iDreamPost
android-app
ios-app

నిజామాబాద్‌: MLA క్యాండెట్‌ ఆత్మహత్య.. 2 రోజుల్లో గృహ ప్రవేశం.. ఇంతలోనే

  • Published Nov 19, 2023 | 12:22 PM Updated Updated Nov 19, 2023 | 12:22 PM

ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు.. మరో రెండు రోజుల్లో గృహ ప్రవేశం ఉంది. ఆ కార్యక్రమాలతో బిజీగా ఉన్న వ్యక్తి ఉన్నట్లుండి.. ఆత్మహత్య చేసుకున్నాడు. కారణం ఏంటి

ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు.. మరో రెండు రోజుల్లో గృహ ప్రవేశం ఉంది. ఆ కార్యక్రమాలతో బిజీగా ఉన్న వ్యక్తి ఉన్నట్లుండి.. ఆత్మహత్య చేసుకున్నాడు. కారణం ఏంటి

  • Published Nov 19, 2023 | 12:22 PMUpdated Nov 19, 2023 | 12:22 PM
నిజామాబాద్‌: MLA క్యాండెట్‌ ఆత్మహత్య.. 2 రోజుల్లో గృహ ప్రవేశం.. ఇంతలోనే

తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రధాన పార్టీలు, అభ్యర్థులతో పాటు.. ఇండిపెండెంట్‌ క్యాండెట్లు కూడా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఎన్నికలకు సరిగ్గా పది రోజుల సమయం మాత్రమే ఉంది. నవంబర్‌ 30న పోలింగ్‌ జరగనుండగా.. డిసెంబర్‌ 3న ఫలితాలు వెలువడతాయి. పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో.. పార్టీలన్నీ ప్రచార జోరు పెంచాయి. అభ్యర్థులందరూ ఎన్నికల కార్యక్రమాల్లో బిజీగా ఉండగా.. నిజామాబాద్‌లో మాత్రం దారుణం చోటు చేసుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోన్న ఓ ఎమ్మెల్యే అభ్యర్థి.. ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. నిజామాబాద్ అర్బన్ ఇండిపెండెంట్ అభ్యర్థి కన్నయ్య గౌడ్ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ వివరాలు..

నిజామాబాద్‌ జిల్లా, గాయత్రి నగర్‌లో నివాసం ఉంటున్న కన్నయ్య కుమార్‌ గౌడ్‌.. ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. నినిజామాబాద్ అర్బన్ నుంచి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో గృహ ప్రవేశం ఉంది. ఇక శనివారం సాయంత్రం వరకు కూడా ఎన్నికల ప్రచారం, శుభకార్యానికి సంబంధించిన పనులతో బిజీగా ఉన్నాడు. మరి ఏమైందో తెలియదు.. శనివారం రాత్రి తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు కన్నయ్య గౌడ్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ఫోన్‌ హ్యాక్‌ చేశారా..

అయితే కన్నయ్య గౌడ్‌ సెల్‌ఫోన్‌ను సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేశారని.. వారి వేధింపులు తట్టుకోలేకనే.. అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల్లో గృహ ప్రవేశ కార్యక్రమం ఉందని.. కన్నయ్య ఆ పనుల్లో బిజీగా ఉన్నాడని.. అలాంటి వ్యక్తి ఇలా ఆత్మహత్య చేసుకోవడాన్ని తాము జీర్ణించుకోలేకపోతుమన్నారు. ఫోన్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని వెల్లడించారు.

ఫోన్‌ హ్యాక్‌ చేశారా.. లేక లోన్‌ వేధింపుల వల్ల కన్నయ్య గౌడ్‌ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడా అనేది తెలియాల్సి ఉంది. ఈ క్రమంలో పోలీసులు.. సైబర్‌ నేరగాళ్లు, కన్నయ్య గౌడ్‌ను ఏ విధంగా వేధించారు.. డబ్బులు ఏమన్నా కాజేశారా.. లేదంటే ఇతర రకాల వేధింపులకు గురి చేశారా అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో కన్నయ్య ఫోన్‌ని స్వాధీనం చేసుకున్నామని.. త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాని అన్నారు.