Keerthi
Rakhi Festival 2024: రక్షాబంధన్ అనేది ఒక పవిత్రమైన పండుగ. ఆ రోజున రాఖీ కట్టడం వలన సోదరులు శ్రేయస్సుగా ఉండటమే కాకుండా.. కష్టసుఖల్లో అండదండలుగా ఉంటారని ఆడపిల్లలు భావిస్తుంటారు. అయితే ఆ పండుగ రోజు తోబుట్టువలు రాఖీ కట్టాక తప్పకుండా ఇవ్వాలా? అసలు ఆచారం వెనుక కథమేటి అనే విషయాలను తెలుసుకుందాం.
Rakhi Festival 2024: రక్షాబంధన్ అనేది ఒక పవిత్రమైన పండుగ. ఆ రోజున రాఖీ కట్టడం వలన సోదరులు శ్రేయస్సుగా ఉండటమే కాకుండా.. కష్టసుఖల్లో అండదండలుగా ఉంటారని ఆడపిల్లలు భావిస్తుంటారు. అయితే ఆ పండుగ రోజు తోబుట్టువలు రాఖీ కట్టాక తప్పకుండా ఇవ్వాలా? అసలు ఆచారం వెనుక కథమేటి అనే విషయాలను తెలుసుకుందాం.
Keerthi
దేశవ్యాప్తంగా కుల,మతాలకు అతీతంగా జరుపుకున్న పండుగలో రాఖీ కూడా ఒకటి. అయితే ఈ రాఖీ పండగ అనేది అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ప్రేమానురాగాలకు చిహ్నంగా ప్రతి ఏటా శ్రావణమాసంలో పౌర్ణమిరోజు జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ రాఖీ పండుగ అనేది పురణాల నుంచి ప్రారంభమైనది. దీనినే రక్షాబంధన్ అని అంటారు. ఇక ఈ పండుగకు వయసుతో సంబంధం లేకుండా.. ప్రతిఒక్కరూ చేసుకుంటారు. అయితే ఈ రాఖీ పండుగ సోదరుల శ్రేయస్సు, రక్షణ కోసం తోబుట్టువులు కట్టే ఒక రక్షా బంధన్. అయితే రక్షా బంధన్ నాడు తోబుట్టువులు రాఖీ కడితే బహుమతులు కానీ, డబ్బులు కానీ ఎందుకు ఇవ్వాలి? అసలు ఈ డబ్బులు ఇచ్చే ఆచారం ఎందుకు వచ్చింది? కచ్చితంగా ఇవ్వలా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రక్షాబంధన్, రాఖీ పండుగ అనేది ఒక పవిత్రమైన పండుగ. ఈ పండుగను ఈ ఏడాది సోమవారం, 2024, 19వ తేదీన జరుపుకోబోతున్నారు. అయితే ఈ పండుగ రోజున రాఖీ కట్టడం వలన సోదరులు శ్రేయస్సుగా ఉండటమే కాకుండా.. కష్టసుఖల్లో అండదండలుగా ఉంటారని ఆడపిల్లలు భావిస్తుంటారు. ఈ క్రమంలోనే.. సోదరులు కూడా రాఖీ కట్టించుకున్నాక తమ అక్కలకు, చెల్లెళ్లకు కానుకలు ఇస్తుంటారు. కానుకలతో పాటు రక్షణగా ఉంటానని ప్రతిజ్ఞ కూడా చేస్తారు. అయితే నిజానికి ఈ ఆచారం పూర్వ కాలం నుంచి కూడా కొనసాగుతుంది. ఎందుకంటే.. ఒకప్పుడు మధ్య తరగతి కుటుంబాల్లో ఆడపిల్లకు త్వరగా పెళ్లి చేసి మెట్గినింటికి పంపించేవారు.
అప్పుడు పెళ్ళై మెట్టినింటిలో ఉండే అమ్మాయిలు సోదరుల కోసం రక్షాబంధన్ రోజున పుట్టింటికి వచ్చేస్తారు. అలా వచ్చిన అక్క, చెల్లలతో రాఖీ కట్టించుకున్న సోదరులు వాళ్ల అర్ధిక అవసరాలను తెలుసుకోని వారిక కానుకగా బహుమతులు, డబ్బులు ఇచ్చి వారి కష్టాల్లో ఆదుకునేవారు. అంతేకాకుండా.. జీవితాంతం వారికి ఏలాంటి పరిస్థితుల్లో అయినా రక్షణగా,అండంగా తోడుంటమని భరోసా ఇచ్చేవారు. ఇక అనాటి నుంచి రాఖీ కట్టాక సోదరులు, అక్క,చెల్లెలకు కానుకలు ఇవ్వడం అనేది ఆచారంగా కొనసాగుతుంది. కానీ, ప్రస్తుత కాలం చాలామంది రాఖీ రోజున డబ్బులు ఆశించి కట్టడం వంటివి చేస్తున్నారు. ముఖ్యంగా డబ్బులు కోసమే రాఖీ పండుగ జరుపుకునట్టు చాలామంది భావిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. రాఖీ పండుగ అనేది డబ్బులు ఆశించే కమర్షియల్ పండుగలా మారిపోయింది.
కానీ, నిజానికి ఇది అన్నదమ్ములు ఆడపిల్లలకు అండ దండగా ఉండేదుకు, యోగ క్షేమాలు పట్టించుకునేందుకు కొనసాగిస్తున్న ఆచారం అనేది ఎవరికీ తెలియదు. అందరూ డబ్బులు కోసం చేసుకునే పండగలా అనుకుంటూ అలానే జరుపుకుంటున్నారు. కానీ, నిజానికి ఆడపిల్లలు.. సోదురుల యోగ క్షేమాల కోసం, వారు బాగుండలని ఆలోచించి రక్షణగా రాఖీ ఎలా కడతారో, సోదురులు కూడా తమకు రక్షణ ఉండేదుకు రాఖీ కట్టిన తోబుట్టువులకు జీవితంతం అండగా రక్షణగా వారి ఆర్థిక అవసరాలను తెలుసుకొని చేతనైనంత ఆర్థికంగా సాయం చేయడం అనావాయితి.