అందమైన కుటుంబంలో అంతులేని విషాదం.. బాధ్యతగా ఉండటమే వారు చేసిన తప్పా?

Warangal Bus Accident- అందమైన కుటుంబంలో అంతులేని విషాదం మిగిలింది. బాధ్యతగా మెలగడమే వారు చేసిన తప్పా అని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఇంతకు ఏం జరిగిందంటే..

Warangal Bus Accident- అందమైన కుటుంబంలో అంతులేని విషాదం మిగిలింది. బాధ్యతగా మెలగడమే వారు చేసిన తప్పా అని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఇంతకు ఏం జరిగిందంటే..

పైన ఫొటోలో కనిపిస్తున్న దంపతులను చూశారా.. వారిని చూడగానే అర్థం అవుతుంది కదా.. అన్యోన్య దాంపత్యం అని. చూడటానికి ఎంతో ముచ్చటగా ఉన్నారు. ఇక ఆ దంపతులకు ఒక్కడే సంతానం. ఎలాంటి సమస్యలు లేకుండా.. ఉన్నదాంట్లో ఎంతో సంతృప్తిగా జీవిస్తున్నారు. మరి వీళ్లు ఇంత అన్యోన్యంగా, ఆనందంగా ఉండటం విధికి నచ్చలేదోమే. వారిపై కన్నేసింది. ఎంతో బాధ్యతగా ఉండే కుటుంబాన్ని తన కబంద హస్తాల్లో బంధించి.. వారి ఊపిరి ఆగిపోయేలా చేసి.. అనంత లోకాలకు తీసుకెళ్లింది. సంతోషంగా సాగుతున్న వారి జీవితాలు ఇంత హఠాత్తుగా ముగియడంతో.. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. బాధ్యతగా ఉండాలనుకోవడమే మా బిడ్డలు చేసిన తప్పా అని వారి కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. అందమైన కుటుంబంలో అంతులేని విషాదం మిగిలింది. ఇంతకు ఏం జరిగిందంటే..

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం నాడు దేశవ్యాప్తంగా నాలుగో విడత పోలింగ్‌ జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్‌ జరిగింది. ఎక్కడెక్కడో ఉన్న వారు సైతం ఓటేయడం కోసం సొంత ఊళ్లకు తరలి వెళ్లారు. ఈ క్రమంలో ఓటేయడానికి వెళ్లిన దంపతులతో పాటు వారి కుమారుడు కూడా మృతి చెందాడు. రోడ్డు ప్రమాదం ఈ కుటుంబాన్ని చిదిమేసింది. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథ్‌పల్లి మండల కేంద్రం సమీపంలో సోమవారం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, తండ్రి, కుమారుడు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

వరంగల్ ఎస్ఆర్ఆర్ తోటకు చెందిన తెలకలపల్లి రవీంద్ర (35), తెలకలపల్లి జ్యోతి (32) దంపతులు ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌ వచ్చారు. నగరంలోని బీబీనగర్‌లో కూలీ పనులు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారు. వారికి ఒక భవిష్ (10) అనే కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలో ఎన్నికల నేపథ్యంలో.. ఓటేయడం కోసం రవీంద్ర, జ్యోతి తమ కొడుకు మహేష్‌తో కలిసి.. బైక్‌ మీద వరంగల్‌ బయలుదేరారు. మార్గమధ్యంలో రఘునాథ్ పల్లి సమీపంలో జాతీయ రహదారి ఆనుకొని ఉన్న మొబైల్ టిఫిన్ సెంటర్ వద్ద ఆగి టిఫిన్ చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుండి వరంగల్ వైపు వెళ్తున్న ఆర్టీసీ గరుడ బస్సు రోడ్డు దాటుతున్న వ్యక్తిని తప్పించబోయి మొబైల్ టిఫిన్ వాహనం మీదకి దూసుకెళ్లింది. దాంతో టిఫిన్ చేస్తున్నవారు ప్రమాదానికి గురయ్యారు.

వీరిలో జ్యోతి అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె భర్త, కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్యమధ్యలోనే మృతి చెందారు. అంతేకాక క్యాంటీన్ నిర్వాహకులు రఘునాథపల్లి మండలం సోమయ్యకుంట తండా చెందిన నునావత్ శ్రీకాంత్, నునావత్ సంతోష్ తీవ్ర గాయాలతో హైదరాబాద్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఓటేయడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో బాధితులు గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.

Show comments