iDreamPost
android-app
ios-app

పచ్చని కాపురంలో అనుమానపు చిచ్చు! భర్త ఎంతకు తెగించాంటే?

  • Published Nov 12, 2023 | 5:41 PM Updated Updated Nov 12, 2023 | 5:49 PM

పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి అతని భార్యపై కిరాతకానికి పాల్పడ్డాడని అతని అత్తింటి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?

పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి అతని భార్యపై కిరాతకానికి పాల్పడ్డాడని అతని అత్తింటి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?

  • Published Nov 12, 2023 | 5:41 PMUpdated Nov 12, 2023 | 5:49 PM
పచ్చని కాపురంలో అనుమానపు చిచ్చు! భర్త ఎంతకు తెగించాంటే?

భార్యాభర్తలు అన్నాక తిట్టుకోవడం, కొట్టుకోవడం అనేది కామన్. కానీ, ఇంత దానికే కొందరు దంపతులు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పచ్చని సంసారంలో నిప్పులు పోసుకుంటున్నారు. భర్తను భార్య అనుమానించడం, భార్యను భర్త అనుమానించడం చేస్తుంటారు. ఇక మాట్లాడుకుంటే సమిసిపోయే గొడవల కారణంగా చివరికి దారుణాలకు పాల్పడుతున్నారు. గోరుతో పోయేదాన్ని గొడ్డలిదాక తెచ్చుకుంటూ హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాగే తెగించిన ఓ భర్త.. భార్యపై దారుణానికి పాల్పడ్డాడని అత్తింటివారు ఆరోపిస్తున్నారు. ఇంతకు ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు మండలం ఊనగట్ల గ్రామంలో వెంకటేశ్వర్లు-సాయిహరిత (25) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గత 8 ఏళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. పుట్టిన పిల్లలను చూసుకుంటూ ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు. ఇక భర్త స్థానికంగా ఉండే ఓ కంపెనీలో పని చేస్తుండగా.., భార్య ఇంటి వద్దే ఉండేది. ఇకపోతే.. భర్త వెంకటేశ్వర్లు ఆన్ లైన్ గేమ్స్ వ్యసనాలకు అలవాటు పడి ఉన్న డబ్బులు పోగొట్టుకునేవాడు. దీంతో పాటు ఇతగాడు భార్య సాయిహరితను సైతం అనుమానించడం మొదలు పెట్టాడు.

దీంతో ఇదే విషయమై అతడు రోజూ భార్యతో గొడవకు దిగుతు ఉండేవాడు. ఈ క్రమంలోనే వెంకటేశ్వర్లు భార్యను తీసుకుని ఖమ్మం వెళ్లిపోయాడు. చాలా రోజుల నుంచి ఈ దంపతులు అక్కడే ఉంటున్నారు. ఇక్కడికి వచ్చినా.. వెంకటేశ్వర్లు ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాలేదు. అప్పులు మరింత ఎక్కువవ్వడంతో సంసారం గడవడమే కష్టమైపోయింది. దీంతో వీరి కుటుంబ సభ్యులు తిరిగి సొంతూరు వెళ్లాలని సూచించారు. ఇవేం లెక్క చేయని ఆ వ్యక్తి.. అక్కడే ఉండేందుకు ఆసక్తి చూపించాడు. ఇదిలా ఉంటే.. ఈ నెల 1న ఊళ్లో శుభకార్యం ఉండడంతో సాయిహరిత పిల్లలను తీసుకుని ఊనగట్లకు వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న భర్త వెంకటేశ్వర్లు.. వెంటనే తన సొంతూరు వెళ్లిపోయాడు. ఆ రోజు రాత్రి దంపతులు ఇద్దరు నిద్రపోయారు.

కానీ, తెల్లారేసరికి వెంకటేశ్వర్లు ఇంట్లో కనిపించకపోగా, సాయిహరిత బెడ్ రూంలో శవమై కనిపించింది. ఈ విషయం తెలుసుకుని మృతురాలి కుటుంబ సభ్యులు షాక్ గురయ్యారు. వెంటనే అక్కడికి చేరుకుని కూతురిని ఆ స్థితిలో చూసి గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం సాయిహరిత తల్లిదండ్రులు మా కూతురిని ఆమె భర్త వెంకటేశ్వర్లే హత్య చేసి ఉంటాడని ఆరోపించారు. దీంతో పాటు స్థానిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కూడా అదే పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet