iDreamPost
android-app
ios-app

Hyderabad: ఖైరతాబాద్ వినాయకుడు ఎందుకు స్పెషల్! మీకు తెలియని 70 ఏళ్ల చరిత్ర..!

Khairatabad Ganesh 2024: వినాయక చవితి రాగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ గణనాథుడు. దేశం మొత్తంలో ఎన్ని వినాయక విగ్రహాలు ఉన్నా కూడా ఖైరతాబాద్ ప్రత్యేకం. మరి..ఎందుకు అంత స్పెషల్..చాలా మందికి తెలియని ఖైరతాబాద్ వినాయకుడి చరిత్ర ఇప్పుడు తెలుసుకుందాం..

Khairatabad Ganesh 2024: వినాయక చవితి రాగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ గణనాథుడు. దేశం మొత్తంలో ఎన్ని వినాయక విగ్రహాలు ఉన్నా కూడా ఖైరతాబాద్ ప్రత్యేకం. మరి..ఎందుకు అంత స్పెషల్..చాలా మందికి తెలియని ఖైరతాబాద్ వినాయకుడి చరిత్ర ఇప్పుడు తెలుసుకుందాం..

Hyderabad: ఖైరతాబాద్ వినాయకుడు ఎందుకు స్పెషల్! మీకు తెలియని 70 ఏళ్ల చరిత్ర..!

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా  వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పండగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. వాడవాడల్లా వినాయకుడి మండపాలు విద్యుత్ దీపాలకరణలతో మెరిసిపోతున్నాయి. ఈ నవరాత్రులు ప్రజలు భక్తి శ్రద్ధలతో గణనాథుడికి పూజలను నిర్వహిస్తున్నారు. ఇది ఇలా ఉంటే.. వినాయక చవితి అనగానే అందరికీ, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ఖైరతాబాద్ వినాయకుడు గుర్తుకు వస్తాడు. కారణం కూడా లేకపోలేదు.

ఖైరతాబాద్ వినాయకుడి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆకారం, ఎత్తు, పరిణామం..ఇలా అనేక అంశాల్లో ఖైరతాబాద్ వినాయకుడు ఎంతో స్పెషల్ గా ఉంటాడు. ఇక ఖైరతాబాద్ వినాయకుడిని చూస్తే..సాక్ష్యాత్తు ఆ గణనాథుడే నిజంగా దివి నుంచి భువికి వచ్చాడా అనే భావన కలుగుతుంది. ఈ సారి కూడా 70 అడుగుల ఖైరతబాద్ మహా గణపతి భక్తులకు దర్శనం ఇస్తున్నాడు.  ఈ నేపథ్యంలో ఈ వినాయకుడి చరిత్ర తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఖైరతాబాద్ వినాయకుడు గురించి చాలా మందికి తెలియని 70 ఏళ్ల చరిత్ర ఉంది. మరి..ఈ ఖైరతాబాద్ గణపయ్య చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం…

ఈ ఏడాదితో ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహానికి 70 వసంతాలు పూర్తి చేసుకోనుంది. 70 ఏళ్లుగా ఈ ఖైరతాబాద్ విగ్రహాన్ని… ఆ ప్రాంతంలోనే భక్తులు ప్రతిష్టించారు భక్తులు.  ఒక్క అడుగుతో మొదలైన ఈ ఖైరతాబాద్ మహా గణనాథుడు.. ఈ ఏడాది 70 అడుగుల వరకు చేరింది. 70 వసంతలు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో ఈ ఏడాది వినాయకుడిని 70 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేశారు. ఈ సారి సప్తముఖ గణేషుడి రూపంలో వినాయకుడు భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. ఈ ఖైరతాబాద్ గణేశుడు ఇరువైపులా… శివపార్వతులు అలాగే శ్రీనివాస కళ్యాణం మండపం కూడా ఉంటుంది.  అలానే ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య బలరాముడి విగ్రహం కూడా ఉంది. ఇక ఈ ఖైరతాబాద్ భారీ వినాయకుడిని భక్తులు ప్రతిసారి మట్టితోనే నిర్మించడం ఇక్కడ ప్రత్యేకం.

ఇక ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం అసలు ఎలా మొదలైందో ఇప్పుడు తెలుసుకుందాం.. వాస్తవంగా 1954 సంవత్సరంలో సింగిరి శంకరయ్య అనే భక్తుడు ఒక్క అడుగుతో ఖైరతబాద్ మహాగణపతిని తయారు చేశాడు. అలా సింగిరి  శంకరయ్య  1954లో పెట్టిన ఒక్క అడుగు గణపతి కాస్త..ఏటా ఏటా పెరుగుతూ వచ్చాడు. అలా ఒక్క అడుగుతో ప్రారంభమైన ఈ ఖైరతబాద్ వినాయకుడు నేడు 70 అడుగులకు చేరుకోనుంది. 2019లో ఖైరతాబాద్ మహాగణపతి 61 అడుగులు చేరుకుంది. దీంతో ఆ సమయంలో దేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం చరిత్ర సృష్టించింది.

ఆ తరువాత నుంచి ఈ మహాగణపతి ఎత్తును తగ్గిస్తూ వచ్చారు. అయితే 2023లో 63 అడుగుల ఎత్తులో ఈ ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గతేడాది కంటే ఏడు అడుగులు ఎత్తు ఎక్కువగా పెంచూ.. ఈ ఏడాదికి 70 అడుగుల్లోనే విగ్రహాన్ని ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేశారు . ఇలా 70 వసంతలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది 70 అడుగుల ఎత్తుతో వినాయకుడు మనకు దర్శనం ఇస్తున్నారు. గతంలో తన పేరున్న ఉన్న రికార్డును ఈసారి తానే బ్రేక్ చేయనున్నాడు ఈ ఖైరతాబాద్ వినాయకుడు.

ఇక ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జన కార్యక్రమం చూసేందుకు ఇతర  రాష్ట్రాల నుంచి కూడా లక్షల మంది భక్తులు వస్తుంటారు. ఇక ఈ నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఏటా మాదిరిగానే ఈ సారి కూడా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు వస్తోన్నారు. ఈ ఏడాది 70 అడుగుల ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం చూసేందుకు భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 17వ తేదీన ఈ మహగణపతి నిమజ్జనం జరగనుంది. ఈ నేపథ్యంలో భక్తులు భారీ సంఖ్యలు వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేస్తున్నారు. మరి..ఖైరతాబాద్ గణేషుడి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.