Young Girl Missing: బయటకెళ్లిన జయలత కనిపించకుండా పోవటంతో..

బయటకెళ్లిన జయలత కనిపించకుండా పోవటంతో..

దేశంలో మిస్సింగ్‌ కేసులు రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న మిస్సింగ్‌ కేసుల్లో 70 శాతం స్త్రీలకు సంబంధించినవే ఉంటున్నాయి. హైదరాబాద్‌ నగరంలో బాలికలు, యువతుల మిస్సింగ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. తాజాగా, ఇంటినుంచి బయటకు వెళ్లిన ఓ యువతి కనిపించకుండాపోయింది. ఈ సంఘటన సోమవారం హైదరబాద్‌లోని బోరబండలో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే..

పొట్టి నాగులపల్లికి చెందిన మైలారం జ్యోతికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్ద కుమార్తె పేరు సుమలత కాగా, చిన్న కుమార్తె పేరు జయలత. పెద్ద కుమార్తెకు వివాహం అవటంతో అత్తారింట్లో ఉంటోంది. చిన్న కుమార్తె చదువుకుంటోంది. పెద్ద కుమార్తె బోరబండలోని సాయిబాబా నగరలోని అత్తింట్లో ఉంటోంది. జ్యోతి, జయలతలు.. సుమలతను చూడ్డానికి కొద్దిరోజుల క్రితం సాయిబాబా నగర్‌కు వచ్చారు. సోమవారం ఉదయం జయలత ఇంటినుంచి బయటకు వెళ్లింది.

సాయంత్రం అయినా ఇంటికి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు ఆమె కోసం గాలించారు. అయినా ఏం లాభం లేకపోయింది. ఈ నేపథ్యంలోనే బోరబండ పోలీస్‌ స్టేసన్‌కు వెళ్లారు. జయలత కనిపించటం లేదంటూ ఫిర్యాదు చేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరి, ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న మిస్సింగ్‌ కేసులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments