iDreamPost
android-app
ios-app

ఆమె గర్భవతని తెలుసు.. అయినా ఐదుగురు కలిసి ఆమెపై!

  • Published Jul 06, 2023 | 3:48 PM Updated Updated Jul 06, 2023 | 3:48 PM
  • Published Jul 06, 2023 | 3:48 PMUpdated Jul 06, 2023 | 3:48 PM
ఆమె గర్భవతని తెలుసు.. అయినా ఐదుగురు కలిసి ఆమెపై!

పైన ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు రాంబిరి. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఈ మహిళకు 2015లో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు భర్తతో బాగానే సంసారం చేసింది. కొన్నాళ్లకి ఈ భార్యాభర్తల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. దీంతో ఆ మహిళ భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లింది. కొన్ని రోజుల పాటు అక్కడే గడిపింది. ఇక కొంత కాలానికి ఈ మహిళకు ఓ యువకుడు పరిచయం అయ్యాడు. అలా వీరి పరిచయం చివరికి వివాహేతర సంబంధంగా మారింది. కట్ చేస్తే.. ఆ యువకుడు ప్రియురాలిని నమ్మించి నట్టేట ముంచాడు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకంగా మారింది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ మీరట్ జిల్లాలోని ఓ ప్రాంతంలో రాంబిరి అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమెకు గతంలో వినోద్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వివాహ అనంతరం ఆ మహిళ భర్తతో బాగానే సంసారం చేసింది. అలా కొన్ని రోజులు గడిచింది. అప్పటి వరకు సంతోషంగా సాగిన వీరి కాపురంలో ఒక్కసారిగా విభేదాలు భగ్గుమన్నాయి. దీంతో రాంబిరి భర్తను వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడే కొన్నాళ్ల పాటు గడిపింది. ఈ క్రమంలోనే ఈ వివాహితకు మరో యువకుడు పరిచయం అయ్యాడు.

ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇక ఇంకేముంది.. ప్రియుడిని నమ్మిన రాంబిరి.. అతనికి శారీరకంగా కూడా దగ్గరైంది. అప్పటి నుంచి ఇద్దరు ఈ ఈ వ్యవహారాన్ని సీక్రెట్ గా మెయింటెన్ చేస్తూ వచ్చారు. అలా కొంత కాలానికి రాంబిరి గర్భం దాల్చింది. దీంతో ఎలాగైన ప్రియుడినే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. దీనికి ఆమె ప్రియుడు మాత్రం అంగీకరించలేదు. ఇదే విషయంపై ఇద్దరు తరుచు గొడవ పడేవారు. ఇక రాను రాను రాంబిరి పెళ్లి చేసుకోవాలని ప్రియుడిని టార్చర్ పెట్టింది. ఇక అతనికి ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. ఈ క్రమంలోనే అతనికి ఓ ఐడియా వచ్చింది.

అదే.. తన ప్రియురాలిని హత్య చేయడం. ఇక అనుకున్నదే ఆలస్యం.. నలుగురి స్నేహితుల సాయంతో ప్రియురాలి హత్యకు ప్లాన్ గీశాడు. గర్భవతి అని కూడా చూడకుండా రాంబిరిని జూలై 2న అతి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని స్థానికంగా ఉన్న చెట్ల పొదల్లో వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio