iDreamPost
android-app
ios-app

ప్రాణం తీసిన రీల్స్‌ పిచ్చి.. మరదలి గొంతు కోసిన బావ!

  • Published Jul 25, 2023 | 1:03 PM Updated Updated Jul 25, 2023 | 1:03 PM
  • Published Jul 25, 2023 | 1:03 PMUpdated Jul 25, 2023 | 1:03 PM
ప్రాణం తీసిన రీల్స్‌ పిచ్చి.. మరదలి గొంతు కోసిన బావ!

ఆ అమ్మాయికి సినిమాల్లో నటించాలని కోరిక. సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉండేది. తరచుగా రీల్స్‌ చేస్తూ.. వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసేది ఈ క్రమంలో ఆమెకు వరసకు బావైన దూరపు బంధువు పరిచయం అయ్యాడు. అతడు షార్ట్‌ ఫిల్మ్స్‌, వీడియో ఎడిటింగ్‌ చేసేవాడు. ఈ క్రమంలో అతడితో కలిసి రీల్స్‌ కూడా చేసింది. బంధువే కదా అని ఆ అమ్మాయి.. అతడితో చనువుగా ఉంది. ఇక ఆమె అందం మీద కన్నేసిన ఆ వ్యక్తి.. బంధువు కాస్త రాబంధువు అయ్యాడు. ఆమెను వివాహం చేసుకోవాలని భావించాడు. వరసైన వాళ్లే కదా తప్పేం ఉంది అంటే.. అప్పటికే అతడికి వివాహం అయ్యి.. ఇద్దరు బిడ్డలు కూడా ఉన్నారు. దాంతో ఆ యువతి పెళ్లికి నిరాకరించింది. కేవలం బంధువులుగా మాత్రమే ఉందామని అన్నది. ఇక యువతికి సినిమాలు అవకాశాలు వచ్చాయి. ఆమె సినిమాల్లోకి వెళ్తే.. ఇక తనను పట్టించుకోదని భావించిన నిందితుడు.. ఆమె గొంతు కోసి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. ఆ వివరాలు..

ఉప్పల్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. తనతో పెళ్లికి నిరాకరించిందని.. కత్తితో యువతి గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడో వ్యక్తి. వెంటనే అప్రమత్తమైన యువతి తప్పించుకుని పారిపోయి కుటుంబ సభ్యుల సాయంతో ఆస్పత్రిలో చేరింది. నిందితుడు ఖమ్మం జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ. గత కొంత కాలంగా అతడు హబ్సీగూడలో నివాసం ఉంటున్నాడు. లక్ష్మీ నారాయణ వీడియో ఎడిటింగ్‌తో పాటు షార్ట్‌ ఫిల్మ్‌లు కూడా చేస్తుంటాడు. అతడికి వివాహం అయ్యి.. ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం అతడికి దూరపు బంధువు, వరసకు మరదలైన బాధిత యువతితో పరిచయం ఏర్పడింది.

యువతి సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉండేది. తరచుగా రీల్స్‌ పోస్ట్‌ చేస్తూ ఉండేది. ఈ క్రమంలో లక్ష్మీ నారాయణతో కలిసి రీల్స్‌ చేసేది. ఆమెపై కన్నేసిన లక్ష్మీనారాయణ.. యువతితో ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడేవాడు. నిందితుడు తమకు బంధువే కావడంతో.. బాధిత యువతి కూడా అతడితో చనువుగా ఉండేది. ఈ క్రమంలోనే లక్ష్మీ రాయణ బాధితురాలిని పెళ్లి చేసుకోవాలని భావించాడు. కానీ అతడికి గతంలోనే వివాహం కావడంతో.. బాధితురాలు అందుకు అంగీకరించలేదు. ఇలా ఉండగానే బాధితురాలికి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఆ విషయం తెలుసుకున్న లక్ష్మీ నారాయణ.. బాధితురాలు ఇక తనను పట్టించుకోదని.. ఆమెపై పగ పెంచుకున్నాడు.

బాధితురాలిని చంపాలని భావించాడు లక్ష్మీ నారాయణ. ఈ క్రమంలో ఆమెకు కాల్‌ చేసి మాట్లాడాలని చెప్పి ఈ నెల 22న తన కారులో ఎక్కించుకుని ఉప్పల్‌ భగాయత్‌కు తీసుకొచ్చాడు. మరోసారి ఆమె ముందు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్రహించిన లక్ష్మీ నారాయణ.. ముందే తనతో పాటు తెచ్చుకున్న కత్తి తీసుకుని యువతి గొంతు కోసేందుకు ప్రయత్నించాడు. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు.. అక్కడ నుంచి తప్పించుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అనంతరం బాధితురాలు ఉప్పల్‌ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు లక్ష్మీ నారాయణనను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం యువతి పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు.

Jojobet GirişmeritbetmarsbahisHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibomromabet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet giriş