iDreamPost
android-app
ios-app

ఇంటర్ చదువుతున్న యువతి.. కాలేజీకి వెళ్తున్నానని చెప్పి!

  • Published Nov 01, 2023 | 10:56 AM Updated Updated Nov 01, 2023 | 10:56 AM

ఈ యువతి హైదరాబాద్ లోని బోరబండ ప్రాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటుంది. అయితే ఎప్పటిలాగే కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లింది. ఆ రోజు సాయంత్రం అయినా తిరిగి రాలేదు.

ఈ యువతి హైదరాబాద్ లోని బోరబండ ప్రాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటుంది. అయితే ఎప్పటిలాగే కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లింది. ఆ రోజు సాయంత్రం అయినా తిరిగి రాలేదు.

  • Published Nov 01, 2023 | 10:56 AMUpdated Nov 01, 2023 | 10:56 AM
ఇంటర్ చదువుతున్న యువతి.. కాలేజీకి వెళ్తున్నానని చెప్పి!

హైదరాబాద్ లో గత కొంత కాలం నుంచి బాలికలు, అమ్మాయిలు వరుసగా మిస్సింగ్ అవుతున్న ఘటనలు తీవ్ర కలకలంగా మారుతున్నాయి. కొన్ని ఘటనల్లో అయితే కనిపించకుండపోయి చివరికి శవాలై దర్శనిమిస్తున్నారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ లో ఇటీవల ఓ యువతి కనిపించకుండాపోయింది. రాత్రైన కూతురు ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు అంతటా వెతికారు. కానీ, ఆ యువతి జాడ మాత్రం దొరకలేదు. ఇక చేసేదేం లేక స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువతి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఉన్నట్టుండి కూతురు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని బోరబండలోని ఎస్పీఆర్ హిల్స్ లో ఇమ్మానియేల్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇక్కడే ఓ చోట పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి జాయిస్ మేరి అనే కూతురు ఉంది. ఈ అమ్మాయి హైదరాబాద్ లోని ఓ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. ఇక ఎప్పటిలాగే మేరి అక్టోబర్ 30న కాలేజీకి వెళ్తున్నానని ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పి వెళ్లింది. కానీ, ఆ రోజు సాయంత్రమైన ఆ యువతి ఇంటికి రాలేదు.

దీంతో ఆమె తండ్రి కంగారుపడి అంతటా వెతికాడు. అయినా ఆ యువతి ఆచూకి మాత్రం దొరకలేదు. ఇక చేసేదేం లేక మంగళవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు మేరి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఉన్నట్టుండి ఆ అమ్మాయి కనిపించకుండపావడంతో ఆమె తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet