P Venkatesh
ఎవరు చేసే పని వారు చేయాలంటారు. లేదంటే ఎన్నో అనర్థాలు జరుగుతుంటాయి. ఇదే రీతిలో ఓ యువతి డాక్టర్ గా మారి సొంతంగా వైద్యం చేసుకుంది. జ్వరానికి వైద్యం చేసుకుని ఆరోగ్యాన్ని డేంజర్ లో పడేసుకుంది. చివరకు ఏం జరిగిందంటే?
ఎవరు చేసే పని వారు చేయాలంటారు. లేదంటే ఎన్నో అనర్థాలు జరుగుతుంటాయి. ఇదే రీతిలో ఓ యువతి డాక్టర్ గా మారి సొంతంగా వైద్యం చేసుకుంది. జ్వరానికి వైద్యం చేసుకుని ఆరోగ్యాన్ని డేంజర్ లో పడేసుకుంది. చివరకు ఏం జరిగిందంటే?
P Venkatesh
ప్రస్తుత రోజుల్లో ఎవరికి వారే డాక్టర్లుగా మారుతున్నారు. జ్వరం, జలుబు ఇతరత్రా వ్యాధులకు సొంతంగా వైద్యం చేసుకుంటున్నారు. గూగుల్ లో, యూట్యూబ్ లలో సెర్చ్ చేసి ఇష్టం వచ్చినట్టు ట్యాబ్ లెట్స్ వాడుతున్నారు. యూట్యూబ్ లో చూసి అబార్షన్స్, ప్రసవాలు చేసుకుని ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ప్రకృతి వైద్యం పేరుతో ఏదిపడితే అది నాటు మందులను తీసుకుంటున్నారు. దీంతో ఉన్న రోగం తగ్గడం దేవుడెరుగు లేని కొత్త రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. సీజనల్ వ్యాధులకు సొంత వైద్యం చేసుకోవద్దని వైద్యులు సూచిస్తుంటారు. అయినా తమకే అన్ని తెలిసినట్టుగా పారాసిటమల్, యాంటీ బయటిక్స్, పెయిన్ కిల్లర్స్ తీసుకుని ఆరోగ్యాన్ని రిస్క్ లో పెట్టుకుంటుంటారు.
సొంత వైద్యం చేసుకుని ప్రాణాల మీదికి తెచ్చుకుంటుంటారు. డాక్టర్ల సూచన లేకుండా ట్యాబ్ లెట్స్ వాడటం ప్రమాదమని నిపుణులు హెచ్చరించినా పట్టించుకోరు. ఇదే విధంగా ఓ యువతి తనకు తానే ట్రీట్ మెంట్ చేసుకుని ప్రాణాలమీదికి తెచ్చుకుంది. జ్వరం వచ్చినా వైద్యులను సంప్రదించకుండా సొంత వైద్యం చేసుకుని చివరకు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గడ్డిగానిపల్లి గ్రామంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.. భూపాలపల్లి జిల్లా గడ్డిగానిపల్లికి చెందిన దుర్గం తిరుపతి, రాజశ్రీ దంపతుల పెద్ద కుమార్తె అంజలి(17). ఈమె మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కోర్సు పూర్తి చేసింది. ఆ తర్వాత వంద పడకల ఆసుపత్రిలో పారా మెడికల్ శిక్షణ పొందుతోంది.
అయితే రెండు రోజుల క్రితం జ్వరం రావడంతో అంజలి తెలిసిన ఔషధాలు వేసుకుంది. ఇక్కడే ఆమె ఆరోగ్యం ప్రమాదంలోకి నెట్టబడింది. మందులు వేసుకున్నాక అంజలి బాగా నీరసించిపోయింది. దీంతో అంజలి ఇంట్లోనే సొంతంగా సెలైన్ బాటిల్ పెట్టుకుంది. అయితే సెలైన్ బాటిల్ లో ఎక్కించిన ఇంజక్షన్ వల్ల ఆమెకు మాట పడిపోయింది. ఆ తర్వాత స్పృహ కోల్పోయింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అంజలిని ఆసుపత్రికి తరలించారు.
ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలిస్తుండగా ఆరోగ్యం విషమించి అంజలి ప్రాణాలు కోల్పోయింది. అంజలి మృతితో కుంటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆసుపత్రిలో నర్స్ గా సేవలందించాల్సిన కూతురు సొంత వైద్యం చేసుకుని మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరి జ్వరానికి సొంత వైద్యం చేసుకుని యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.