P Venkatesh
మొబైల్ ఫోన్ ఆ యువతి పాలిట శాపంగా మారింది. ఫోన్ కోసం యువతి దారుణ నిర్ణయం తీసుకుంది. ఈ ఘటన తెలంగాణలోని మెదక్ లో చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే?
మొబైల్ ఫోన్ ఆ యువతి పాలిట శాపంగా మారింది. ఫోన్ కోసం యువతి దారుణ నిర్ణయం తీసుకుంది. ఈ ఘటన తెలంగాణలోని మెదక్ లో చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే?
P Venkatesh
పిల్లల కోసం ఎంతో కష్టపడుతుంటారు తల్లిదండ్రులు. తమ బిడ్డల భవిష్యత్తు కోసం అహర్నిషలు శ్రమిస్తూ పిల్లలే లోకంగా జీవిస్తుంటారు. అలాంటి తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని కలిగి ఉండి వారు కన్న కలల్ని నిజం చేయాల్సిందిపోయి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు కొందరు యువతీ యువకులు. పేరెంట్స్ తాము అడిగింది తెచ్చివ్వలేదని దారుణాలకు ఒడిగడుతున్నారు. క్షణికావేశంలో కఠిన నిర్ణయాలు తీసుకుని కన్నవారికి తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. ఇదే రీతిలో ఓ యువతి తనకు సెల్ ఫోన్ కొనివ్వలేదని ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
తమ కూతురు బాగా చదువుకుని తమ కష్టాలను తీరుస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ సెల్ ఫోన్ కొనివ్వలేదని ఆ కూతురు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మెదక్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రుక్మాపూర్ గ్రామానికి చెందిన రుచిత(18) మెదక్ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతుంది. అయితే ప్రతి రోజు రుక్మాపూర్ నుంచి మెదక్ వెళ్లిరావడానికి ఇబ్బంది అవుతుందని అక్కడే హాస్టల్లో ఉండి చదువుకుంటానని తల్లిదండ్రులకు తెలిపింది. అయితే హాస్టల్ లో ఉంటున్న కారణంగా తనకు మొబైల్ కొనివ్వాలని తల్లిదండ్రులను కోరింది. కాగా ఇప్పుడు చేతిలో డబ్బులు లేవని కొన్ని రోజుల తర్వాత కొనిస్తామని రుచితతో చెప్పారు. తనకు ఇప్పుడే మొబైల్ కొనివ్వాలని పట్టుబట్టింది రుచిత.
ఇక తల్లిదండ్రులు తన మాట వినడం లేదని తనకు ఫోన్ కొనివ్వడం లేదని తీవ్ర మనస్థాపానికి గురైంది రుచిత. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. రుచిత మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. డిగ్రీ చదువుతున్న కూతురు ఇలా అర్ధాంతరంగా చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. సెల్ ఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.