iDreamPost
android-app
ios-app

భార్య ముక్కు కోసి భర్త పరార్! ఎక్కడో కాదు..!

  • Published Jul 03, 2023 | 5:41 PM Updated Updated Jul 03, 2023 | 5:41 PM
  • Published Jul 03, 2023 | 5:41 PMUpdated Jul 03, 2023 | 5:41 PM
భార్య ముక్కు కోసి భర్త పరార్! ఎక్కడో కాదు..!

పైన ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు సీమాదేవి. గతంలో వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ దంపతులు కొన్నాళ్ల పాటు ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగానే కాపురాన్ని గడిపారు. కానీ, ఆమె భర్త రూటు మార్చి వక్రబుద్దిని చూపించాడు. భర్త చేసిన ఆ ఒక్క పాడు పనికి భార్యకు చిర్రెత్తుకొచ్చింది. ఇదే విషయంపై భార్యాభర్తలు తరుచు గొడవ పడేవారు. ఇటీవల కూడా మరోసారి ఇద్దరూ గొడవ పడ్డారు. ఇక కోపంతో ఊగిపోయిన ఆమె భర్త దారుణానికి పాల్పడ్డాడు. భార్య ముక్కు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకు భర్త భార్య ముక్కును ఎందుకు కోశాడో తెలుసా?

పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ లఖీంపూరి ఖేరి ప్రాంతం. ఇక్కడే విక్రమ్-సీమాదేవి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గతంలో వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతుల వైవాహిక జీవితం సాఫీగానే సాగింది. ఇక కొంత కాలానికి ఈ భార్యాభర్తలకు ఇద్దరు పిల్లలు జన్మించారు. ఇదిలా ఉంటే, కొన్నాళ్ల తర్వాత విక్రమ్ తన బుద్దిని వక్రమార్గంలోకి నెట్టేసి పరాయి మహిళపై మోజు పడ్డాడు. ఈ వ్యవహారాన్ని భార్యకు తెలియకుండా సీక్రెట్ గా మెయింటెన్ చేస్తూ ప్రియురాలితో సరసాలకు దిగాడు. కట్ చేస్తే.. ఇదే విషయం అతని భార్య సీమాదేవికి తెలిసింది. దీంతో భార్య భర్తతో గొడవకు దిగింది. బుద్ది మార్చుకోవాలంటూ భర్తకు అనేక సార్లు చెప్పి చూసింది. అయినా మనోడు అస్సలు తగ్గేదే లే అంటూ ప్రియురాలితో తిరిగేవాడు.

ఇకపోతే, ఈ భార్యాభర్తలు ఓ రోజు రాత్రి మరోసారి గొడవపడ్డారు. ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఇక కోపంతో ఊగిపోయిన భర్త విక్రమ్.. ఇంట్లో ఉన్న కత్తితో భార్య సీతాదేవి ముక్కు కోశాడు. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే? తెగిన సగం ముక్కుని అతడు తన జేబులో వేసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తం కారుతున్న ఆ వివాహిత అస్సలు వెనక్కి తగ్గకుండా నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి భర్తపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు ఆ నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom