Tirupathi Rao
Chilkur Balaji Temple Priest Rangarajan: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు ఆలయంలో జరగాల్సిన కల్యాణోత్సం కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
Chilkur Balaji Temple Priest Rangarajan: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు ఆలయంలో జరగాల్సిన కల్యాణోత్సం కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
Tirupathi Rao
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. చిలుకూరు బాలాజీ ఆలయంలో ఆదివారం జరగాల్సిన వివాహ ప్రాప్తి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం పిల్లల ప్రాప్తి కోసం ఇస్తామన్న గరుడ ప్రసాదం కార్యక్రమంలో ఎదురైన ఇబ్బందుల నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సంతాన ప్రాప్తి కోసం ఎదురుచూస్తున్న దంపతులు చిలుకూరు ఆలయానికి వచ్చి గరుడ ప్రసాదం తీసుకోవాలని ప్రకటించారు. అయితే ఆలయం వాళ్లు వేసిన అంచనా కంటే భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. వేలల్లో ఆలయానికి రావడంతో అంతా గందర గోళం అయిపోయింది. ఈ నేపథ్యంలోనే వివాహ ప్రాప్తి కార్యక్రమం విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రధాన అర్చకులు రంగరాజన్ కీలక ప్రకటన చేశారు. వివాహ ప్రాప్తి కోసం రేపు కల్యాణోత్సవానికి ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు. పెళ్లి కావాల్సిన వాళ్లు తమ ఇళ్లల్లో నుంచే దేవుడిని ప్రార్థించుకోవాలని సూచించారు. గరుడ ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో ఏర్పడిన ఇబ్బందుల దృష్ట్యా వివాహ ప్రాప్తిని రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆలయంలో జరగాల్సిన కల్యాణోత్సం యథావిధిగా జరుగుతుందని తెలిపారు. నిన్న గరుడ ప్రసాదం కోసం ఏకంగా 1.50 లక్షల మందికి పైగా భక్తులు వచ్చినట్లు పోలీసులు అంచనా వేశారు. అయితే ఆలయం వాళ్లు మాత్రం ప్రసాదం కేవలం 10 వేల మందికే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ఉదయం 10 గంటలకే ఆలయంలో 70 వేల మందికి పైగా భక్తులు క్యూ లైన్లలో నిల్చున్నారు. 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కూడా స్తంభించి పోయింది. వచ్చిన భక్తుల కోసం ఆలయం వాళ్లు మళ్లీ గరుడ ప్రసాదం సిద్ధం చేసి పంపిణీ చేశారు. అలా మొత్తానికి ఒక 35 వేల మంది భక్తులకు ప్రసాదం అందించగలిగనట్లు తెలిపారు. అయితే మరోసారి ఇలాంటి ఇబ్బంది భక్తులకు, పోలీసులకు కలగ కూడదు అనే ఉద్దేశంతో ఆలయ ప్రధాన అర్చకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వివాహ ప్రాప్తి కల్యాణోత్సవానికి భక్తులు ఎవరూ రావొద్దంటూ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. ఇంటి వద్ద నుంచే స్వామివారిని ప్రార్థించుకోవాలని సూచించారు. ఈ నిర్ణయంపై వివాహ ప్రాప్తి కోసం ఎదురుచూస్తున్న భక్తులు అసహనం వ్యక్తం చేయచ్చు. కానీ, సరైన నిర్ణయం తీసుకున్నారు అంటూ కొందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేపు కూడా లక్షల్లో భక్తులు వస్తే ట్రాఫిక్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు.