iDreamPost
android-app
ios-app

యువతితో వాట్సాప్‌లో చాటింగ్‌.. ఆ విషయాలను బయటపెట్టడంతో..

యువతితో వాట్సాప్‌లో చాటింగ్‌.. ఆ విషయాలను బయటపెట్టడంతో..

యువతితో వాట్సాప్‌లో చాట్‌ చేసిన మెసేజ్ల తాలూకా స్క్రీన్‌ షాట్లను వైరల్‌ చేసిన ఓ యువకుడికి గ్రామస్తులు గట్టిగానే బుద్ధి చెప్పారు. అతడ్ని గ్రామ పంచాయతీలో నిలబెట్టించి, యువతితో చెప్పు దెబ్బలు తినిపించారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఆ పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్‌లోని హపుర్‌ జిల్లాకు చెందిన ఓ యువతి, యువకుడు రొమాంటిక్‌ రిలేషన్‌లో ఉన్నారు. ఇద్దరూ వాట్సాప్‌ ద్వారా తరచుగా మెసేజ్‌లు చేసుకుంటూ ఉండేవారు.

ఈ నేపథ్యంలోనే అతడు ఆమెతో చేసిన చాటింగ్‌ తాలూకా స్క్రీన్‌ షాట్లను బయట పెట్టాడు. దీంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. దీంతో మనస్తాపానికి గురైన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, సదరు యువకుడిపై కేసు నమోదు చేయటానికి పోలీసులు ఒప్పుకోలేదు. దీంతో ఈ విషయాన్ని గ్రామ పంచాయతీ పెద్దలకు చెప్పింది. వారు అతడ్ని పంచాయతీ ముందుకు పిలిపించారు. అందరి ముందు అతడ్ని నిలబెట్టి యువతిని చెప్పుతో కొట్టమన్నారు.

పెద్దల మాటల మేరకు.. యువతి అందరి ముందు అతడ్ని కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. యువతితో వాట్సాప్‌లో చాట్‌ చేసిన మెసేజ్ల తాలూకా స్క్రీన్‌ షాట్లను వైరల్‌ చేసిన ఆ యువకుడికి గ్రామ పంచాయతీ బుద్ధి చెప్పటంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి వారికి ఇలానే బుద్ధి చెప్పాలంటున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/