iDreamPost
android-app
ios-app

మీర్జాపుర్‌ ఫేమ్‌ పంకజ్‌ త్రిపాఠి ఇంట విషాదం

బాలీవుడ్ నటుడు, మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ పంకజ్ త్రిపాఠి ఇంట్లో విషాం చోటుచేసుకుంది. దీంతో వారి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

బాలీవుడ్ నటుడు, మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ పంకజ్ త్రిపాఠి ఇంట్లో విషాం చోటుచేసుకుంది. దీంతో వారి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

మీర్జాపుర్‌ ఫేమ్‌ పంకజ్‌ త్రిపాఠి ఇంట విషాదం

మీర్జాపూర్ వెబ్ సిరీస్ కు ఆడియెన్స్ నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. రికార్డ్ స్థాయిలో వ్యూవర్ షిప్ సాధించింది మీర్జాపూర్ వెబ్ సిరీస్. ఓటీటీలో మోస్ట్ పాపులర్ ఇండియన్ వెబ్ సిరీస్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. మీర్జాపూర్ వెబ్ సిరీస్ లో బాలీవుడ్ ఫేమస్ యాక్టర్ పంకజ్ త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్, శ్వేత త్రిపాఠి కీలక పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ ను కరణ్ అన్షుమన్, గుర్మీత్ సింగ్ లు తెరకెక్కించారు. కాగా ఈ సిరీస్ లో నటించిన పంకజ్ త్రిపాఠి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన బావ రాజేశ్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, సోదరి సరితకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఆకస్మిక ఘటనతో పంకజ్ త్రిపాఠి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

రోడ్డు ప్రమాదాలు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగుల్చుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు రోడ్డు ప్రమాదాల భారిన పడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిర్లక్ష్యంగా వాహనాలను నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నారు. ముఖ్యంగా స్పీడు విషయంలో ఓవర్ స్పీడుతో వెళ్లి ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి బావ, సోదరి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. బిహార్‌ నుంచి పశ్చిమ బెంగాల్‌ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేశ్‌-సరిత దంపతులు శనివారం సాయంత్రం బిహార్‌లోని గోపాల్‌ఘంజ్‌ జిల్లా నుంచి కారులో పశ్చిమ బెంగాల్‌కు బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న కారు దిల్లీ-కోల్‌కతా జాతీయ రహదారిపై ఒక్కసారిగా అదుపు తప్పింది. ఆ తర్వాత డివైడర్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న దంపతులిద్దరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. అటుగా వెళ్తున్న వారు ప్రమాద సమాచారాన్ని అందించడంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకుని బాధితులను హాస్పిటల్ కు తరలించామని వెల్లడించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రాజేశ్ అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్దారించారు. సరితకు కాలు విరిగిందని ఆమెకు అవసరమైన చికిత్స కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు.