iDreamPost
android-app
ios-app

170 మందితో వెళ్తున్న బ‌స్సు.. ఉన్నట్టుండి ఊడిన టైర్లు..

  • Published Aug 18, 2024 | 3:34 PM Updated Updated Aug 18, 2024 | 3:34 PM

Bus Tires Blown While Running: ఈ మద్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాల సంఖ్య మరీ ఎక్కువ అయ్యాయి. నిర్మల్ లో టీజీఎస్ఆర్టీసీ బస్సు పెను ప్రమాదం నుంచి బయటపడింది.

Bus Tires Blown While Running: ఈ మద్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాల సంఖ్య మరీ ఎక్కువ అయ్యాయి. నిర్మల్ లో టీజీఎస్ఆర్టీసీ బస్సు పెను ప్రమాదం నుంచి బయటపడింది.

170 మందితో వెళ్తున్న బ‌స్సు.. ఉన్నట్టుండి ఊడిన టైర్లు..

ఇటీవల దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం ఒకటైతే.. అనుకోని ప్రమాదాలు, ప్రకృతి విపత్తుల వల్ల మరికొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫోర్ వీలర్స్ నడిపే సమయంలో నిద్ర లేమి, అతి వేగం, అవగాహన లేమి, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. అప్పుడప్పుడు టైర్ పేలి పోవడం, ఊడి పోవడం, వాహనాల్లో ఇంజన్ లో మంటలు చెలరేగడం, ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు. తాజాగా నిర్మల్ జిల్లా మోరపల్లిలో 170తో ప్రయాణిస్తున్న ఓ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే..

నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. వేగంగా వెళ్తున్న టీజీఎస్ఆర్టీసీ బస్సు టైర్లు ఊడిపోయాయి.. బస్సు అదుపుతప్పినప్పటికీ డ్రైవర్ చాకచక్యంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు.170 మందితో ప్రయాణిస్తున్న బస్సు వెనుక వైపు రెండు చక్రాలు అకస్మాత్తుగా ఊడిపోయి పక్కనే ఉన్న చెట్లపొదల్లోకి దొర్లుకుంటూ పోయాయి. నిర్మంల్ డిపో బస్సు జిగిత్యాల నుంచి వెళ్తుండాగా మొరపెల్లి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టైర్లు ఊడిపోవడంతో బస్సు కుదుపునకు గురైంది.. వెంటనే డ్రైవర్ బ్రేకులు వేసి బస్ కంట్రోల్ చేసి ఆపడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బస్సు వెనుక భాగం కొంత వరకు దెబ్బతిన్నది.

రేపు రాఖీ పండుగ సందర్భంగా ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగిపోయింది. అందులోనూ ప్రస్తుతం తెలంగాణలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కావడంతో రద్దీ మరింత పెరిగిపోయింది. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆర్టీసీ బస్సులు రద్దీగా కనిపిస్తున్నాయి.. బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. మరోవైపు టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు అసౌకర్యం లేకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్రస్తుతం నిర్మల్ లో జరిగిన ఈ ప్రమాదం హాట్ టాపిక్ గా మారింది.