iDreamPost
android-app
ios-app

ప్రేమించి పెళ్లి.. 6 ఏళ్లు గడిచిందో లేదో..!

  • Published Oct 20, 2023 | 5:59 PM Updated Updated Oct 20, 2023 | 5:59 PM

ఓ అమ్మాయి గత ఆరేళ్ల కిందట ప్రేమించిన వాడినే వివాహం చేసుకుంది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతులు సంతోషంగానే కాపురాన్ని కొనసాగించారు. కొన్నాళ్లకి వీరికి ఓ కుమారుడు కూడా జన్మించాడు. ఇంత వరకు అంతా బాగానే ఉంది. కానీ,

ఓ అమ్మాయి గత ఆరేళ్ల కిందట ప్రేమించిన వాడినే వివాహం చేసుకుంది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతులు సంతోషంగానే కాపురాన్ని కొనసాగించారు. కొన్నాళ్లకి వీరికి ఓ కుమారుడు కూడా జన్మించాడు. ఇంత వరకు అంతా బాగానే ఉంది. కానీ,

  • Published Oct 20, 2023 | 5:59 PMUpdated Oct 20, 2023 | 5:59 PM
ప్రేమించి పెళ్లి.. 6 ఏళ్లు గడిచిందో లేదో..!

పైన ఫొటోలో కనిపిస్తున్న యువతి పేరు శివకావ్య. వయసు 25 ఏళ్లు. ఈ అమ్మాయి గత ఆరేళ్ల కిందట ప్రేమించిన వాడినే వివాహం చేసుకుంది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతులు సంతోషంగానే కాపురాన్ని కొనసాగించారు. కొన్నాళ్లకి వీరికి ఓ కుమారుడు కూడా జన్మించాడు. ఇంత వరకు అంతా బాగానే ఉంది. కానీ, ఈ ఒక్క కారణంతో భర్త భార్యను వేధించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే ఈ యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా ఆత్మకూరుకు చెందిన శివకావ్య (25) భరత్ భార్యాభర్తలు. వీళ్లు గత ఆరేళ్ల కిందట ప్రేమించుకుని కులాంతర వివాహం చేసుకున్నారు. పెళ్లైన కొంత కాలానికి వీరికి ఓ కుమారుడు జన్మించాడు. అయితే అప్పటి నుంచి భర్త అదనపు కట్నం తేవాలని వేధించినట్లుగా తెలుస్తుంది. ప్రతీ ఏడాది భార్య గర్బం దాల్చడంతో కట్నం తెచ్చేంత వరకు పిల్లలను కనేది టార్చర్ చేసినట్లు సమాచారం.

ఇలా శివకావ్య రెండు మూడు సార్లకు పైగా అబార్షన్ మాత్రలు వేసుకోవడంతో ఇటీవల ఆమె ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆమె తల్లిదండ్రులు వెంటనే అప్రమత్తమై హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఇక పరిస్థితి విషమించడంతో ఆ యువతి చికిత్స పొందుతూ తాజాగా ప్రాణాలు కోల్పోయింది. శివకావ్య మరణించడంతో ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

ఈ క్రమంలోనే మృతురాలి కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కట్నం తేవాలని భర్త అనేక సార్లు వేధించాడని, అప్పటి వరకు పిల్లలను కనేది లేదని భర్త అబార్షన్ మాత్రలు బలవంతంగా ఇచ్చాడని, దీని కారణంగానే మా అమ్మాయి ప్రాణాలు కోల్పోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomcasibom