iDreamPost
android-app
ios-app

వాహనాలపై దూసుకెళ్లిన వోల్వా బస్సు.. వీడియో వైరల్!

  • Published Aug 13, 2024 | 1:04 PM Updated Updated Aug 13, 2024 | 1:04 PM

Bus Accident Hebbal flyover in North Bangalore: ఇటీవల దేశంలో ప్రతిరోజు పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఎన్ని కఠిన నిబంధనలు తీసుకువచ్చినా ప్రమాదాలను మాత్రం అరికట్టలేకపోతున్నారు.

Bus Accident Hebbal flyover in North Bangalore: ఇటీవల దేశంలో ప్రతిరోజు పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఎన్ని కఠిన నిబంధనలు తీసుకువచ్చినా ప్రమాదాలను మాత్రం అరికట్టలేకపోతున్నారు.

వాహనాలపై దూసుకెళ్లిన వోల్వా బస్సు.. వీడియో వైరల్!

దేశంలో కొంత కాలంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇంటి నుంచి బయటకు వచ్చి క్షేమంగా ఇంటికి చేరుకుంటామా? లేదా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అతి వేగం, నిద్రలేమి, సరైన అనుభవం లేకపోవడం, నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం ఇలా ఎన్నో కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతోమంది చనిపోతున్నారు.అనాథలుగా మిగిలిపోతున్నారు, అంగవైకల్యంతో బాధపడుతున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారికి భారీ జరిమానాలు విధిస్తున్నప్పటికీ డ్రైవర్ల తీరు మారడం లేదని అధికారులు అంటున్నారు. తాజాగా ఓ వోల్వా బస్సు అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. ఈ ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

కర్ణాటక ఉత్తర బెంగుళూర్ లో రద్దీగా ఉండే హెబ్బాల్ ఫైఓవర్ పై ఓ వోల్వా బస్సు ఇతర వాహనాలపైకి దూసుకువెళ్లిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఎదురుగా ఉన్న వాహనాలను వరుసగా ఢీ కొట్టుకుంటూ వెళ్లాడు. ఈ ఘటనలో మూడు బైకులు, రెండు కార్లు ఢీ కొని అడ్డంగా నిలిచిపోయాయి. దీంతో ఫ్లై ఓవర్ పై ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ ఘటనలో పలువురికి స్వల్పంగా గాయాలు అయ్యాయి..  ఒక బైకర్ కి తీవ్రంగా గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించాడు.ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు బస్సులో అమర్చిన సీసీటీవీలో రికార్డు అయ్యాయి.ప్రస్తుతం దీనికి సంబందించి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

గత కొంత కాలంగా కర్ణాటక రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుందని అంటున్నారు. ఏప్రిల్ 2023, మార్చి 2024 మధ్య రాష్ట్రంలో దాదాపు 43,780 రోడ్డు ప్రమాదాలు జరిగాయని.. వీరిలో 11,611 మంది చనిపోగా, 51,207 మంది గాయాలపాలై చికిత్స పొందారు. రోడ్డు ప్రమాదాల్లో మరణాల విషయంలో చండీగఢ్ తర్వాత కర్నాటక రెండో స్థానంలో ఉందని అధికారులు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రెవెన్యూ, పోలీసు, రవాణా, మున్సిపల్ అధికారులు సమిష్టిగా కృషి చేయాలని ఇటీవల సీఎం సిద్ద రామయ్య అధికారులను ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి.