iDreamPost
android-app
ios-app

ప్రముఖ యూట్యూబర్ ఆత్మహత్య! కంటతడి పెట్టిస్తున్న చివరి వీడియో!

  • Published Nov 25, 2023 | 1:11 PM Updated Updated Nov 25, 2023 | 1:11 PM

ఉత్తర్ ప్రదేశ్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. భోజ్ పురి ప్రముఖ యూట్యూబర్ ఆత్మహత్య చేసుకున్నారు. దాని కంటే ముందు ఆమె ఓ వీడియో తీసుకున్నారు. ఇంతకు ఏం జరిగిందంటే?

ఉత్తర్ ప్రదేశ్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. భోజ్ పురి ప్రముఖ యూట్యూబర్ ఆత్మహత్య చేసుకున్నారు. దాని కంటే ముందు ఆమె ఓ వీడియో తీసుకున్నారు. ఇంతకు ఏం జరిగిందంటే?

  • Published Nov 25, 2023 | 1:11 PMUpdated Nov 25, 2023 | 1:11 PM
ప్రముఖ యూట్యూబర్ ఆత్మహత్య! కంటతడి పెట్టిస్తున్న చివరి వీడియో!

భోజ్ పురి ప్రముఖ యూట్యూబర్ ఉన్నట్టుండి తాజాగా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకుని ఆమె కుటుంబ సభ్యులతో పాటు ఆమె ఫాలోవర్స్ షాక్ కు గురవుతున్నారు. ఎన్నో వీడియోలతో అందరినీ అలరించిన ఈ యూట్యూబర్.. సడెన్ గా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో అందరూ శోక సంద్రంలో మునిగిపోయారు. మరో విషయం ఏంటంటే? ఆమె ఆత్మహత్యకు ముందు ఓ వీడియో తీసుకున్నారు. అసలు ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారనే పూర్తి వివరాలు అందులో తెలిపింది. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియలో వైరల్ గా మారుతోంది. ఇంతకు ఈ యూట్యూబర్ ఎవరు? ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ లోని సంత్ కబీర్ నగర్ లో మాల్తీ దేవి అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమె ప్రస్తుతం ప్రముఖ భోజ్‌పురి యూట్యూబర్ గా కొనసాగుతున్నారు. మాల్తీ దేవి చేసే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ యూట్యూబర్ ఉన్నట్టుండి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గురువారం ఆమె ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, అంతకంటే ముందే యూట్యూబర్ మాల్తీదేవి ఓ వీడియో తీసుకున్నారు. అందులో ఆమె అత్తమామలు, భర్తపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.

ఇంతకు ఆ మహిళ వీడియోలో ఏం చెప్పిందంటే? నా భర్త, అత్తమామలు గత కొంత కాలం నుంచి అదనపు కట్నం తేవాలని వేధింపులకు గురి చేస్తున్నారు. ఇంతే కాకుండా చాలా సార్లు నాపై దాడి కూడా చేశారంటూ ఏడుస్తూ చెప్పింది. ఇదే వీడియోను ఆమె సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చూశారు. దీన్ని చూసిన ఆమె ఫాలోవర్స్ కంటతడి పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఆ తర్వాత ఘటన స్థలానికి చేరుకుని మాల్తీదేవిని ఆ స్థితిలో చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. మా అమ్మాయిని ఆమె భర్త, అత్తింటి కుటుంబ సభ్యులు కట్నం పేరుతో వేధించారని, ఇప్పుడు వాళ్లే హత్య చేసి ఉంటారని ఆరోపించారు. అనంతరం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. మరో విషయం ఏంటంటే? ఆత్మహత్యకు ముందు మాల్తీ దేవి తీసుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet girişjojobet giriş