iDreamPost
android-app
ios-app

కడుపుతో ఉందని కూడా చూడకుండా భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త!

కడుపుతో ఉందని కూడా చూడకుండా భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త!

డబ్బుపై వ్యామోహంతో కొందరు వ్యక్తులు ఎంతకైనా తెగిస్తున్నారు. కేవలం రూ.3 వేల కోసం ప్రాణ స్నేహితులను సైతం దారుణంగా హత్య చేసి పగ తీర్చుకుంటున్నారు. దేశంలో ఇలాంటి ఘటనే ఇటీవల వెలుగు చూసింది. ఇదిలా ఉంటే.. అదనపు కట్నం కోసం కొందరు భర్తలు కట్టుకున్న భార్యను అని కూడా చూడకుండా దారుణంగా హింసిస్తున్నారు. అచ్చం ఇలాగే ఓ వ్యక్తి.. అదనపు కట్నం కోసం కడుపుతో ఉన్న భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

పోలీసుల కథనం ప్రకారం.. బెంగాల్ మాల్డా జిల్లాలోని అజిమ్ గంజ్ పరిధిలోని సంబాల్ పూర్ గ్రామంలో రబీదాస్-ప్రియాంక (23) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గతంలో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో ప్రియాంక తల్లిదండ్రులు రబీదాస్ కు కట్నం భారీగానే  ముట్టజెప్పినట్లు తెలుస్తుంది. ఇకపోతే.. పెళ్లైన కొంత కాలానికి రబీదాస్ అదనపు కట్నం తేవాలంటూ భార్యను హింసించడం మొదలు పెట్టాడు. పెళ్లైన కొత్తలో ఇవన్ని మాములే అనుకుంది ప్రియాంక. కానీ రాను రాను భర్త రబీదాస్ వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. అయితే ప్రియాంక ప్రస్తుతం 4 నెలల గర్భిణీ కావడం విశేషం.

 ఆగస్టు 1 రాత్రి రబీదాస్ అదనపు కట్నం తేవాలంటూ భార్యతో మరోసారి గొడవ పడ్డాడు. ఇదే విషయంపై ఇద్దరు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే కోపంతో ఊగిపోయిన భర్త రబీదాస్ ఎవరూ ఊహించని దారుణానికి ఒడిగట్టాడు. భార్య గర్భిణీ అని చూడకుండా ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆ మహిళ  ఒక్కసారిగా కేకలు వేయడంతో వెంటనే స్థానికులు అప్రమత్తమై ఆస్పత్రికి తరలించారు. ఇక ప్రియాంక ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ సోమవారం ప్రాణాలు కోల్పోయింది.

ఆ వివాహిత మరణంతో మృతురాలి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం ఈ ఘటనపై ఆమె తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలంగా మారింది. అదనపు  కట్నం భార్య గర్భిణీ అని చూడకుండా పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: ప్రేమ వివాహం.. పెళ్లై ఆరు నెలలే.. ఇంతలోనే తీవ్ర విషాదం!

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomMadridbetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusuJojobet Girişgrandpashabet telegramgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet girişjojobet girişcasibom