iDreamPost
android-app
ios-app

తెలుగు రాష్ట్రాల్లో రంజాన్ సెలవు ఎప్పుడు? ఇప్పటికే డేట్ వచ్చేసినా!

When Is Eid Al Fitr 2024: రమదాన్ నెల దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది. అయితే రమదాన్ నెల ముగిసిన తర్వాత ఈద్ ఉల్ ఫితుర్ ఎప్పుడు చేసుకోవాలి? ప్రభుత్వం ఒక డేట్ ఇచ్చినా కూడా సెలవు ఎప్పుడు?

When Is Eid Al Fitr 2024: రమదాన్ నెల దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది. అయితే రమదాన్ నెల ముగిసిన తర్వాత ఈద్ ఉల్ ఫితుర్ ఎప్పుడు చేసుకోవాలి? ప్రభుత్వం ఒక డేట్ ఇచ్చినా కూడా సెలవు ఎప్పుడు?

తెలుగు రాష్ట్రాల్లో రంజాన్ సెలవు ఎప్పుడు? ఇప్పటికే డేట్ వచ్చేసినా!

రమదాన్ అనేది ముస్లింలకు ఎంతో ప్రత్యేకం అని అందరికీ తెలుసు. అందరూ సాధారణంగా రంజాన్ అంటూ ఉంటారు. అయితే దానిని రమదాన్ అనాలి. రమదాన్ అంటే ఒక నెల. నెల రోజుల పాటు కటిక ఉపవాసం ఉన్న తర్వాత ‘ఈద్ ఉల్ ఫితుర్’ని ఘనంగా జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ఇంది ఎంతో ప్రత్యేకమైన మాసం, ఎంతో ప్రత్యేకమైన పండుగ. అయితే ఈ ఏడాది ఈ పండుగ ఏరోజు జరుపుకోవాలి అనే ప్రశ్న ఉండనే ఉంది. ఇప్పటికే అధికారికంగా ప్రభుత్వం ఒక డేట్ ని అనౌన్స్ కూడా చేసింది. కానీ, ఇప్పటికీ ఈదు ఉల్ ఫితుర్ తేదీపై మాత్రం క్లారిటీ రాలేదు.

రమదాన్ మాసం ముస్లింలకు ఎందుకు ప్రత్యేకం అంటే.. ఈ నెలలోనే ఖురాన్ అవతరించింది అని విశ్వసిస్తారు. అలాగే ఈ మాసాన్ని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. రమదాన్ మాసంలో ఎంతో నిష్టగా ఉపవాసం ఉంటారు. అలాగే ఈ మాసంలో ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి. ఒక్క ఉపవాసం మాత్రమే కాకుండా.. ఖురాన్ చెప్పిన ప్రకారం ఈ రమదాన్ నెలలో జకాత్ ని అనుసరిస్తారు. అంటే ధనం కలిగిన వాళ్లు లేనివాళ్లకు ఈ మాసంలో దాన ధర్మాలు చేస్తుండాలి. వాళ్లు సంపాదించుకున్న దానిలో 30 శాతం వరకు లేనివాళ్లకు ఇవ్వాలి అంటారు. లేనివాళ్లు ఉన్నవాళ్ల దగ్గర పొందడాన్ని జకాత్ హక్కు అంటారు. అలాగే ఇందులో ఫిత్రా అని కూడా దానం చేయమని ఖురాన్ చెప్తోంది. ఉన్నవారి లాగానే లేనివాళ్లు కూడా సంతోషంగా పండుగ జరుపుకునేందుకు ఈ ఫిత్రా దానం చేయాలని ఖురాన్ చెప్తోంది.

అలాగే రమదాన్ నెలలో ఇఫ్తార్ విందులు కూడా ఉంటాయి. ఇలా పవిత్రమైన కార్యక్రమాలు, ప్రత్యేకమైన ప్రార్థనల నడుమ ఈ రమదాన్ నెల గడుస్తుంది. అయితే ‘ఈద్ ఉల్ ఫితుర్’ ఎప్పుడు జరుపుకోవాలి. మార్చి 11వ తేదీన రమదాన్ నెల ప్రారంభమైంది. అందరూ నెల రోజులు అనగానే ఫిబ్రవరి 10వ తేదీన పండుగ అయి ఉంటుంది అని చెప్పేస్తుంటారు. అలాగే సాధారణంగా ఏ పండుగ అయినా ప్రభుత్వం ఒక క్యాలెండర్ విడుదల చేస్తుంది. ఆ ప్రకారమే పండుగ జరుపుకోవడం, సెలవులు ఇవ్వడం చేస్తుంటారు. కానీ, రమదాన్ నెలలో ఈద్ ఎప్పుడు అనే విషయాన్ని మాత్రం ముందే చెప్పడం అస్సలు కుదరని పని.

రమదాన్ నెలలో షవ్వాల్ నెలవంకకు ఎంతో ప్రత్యేకత ఉంది. షవ్వాల్ కనిపించిన తర్వాతే ఈ రమదాన్ మాసం ముగుస్తుంది. ప్రభుత్వం ఏప్రిల్ 11న ఈద్ ఉల్ ఫితుర్ సందర్భంగా సెలవు ప్రకటించింది. కానీ, ఆ షవ్వాల్ నెలవంక కనిపించిన తర్వాత ఈద్ ని నిర్వహించుకుంటారు. ఆ షవ్వాల్ నెలవంక ఏప్రిల్ 10 రాత్రికి కనిపిస్తే.. ఏప్రిల్ 11న ప్రభుత్వం చెప్పిన విధంగానే పండుగ జరుపుకుంటారు. అలా కాదని షవ్వాల్ నెలవంక ఏప్రిల్ 11వ తేదీ రాత్రి కనిపిస్తే ఈద్ ఏప్రిల్ 12వ తేదీన నిర్వహిస్తారు. అందుకే అన్ని పండుగల మాదిరిగా ఈద్ ఉల్ ఫితుర్ ఎప్పుడు అనే విషయాన్ని ఎవరూ స్పష్టంగా చెప్పలేరు. రమదాన్ నెల ప్రారంభమైన తర్వాత నెల రోజులకు షవ్వాల్ కనిపిస్తుందని ఆ ఉద్దేశంతో చెప్పే తేదీలే తప్ప.. కచ్చితమైన సమాచారం అయితే అనడానికి లేదు.