iDreamPost
android-app
ios-app

ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు యువకులు! క్లైమాక్స్ లో ఊహించని సీన్!

  • Published Nov 03, 2023 | 12:13 PM Updated Updated Nov 03, 2023 | 12:13 PM

ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు యువకులు.. ఇలాంటివి సినిమాల వరకు అయితే బాగుంటుంది కానీ.. నిజ జీవితంలో అస్సలు వర్కౌట్ కాదని తెలుసు. కానీ, ఓ చోట మాత్రం అదే జరిగింది. ఇద్దరు స్నేహితులు ఒకే అమ్మాయిని ప్రేమించారు. అసలు విషయం బయటపడడంతో క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది.

ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు యువకులు.. ఇలాంటివి సినిమాల వరకు అయితే బాగుంటుంది కానీ.. నిజ జీవితంలో అస్సలు వర్కౌట్ కాదని తెలుసు. కానీ, ఓ చోట మాత్రం అదే జరిగింది. ఇద్దరు స్నేహితులు ఒకే అమ్మాయిని ప్రేమించారు. అసలు విషయం బయటపడడంతో క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది.

  • Published Nov 03, 2023 | 12:13 PMUpdated Nov 03, 2023 | 12:13 PM
ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు యువకులు! క్లైమాక్స్ లో ఊహించని సీన్!

ప్రేమకు కులం, మతం, రంగుతో పని లేదు. వయసుతో అసలే పనే లేదు. ఈ మధ్య 25 ఏళ్ల యువతులు 50 ఏళ్ల వ్యక్తులను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఘటనలు మనం గతంలో చాలానే విన్నాం. ఇదిలా ఉంటే.. ఒకే అమ్మాయిని ఇద్దరు యువకులు ఒకరికి తెలియకుండా ఒకరు లవ్ చేస్తే ఎలా ఉంటుంది. ఇలాంటివి సినిమాల వరకు అయితే బాగుంటుంది కానీ.. నిజ జీవితంలో అస్సలు వర్కౌట్ కాదని అందరికీ తెలుసు. కానీ, ఓ చోట మాత్రం అదే జరిగింది. ఇద్దరు స్నేహితులు ఒకరికి తెలియకుండా మరొకరు ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించారు. ఇక అసలు విషయం బయటపడడంతో క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ లక్నోకు చెందిన వినయ్ ద్వివేది అనే యువకుడు ట్యాక్సీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇతనికి ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. దీంతో చాలా కాలం నుంచి ఇద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. ఇదిలా ఉంటే.. వినయ్ ద్వివేది స్నేహితుడైన వికాస్ కుమార్ కూడా అదే అమ్మాయిని ప్రేమించాడు. అయితే ఈ యువతి ఒకరికి తెలియకుండా ఒకరిని మెయింటెన్ చేస్తూ వచ్చింది. కాగా, ఇదే విషయం ఇటీవల ఇద్దరు తెలుసుకుని షాక్ గురయ్యారు. జరిగిందేదో జరిగిపోయింది.. ఇక ఆ యువతిని మరిచిపోమని వికాస్ కుమార్ వినయ్ ద్వివేదికి సూచించాడు . అతని మాటలు విన్న ఆ యువకుడు.. తగ్గేదేలే అన్నట్లుగా నో చెప్పాడు. ఆ పిల్లా నాదంటే నాది అని ఇద్దరు చాలా కాలం నుంచి పోట్లాడుకుంటున్నారు. ఇలా అయితే కాదని భావించిన వికాస్ కుమార్ వినయ్ ని హత్య చేయాలని ప్లాన్ గీశాడు. ఇందులో భాగంగానే బుధవారం వికాస్.. వినయ్ ద్వివేదిని నమ్మించి స్థానికంగా ఉన్న ఓ రైలు పట్టాల వద్దకు రమ్మన్నాడు. అతడు కోరినట్లే ఆ యువకుడు కూడా అక్కడికి వెళ్లాడు. వికాస్ కుమార్ అప్పటికే మరో ఇద్దరి స్నేహితులతో ముందే వచ్చి అక్కడే ఉన్నాడు.

ఇక వీరి ప్రేమ వ్యవహారం గురించి ఇద్దరు మరోసారి గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే వికాస్ కుమార్ కోపంతో ఊగిపోయి వెంట తెచ్చుకునన తుపాకీతో తన స్నేహితుడైన వినయ్ ద్వివేదిని కాల్చి అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఆ యువకుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. ఆ యువకుడి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. అనంతరం ఈ ఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు యువకులు ఒకే అమ్మాయిని ప్రేమించారని, దీని కారణంగానే గొడవ పడడంతో వికాస్ కుమార్ అతని స్నేహితుడిపై కాల్పులు జరిపాడు తెలిపారు. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకే అమ్మాయిని ఇద్దరు ప్రేమించి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom