iDreamPost
android-app
ios-app

నిర్దాక్షిణ్యంగా ఇద్దరు బిడ్డలని చంపి.. ఓ సైకో ఆడిన ఆట! చివరికి!

  • Published Mar 20, 2024 | 2:54 PM Updated Updated Mar 20, 2024 | 2:54 PM

పసి బిడ్డలు అని చూడకుండా.. అప్పు ఇచ్చిన ఇంట్లో విషాదాన్ని నింపాడో దుర్మార్గుడు. సైకోగా వ్యవహరించి.. తల్లిదండ్రులకు పుత్రశోకాన్ని మిగిల్చాడు. అతడి కర్కశం తెలియని పిల్లలు.. అతడ్ని నమ్మి వెళితే..

పసి బిడ్డలు అని చూడకుండా.. అప్పు ఇచ్చిన ఇంట్లో విషాదాన్ని నింపాడో దుర్మార్గుడు. సైకోగా వ్యవహరించి.. తల్లిదండ్రులకు పుత్రశోకాన్ని మిగిల్చాడు. అతడి కర్కశం తెలియని పిల్లలు.. అతడ్ని నమ్మి వెళితే..

  • Published Mar 20, 2024 | 2:54 PMUpdated Mar 20, 2024 | 2:54 PM
నిర్దాక్షిణ్యంగా ఇద్దరు బిడ్డలని చంపి.. ఓ సైకో ఆడిన ఆట! చివరికి!

అఘాయిత్యాలు, హత్యలు చేయడానికి కారణాలు ఉండటం లేదు. అల్టిమేట్‌గా డబ్బు.. ఓర్వలేని తనం, ఇగో, వివాహేతర సంబంధాలు కలిసి కక్ష గట్టి ఇలాంటి కార్పణ్యాలకు కారణాలవుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. అభం, శుభం తెలియని ఇద్దరు పిల్లల్ని.. తల్లి ఉండగానే కోడి పిల్లల్ని నరికినట్టు నరికి చంపేశాడో దుర్మార్గుడు. సాయం చేసిన కుటుంబానికి వెన్నుపోటు పొడవడమే కాదు.. వారికి జీవితాంతం చేదు గాయాన్ని మిగిల్చాడు. ఈ జంట హత్యలతో యుపిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోసారి జై శ్రీరామ్ నినాదాలు మిన్నంటాయి. వివరాల్లోకి వెళితే…

ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో పిల్లలని చూడకుండా నిర్దాక్షిణ్యంగా గొంతు కోసి హత్య చేశాడో  సైకో బార్బర్. మూడో బిడ్డను కూడా చంపేందుకు ప్రయత్నించగా.. ఏడేళ్ల పిల్లాడు చాక చక్యంగా తప్పించుకోవడంతో అతడు బయటపడ్డాడు. స్థానికులు చెబుతున్న వివరాలు ఇలా ఉన్నాయి. బదౌన్ జిల్లాలోని బాబా కాలనీలో మూడో అంతస్తులో నివసిస్తోంది వినోద్ కుటుంబం. వినోద్ భార్య సంగీత బ్యూటీ పార్లర్‌ నడుపుతోంది. వినోద్ ఘాజీపూర్‌లో వాటర్ ట్యాంక్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు. వీరి ఇంటికి ఎదురుగా బార్బర్ షాప్ నడుపుతున్నాడు సాజిద్. ఆ దంపతులకు సాజిద్ తెలుసు. మంగళవారం సాయంత్రం సాజిద్ వినోద్ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో వినోద్ భార్య సంగీత, పిల్లలు ఉన్నారు.

సంగీత చెప్పిన వివరాల ప్రకారం. ‘నా భార్య గర్భవతి, ఆసుపత్రిలో ఉందంటూ.. చికిత్స కోసం రూ. 5 వేలు అవసరం అని కోరాడు సాజిద్. నేను వెంటనే భర్తకు ఫోన్ చేశాను.. ఆయన డబ్బులు ఇవ్వమంటే డబ్బులతో పాటు టీ ఇచ్చాను. డెలివరీ రాత్రి 11 గంటలకు అని టెన్షన్ పడుతంటే. కంగారు పడొద్దు. అంతే మంచి జరుగుతుందని చెప్పాను. అంతలో నా పెద్ద కొడుకు ఆయుష్‌ను తీసుకుని నా బ్యూటీ సెలూన్ చూపించమని మేడపైకి తీసుకెళ్లాడు. రెండో అంతస్తులో సాజిద్ లైట్లు తీసి.. ఆయుష్ పై కత్తితో దాడి చేశాడు. అంతలో మూడో కొడుకు అహాన్ లోపలికి వెళ్లగా.. అతడ్ని కూడా గొంతుపై కత్తి దూశాడు’ అని వెళ్లడించింది. ఇద్దరు రక్తమోడుతూ మరణించారు. అంతలో రెండో కొడుకు పీయూష్ పై దాడి చేయగా.. పారిపోయి దాక్కున్నాడు. పిల్లల అరుపులు విన్న తల్లి, చుట్టుప్రక్కల జనాలు.. గుమిగూడటంతో అక్కడి నుండి పారిపోయాడు.

పిల్లలను అలా చూసిన తల్లి.. కన్నీరుమున్నీరు అయ్యింది. పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను తరలించారు. నిందితుడు సాజిద్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులకు చిక్కాడు సైకో. అతడిని పోలీస్ స్టేషన్ తీసుకెళుతుండగా సాజిద్ పారిపోతుంటే.. ఎన్ కౌంటర్ చేశారు. కాగా, సాజిద్ చేసిన ఈ మారణకాండతో స్థానికుల్లో ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. ఆవేశంతో సెలూన్ కు ధ్వంసం చేయడంతో పాటు నిప్పంటించారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పారామిలటరీ బలగాలు ఆ ప్రాంతంలో మోహరించాయి. మృతదేహాలను తరలిస్తుండగా.. రోదిస్తూ తల్లి అపస్మారక స్థితికి చేరుకుంది. ఇదే సమయంలో కొన్ని హిందూ సంఘాలు జై శ్రీరామ్ నినాదాలు చేశారు. ఇద్దరు పిల్లల్ని అత్యంత దారుణంగా పొట్టనపెట్టుకున్న సైకోపై మండిపడుతున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş