iDreamPost
android-app
ios-app

వీడియో: యువకుడ్ని 15 సార్లు చెప్పుతో కొట్టిన యువతి.. కారణం ఏంటంటే!

వీడియో: యువకుడ్ని 15 సార్లు చెప్పుతో కొట్టిన యువతి.. కారణం ఏంటంటే!

యువతితో తప్పుగా ప్రవర్తిస్తున్న ఓ యువకుడికి గ్రామ పంచాయతీ సరైన శిక్ష వేసింది. యువకుడ్ని అందరి ముందు నిలబెట్టి యువతితో చెప్పుతో కొట్టించింది. ఈ సంఘటన ఉత్తర​ ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్‌, హపుర్‌ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువకుడు అదే ప్రాంతానికి చెందిన యువతితో తప్పుగా ప్రవర్తించసాగాడు. తనతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని వేధించేవాడు. అశ్లీల వీడియోలను సైతం ఆమెకు పంపేవాడు. పెళ్లి చేసుకుందామంటూ వెంటపడేవాడు.

అయితే, అతడి పెళ్లి ప్రపోజల్‌కు ఆమె నో చెప్పింది. దీంతో అతడు మరింత రెచ్చిపోయాడు. నిత్యం ఆమెను వేధించసాగాడు. ఈ నేపథ్యంలోనే సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది. అతడిపై ఫిర్యాదు చేసింది. కానీ, సదరు యువకుడిపై కేసు నమోదు చేయటానికి పోలీసులు అంగీకరించలేదు. ఇక, ఈ విషయం ఆ నోటా ఈ నోటా గ్రామ పంచాయతీకి చేరింది. దీంతో గ్రామ పంచాయతీ ఈ కేసును టేకప్‌ చేసింది. యువతిని వేధిస్తున్న యువకుడికి తగిన విధంగా బుద్ధి చెప్పాలని భావించింది.

ఇద్దర్నీ పంచాయతీకి పిలిచింది. అక్కడ యువకుడ్ని అందరి ముందు నిలబెట్టింది. గ్రామ పెద్దలు యువకుడ్ని చెప్పుతో 15 సార్లు కొట్టాలని యువతికి చెప్పారు. యువతి వారు చెప్పిన దాని ప్రకారమే యువకుడ్ని 15 సార్లు చెప్పుతో కొట్టింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి దీన్నంతా వీడియో తీశాడు. ఆ వీడియోను తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో స్పందిస్తున్న నెటిజన్లు.. అలాంటి నీచులకు అలానే జరగాలని అంటున్నారు. మరి, యువతిని వేధించిన యువకుడికి.. గ్రామ పెద్దలు 15 చెప్పు దెబ్బల శిక్ష విధించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap