iDreamPost
android-app
ios-app

అందమైన భార్యపై దారుణం! ఆ ఘటన చూసి SP కూడా షాక్ అయ్యాడు!

మూడు ముళ్లు, ఏడు అడుగులు వేసే సమయంలో భార్యకు ఏ కష్టం రాకుండా చూసుకుంటామని ప్రమాణాలు చేస్తాడు భర్త. కానీ పెళ్లై, అన్ని తానే అనుకుని కట్టుకున్న వాడ్ని నమ్మి.. అత్తింట్లోకి అడుగుపెడుతున్న యవతికి .. కొన్ని రోజుల్లోనే చుక్కలు చూపిస్తున్నారు

మూడు ముళ్లు, ఏడు అడుగులు వేసే సమయంలో భార్యకు ఏ కష్టం రాకుండా చూసుకుంటామని ప్రమాణాలు చేస్తాడు భర్త. కానీ పెళ్లై, అన్ని తానే అనుకుని కట్టుకున్న వాడ్ని నమ్మి.. అత్తింట్లోకి అడుగుపెడుతున్న యవతికి .. కొన్ని రోజుల్లోనే చుక్కలు చూపిస్తున్నారు

అందమైన భార్యపై దారుణం! ఆ ఘటన చూసి SP కూడా షాక్ అయ్యాడు!

భార్యను కలకాలం కంటికి రెప్పలా కాపాడుతానని, కష్టనష్టాల్లోనూ తోడుంటానని ప్రమాణాలు చేసిన భర్త.. ఆ మాటలను గాలికి వదిలేస్తున్నాడు. తనతో కలిసి ఏడడుగులు వేసిన భార్యను.. ఏడు రోజుల్లోనే బాధపెడుతున్నాడు. మరికొన్ని రోజుల్లో  ప్రత్యక్ష నరకం ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. తన కాపురాన్ని సర్ది చెప్పుకుందామని, సరిపెట్టుకుంటున్న భార్యను మానసికంగానే కాదు శారీరకంగా హింసించి, చివరకు ఆమె అడ్డు తొలగించుకునేందుకు తల్లిదండ్రులతో కలిసి అంతమొందిస్తున్నాడు. తాజాగా ఓ వివాహితను అత్యంత ఘోరంగా, దారుణంగా కొట్టి చంపేశారు భర్త, ఆమె అత్తింటివారు. అందాల బొమ్మ, అపరంజి బొమ్మను కిరాతకంగా హత్య చేశాడు భర్త, అతడి సోదరులు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఇటావాలోని షేఖుపూర్ తలైయా గ్రామానికి చెందిన 30 ఏళ్ల రేష్మకు 12 సంవత్సరాల క్రితం యుపిలోని మత్సేనాలోని అకల్‌పూర్ నివాసి సుర్జీత్‌తో వివాహం జరిగింది. కాగా, రేష్మది నిరుపేద కుటుంబమని అత్తామామలు, భర్త, ఆమె సోదరులు దూషిస్తూ ఉండేవారు. ఆమె వెనుక సరైన ఆర్థిక, అండ లేకపోవడంతో చిన్న చిన్న విషయాలకే ఆమెపై చేయి చేసుకునే వాళ్లు. రోజు రోజుకు ఈ వేధింపులు ఎక్కువయ్యాయి. అయినా తట్టుకుని అతడితో కాపురం చేయసాగింది రేష్మ.  సోమవారం అర్థరాత్రి రోజులానే  తప్పతాగి ఇంటికి వచ్చి భర్త, నిద్రిస్తున్న భార్య రేష్మ కాళ్లు పట్టుకున్నాడు. అనంతరం సోదరుల్ని పిలిచి.. చేతులు, కాళ్లు పట్టుకోమన్నాడు. అనంతరం నోరు మూసి కొడుతూనే ఉన్నాడు. అయితే ఆమె అరుపులు వినిపించి స్థానికులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే మహిళ సోదరుడికి సమాచారం అందించారు. అక్క పరిస్థితి చూసి వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించాడు.

అక్కడ వైద్యులు రేష్మ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఆమె కాళ్లపై తాడు గుర్తులున్నట్లు తేలింది. అలాగే ఆమె కడుపులో ఏదో ఇనుప వస్తువులున్నట్లు గురించారు. కాాగా,  ఆమె మరణానికి తలకు గాయమే కారణమని నిర్దారించారు పోలీసులు. కాగా, రేష్మా- సుర్జీత్ దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. ఈ ముగ్గురికి తల్లి లేని అనాథలను చేశాడు భర్త. కాగా, ఈ ఘటనపై సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భర్త సుర్జీత్ అతడి ఇద్దరు సోదరులను అరెస్టు చేశారు పోలీసులు. మహిళ కడుపులో ఇనుప వస్తువు ఉండటం, ఇటువంటి ఘటనలు తానెప్పుడూ చూడలేదని, ఈ కోణంలో కూడా విచారణ చేపడుతున్నట్లు వెల్లడించారు ఎస్పీ. నిపుణులతో ఈ కేసు దర్యాప్తు చేపడతామన్నారు.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibomgrandpashabetmarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişgrandpashabetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabet