కనుక.. కొంతమేరకు ఇలా దేవుడి పేరుతో దందాలు చేసే వారి సంఖ్యను తగ్గించిన వారవుతారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.