ఏడాదిన్నర క్రితమే పెళ్లి.. భర్త కళ్ల ముందే.. అసలు ఏం జరిగిందంటే?

జీవితంపై ఎన్నో ఆశలతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు ఆ దంపతులిద్దరు. ఏడాదిన్నర క్రితమే వివాహం జరిగింది.కానీ అంతలోనే భర్త కళ్ల ముందే ఘోరం జరిగిపోయింది. అసలు ఏం జరిగిందంటే?

జీవితంపై ఎన్నో ఆశలతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు ఆ దంపతులిద్దరు. ఏడాదిన్నర క్రితమే వివాహం జరిగింది.కానీ అంతలోనే భర్త కళ్ల ముందే ఘోరం జరిగిపోయింది. అసలు ఏం జరిగిందంటే?

పెళ్లి చేసుకుని నిండు నూరేళ్లు సంతోషంగా జీవిద్దామని కలలుకన్నారు. ఎన్నో ఆశలతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తు అన్యోన్యంగా జీవిస్తున్నారు. కానీ వారి సంతోషాన్ని చూసి విధికి కూడా అసూయ పుట్టినట్టుంది. పెళ్లైన ఏడాదిన్నరకే తీరని విషాదాన్ని మిగిల్చింది. భర్త కళ్ల ముందే ఆ వివాహిత ఈ లోకాన్ని విడిచి వెళ్లింది. వీరు తెలంగాణలోని జహీరాబాద్ ప్రాంతానికి చెందిన వారు. ఈ విషాద ఘటన హిమాచల్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. అసలు ఏం జరిగిందంటే.. విహారయాత్రకోసం బయలుదేరి పారాగ్లైడింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయింది నవ్య అనే వివాహిత. విహారయాత్ర విషాదంగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

తెలంగాణలోని జహీరాబాద్ కు చెందిన సాయి మోహన్‌, నవ్య(26) దంపతులు చండీగఢ్‌లో నివసిస్తున్నారు. వీరికి ఏడాది కిందట వివాహం జరిగింది. భార్యాభర్తలిద్దరు కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. కాగా మొన్న శనివారం నాడు విహారయాత్ర కోసం హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూకు వెళ్లారు. అక్కడ నవ్య పారాగ్లైడింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. భర్త కళ్లెదుట ఆమె ప్రాణాలు కోల్పోయింది. నవ్య పారాగ్లైడింగ్ చేస్తున్న సమయంలో పైలట్ అజాగ్రత్తగా వ్యవహరించి సీట్ బెల్ట్ సరిగా చూసుకొకపోవడంతో ప్రమాదవశాత్తు జారిపడి చనిపోయింది.

ఈ ఘటనలో ఆమెతో పారాగ్లైడింగ్‌ చేయించిన పైలట్‌ ప్రాణాలతో బయటపడ్డాడు. మానవ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని అక్కడి పర్యాటక అధికారులు వెల్లడించారు. ఈ మేరకు బాధిత కుటుంబికులకు సమాచారం అందించారు. నిర్లక్ష్యం, భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పైలట్‌ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి కేసు నమోదు చేశామని సంబంధిత అధికారులు తెలిపారు. నవ్య మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పారాగ్లైడింగ్ చేస్తున్నామని సంతోషంగా వీడియో కాల్ మాట్లాడారని ఆ కాసేపటికే ఈ ఘోరం జరిగిపోయిందని వారు కన్నీటిపర్యంతమయ్యారు.

Show comments