iDreamPost
android-app
ios-app

వీడియో: ఎస్సై నిర్లక్ష్యంతో మహిళ తలలోకి దూసుకుపోయిన తూటా!

  • Published Dec 09, 2023 | 9:09 AM Updated Updated Dec 09, 2023 | 9:09 AM

కొన్నిసార్లు మనం చేసే నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు బలి అవుతుంటాయి. ముఖ్యంగా పోలీసులు గన్ శుభ్రం చేసే సమయంలో అది మిస్ ఫైర్ అయి ప్రాణాలు పోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.

కొన్నిసార్లు మనం చేసే నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు బలి అవుతుంటాయి. ముఖ్యంగా పోలీసులు గన్ శుభ్రం చేసే సమయంలో అది మిస్ ఫైర్ అయి ప్రాణాలు పోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.

వీడియో: ఎస్సై నిర్లక్ష్యంతో మహిళ తలలోకి దూసుకుపోయిన తూటా!

ఇటీవల కొంతమంది నిర్లక్ష్యం ఎంతోమంది ప్రాణాలు హరించి వేస్తుంది. తప్పు అని తెలిసి కూడా పొరపాటు చేయడం.. దాని ప్రతిఫలంగా ప్రమాదంలో పడటం సర్వసాధారణం అయ్యింది. గతంలో చాలామంది పోలీసులు సర్వీస్ గన్ క్లీన్ చేస్తుండగా మిస్ ఫైర్ అయి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రమాదం అని తెలిసిన నిర్లక్ష్య వైఖరి వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి.. కొన్నిసార్లు పొరపాటున గన్ లో ఉన్న బుల్లెట్ ఇతరులకు తగిలి ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఓ పోలీస్ అధికారి నిర్లక్ష్యం ఒక మహిళ ప్రాణాల మీదకు తీసుకువచ్చింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఉత్తర్ ప్రదేశ్ లో అలీగఢ్ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ ఎస్సై చుట్టూ ఏమాత్రం గమనించకుండా శుభ్రం చేస్తున్న సమయంలో హఠాత్తుగా పేలిపోవడంతో ఎదురుగా ఉన్న ఓ మహిళ తలలోకి బుల్లెట్ దూరిపోయింది. అలీగఢ్ ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఇష్రత్ అనే మహిళ పాస్ పోర్ట్ వేరిఫికేషన్ కోసం తన కుమారుడితో స్టేషన్ కి వచ్చింది. అదే సమయంలో స్టేషన్ లో ఉన్న ఎస్సై మనోజ్ కుమార్ కు మరో పోలీస్ తుపాకీ ఇచ్చి వెళ్లాడు. ఆయన తుపాకీ శుభ్రం చేస్తున్న సమయంలో అనుకోకుండా బుల్లెట్ పేలడంతో మహిళ తలలోకి దూసుకువెళ్లింది. ఆమె అక్కడే కుప్పకూలిపోయింది.

హఠాత్తుగా జరిగిన ఈ పరిణామంతో అందరూ షాక్ అయ్యారు. వెంటనే ఆ మహిళలను స్థానికంగా ఉన్న జవహర్ లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్ కి తీసుకువెళ్లి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బుల్లెల్ ఇంకా ఆ మహిళ తలలోనే ఉందని.. ఆపరేషన్ చేసి దాన్ని బయటికి తీయాలని.. అది చాలా ప్రమాదం అని డాక్టర్లు చెబుతున్నారు. బుల్లెల్ మహిళ తల వెనుకభాగంలో తగిలిందని.. ఇందుకు కారణం అయిన ఎస్సైని వెంటనే సస్పెండ్ చేశామని ఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేశామని.. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని అన్నారు. ప్రజలను కాపాడే పోలీస్ అధికారి నిర్లక్ష్యపు వ్యవహారంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.