అన్నవరం సత్యదేవుడికి భారీ కానుక..కోట్లు విలువ చేసే వజ్ర కిరీటం!

Annavaram Golden Crown: అన్నవరంలో వెలసిన సత్యనారాయణ స్వామికి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోరిన కోర్కెలు తీర్చే సత్యదేవుడిగా భక్తుల నుంచి పూజలు అందుకుంటారు. తాజాగా స్వామి వారికి ఓ భక్తుడు భారీ కానుకను సమర్పించాడు.

Annavaram Golden Crown: అన్నవరంలో వెలసిన సత్యనారాయణ స్వామికి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోరిన కోర్కెలు తీర్చే సత్యదేవుడిగా భక్తుల నుంచి పూజలు అందుకుంటారు. తాజాగా స్వామి వారికి ఓ భక్తుడు భారీ కానుకను సమర్పించాడు.

చాలా మంది తరచూ వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే దేవుళ్ల దర్శనం అనంతరం అక్కడ్ హుండీల్లో కానుకలు వేస్తుంటారు. కొందరు భక్తులు అయితే ఏకంగా భారీ కానుకలు స్వామి, అమ్మవార్లకు సమర్పించుకుంటారు. ముఖ్యంగా శ్రీశైలం, తిరుపతి, అన్నవరం వంటి పలు ప్రముఖ క్షేత్రాల్లో కొందరు భక్తులు కోట్ల విలువ చేసే కానుకలు సమర్పిస్తుంటారు. ఇప్పటికే చాలా మంది భక్తులు లక్షలు, కోట్ల విలువ చేసే వస్తువులను స్వాములకు కానుకగా ఇస్తుంటారు. అలానే తాజాగా అన్నవరం సత్యనారాయణ స్వామి వారికి భారీ కానుక వచ్చింది. ఓ భక్తులు కోట్ల విలువ చేసే..వజ్ర కిరీటాన్ని బహుమతిగా ఇచ్చారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలో వెలసిన సత్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు నిత్యం ఎంతో మంది భక్తులు వస్తుంటారు. అలానే ఇక్కడే వివాహం చేసుకోవడం, వ్రతాలు చేసుకోవడం చేస్తుంటారు. సత్యదేవుడి సన్నిదిలో నిత్యం పెద్ద సంఖ్యలో వ్రతాలు జరుగుతుంటాయి. ఇక ఇక్కడ కోరిన కోర్కెలు తీరుతాయని భక్తులు బలంగా నమ్ముతారు. సత్యదేవుడికి, అమ్మవారికి భక్తులు కానుకలు ఇస్తుంటారు. ఇప్పటికే చాలా మంది స్వామికి విలువైన కానుకలు ఇవ్వగా తాజాగా ఓ భక్తుడు కోట్ల విలువ చేసే భారీ కానుకను అందజేశారు. పెద్దాపురం శ్రీలలితా ఎంటర్‌ప్రైజెస్‌ ఇండస్ట్రీస్‌ ఎండీ మట్టే సత్యప్రసాద్, సూర్యకమల దంపతులు వజ్ర కిరీటాన్ని అమ్మవారికి కానుకగా ఇచ్చారు.

దాదాపు రూ.కోటిన్నరతో ఈ కిరీటాన్ని అమ్మవారికి తయారు చేయించారు. కిలో బంగారం, 130 క్యారెట్ల వజ్రాలతో ఈ కిరీటాన్ని రూపొందించారు. అదే విధంగా సత్యనారాయణ స్వామి, అమ్మవార్లకు వజ్రాలు పొదిగిన బంగారు కర్ణాభరణాలను కూడా అందజేశారు. ఆగస్టు 6న సత్యనారాయణ స్వామి జన్మనక్షత్రం మఖ పర్వదినం రోజున అమ్మవారికి ఈ వజ్ర కిరీటాన్ని అలంకరిస్తారు. అమ్మవారికి కిరీటాన్ని, స్వామి కర్ణాభరణాలను ఆలయ అర్చకులు అలంకరిస్తారు. ఈ భక్తుడే రెండేళ్ల కిందట సత్యదేవునికి కూడా వజ్రకిరీటాన్ని తయారు చేయించి కానుకగా ఇచ్చారు.

అప్పట్లో స్వామివారికి సమర్పించిన కానుకలో 682 గ్రాముల బంగారం, 3,764 వజ్రాలు, కెంపు, పచ్చలతో ఆ కిరీటాన్ని తయారు చేయించారు. ఇక సత్యప్రసాద్ అనే ఈ భక్తుడు దేవస్థానంలో రూ.కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేయించారు. ఇది ఇలా ఉంటే.. అన్నవరం దేవస్థానంలోని విమానగోపురంకు బంగారం తొడుగను వేసేందుకు కసరత్తు జరుగుతోంది. గతంలోనే ఒక కమిటీ పరిశీలన చేసి.. విమానగోపురానికి సుమారు 11 కేజీల బంగారం పడుతుందని అంచనా వేశారు. ఈ మేరకు తాజాగా దేవదాయశాఖ కమిషనర్‌ ఆదేశాలతో టీటీడీ నుంచి బృందం అన్నవరం వచ్చింది. ఆ గోపురాన్ని పరిశీలించి.. కొలతలు తీసుకున్నారు. త్వరలో  విమాన గోపురం స్వర్ణమయం కానుంది.

Show comments