iDreamPost

బంగారం లాంటి భవిష్యత్తు.. ఆ ఒక్క కారణంతో ఎంత పని చేశావు తల్లీ!

  • Published Jul 04, 2024 | 10:41 AMUpdated Jul 04, 2024 | 10:41 AM

Vemulawada Crime News: తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తుంటారు. వారి బంగారు భవిష్యత్ కోసం ఎన్నో కలలు కంటుంటారు. కానీ ఇటీవల కొంతమంది చిన్న విషయాలకే తీవ్ర మనస్థాపానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Vemulawada Crime News: తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తుంటారు. వారి బంగారు భవిష్యత్ కోసం ఎన్నో కలలు కంటుంటారు. కానీ ఇటీవల కొంతమంది చిన్న విషయాలకే తీవ్ర మనస్థాపానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

  • Published Jul 04, 2024 | 10:41 AMUpdated Jul 04, 2024 | 10:41 AM
బంగారం లాంటి భవిష్యత్తు.. ఆ ఒక్క కారణంతో ఎంత పని చేశావు తల్లీ!

ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికి మనస్థాపానికి గురవుతున్నారు. ఆ సమయంలో తాము ఏం చేస్తున్నామో తెలియక విచక్షణ కోల్పోయి దారుణాలకు తెగబడుతున్నారు. ఎదుటి వారిపై దాడులు చేయడం.. బలవన్మరణాలకు పాల్పపడటం లాంటివి చేస్తున్నారు. తెలిసీ తెలియక చేసిన తప్పు వల్ల ఎన్నో అనార్థాలు జరుగుతున్నాయి.. కుటుంబాల్లో తీవ్ర విషాదాలు నిండుకుంటున్నాయి.  ఒక్కగానొక్క బిడ్డ.. కష్టపడి పని చేసి మంచి చదువు చదివించి ఉన్నతమైన పొజీషన్ లో చూడాలని భావించిన తల్లిదండ్రులు. కానీ ఆ బిడ్డ ఊహించని పని చేసి అందరికీ షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే..

గ్రామాల్లో చాలా వరకు కుటుంబ సభ్యుల్లో ఆస్తి గొడవలు జరుగుతూ ఉంటాయి. అలా ఆస్తి గొడవల కారణంగా మనస్థాపానికి గురైన ఓ బాలిక సంచలన నిర్ణయం తీసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చందుర్తి మండలం బండపల్లికి చెందిన కుమ్మరి లచ్చయ్యకు భార్య లలిత, కుమారుడు బాబు ఉన్నాడు. లచ్చయ్యకు లలితకు మధ్య విభేదాలు రావడంతో ఆమె తన తల్లిగారింటికి వెళ్లిపోయి.. తిరిగి కాపురానికి రాలేదు. దీంతో లచ్చయ్య.. లచ్చవ్వను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కూతురు శ్రీవాణి జన్మించింది. లచ్చయ్య రెండేళ్ల క్రితం అనారోగ్యంతో కన్నుమూశాడు. అప్పటి లచ్చవ్వ, శ్రీవాణికి కష్టాలు వచ్చి పడ్డాయి.

ఇంటితోపాటు రెండెకరాల భూమిలో తమకు వాటా ఉందని మొదటి భార్య కొడుకు బాబు పలుమార్లు పోలీస్ స్టేషన్ కి వెళ్లాడు. ఈ క్రమంలోనే ఆ ఇంటి వెనుక స్థలంలో గుడిసె వేసుకోవాలని బాబు ప్రయత్నించాడు. దీనికి లచ్చవ్వ అడ్డు చెప్పింది.. ఆస్తిలో తనకు హక్కు ఉందని తమకు వీలూనామా రాశాడని బాబు తరుచూ లచ్చవ్వతో గొడవ పడటం మొదలు పెట్టాడు. బాబు, లచ్చవ్వ గొడవలపై గ్రామంలో చర్చించుకోవడం మొదలు పెట్టారు.గొడవల కారణంగా పదే పదే పోలీస్ స్టేషన్ కి వెళ్లడం శ్రీవాణికి నచ్చేది కాదు. ఈ క్రమంలోనే తీవ్ర మనస్థాపానికి గురై జులై 1న ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. అది గమనించి లచ్చవ్వ కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి ఆమెను కిందకి దించి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసింది. మృతురాలి ఫిర్యాదు మేరకు బాబు పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి