iDreamPost
android-app
ios-app

కడుపులో ఉన్నది ఆడ, మగా తెలుసుకునేందుకు భార్య కడుపు కోసిన భర్త.. చివరికి..

  • Published May 25, 2024 | 5:23 PM Updated Updated May 25, 2024 | 5:23 PM

Uttar Pradesh Crime News: భారత దేశంలో మహిళలకు భద్రత లేకుండా పోతుంది.. ఎంత దారుణం అంటే కడుపులో ఆడ శిశువు అని తెలిస్తే పురిటిలోనే చంపేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.

Uttar Pradesh Crime News: భారత దేశంలో మహిళలకు భద్రత లేకుండా పోతుంది.. ఎంత దారుణం అంటే కడుపులో ఆడ శిశువు అని తెలిస్తే పురిటిలోనే చంపేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.

  • Published May 25, 2024 | 5:23 PMUpdated May 25, 2024 | 5:23 PM
కడుపులో ఉన్నది ఆడ, మగా తెలుసుకునేందుకు భార్య కడుపు కోసిన భర్త.. చివరికి..

భారత దేశంలో ఆడవారికి ఎంతో గౌరవం ఇస్తారు. ఇప్పుడు దేశంలో మహిళలు అన్ని రంగాల్లో తమదైన సత్త చాటుతున్నారు. విద్య, వైద్య, సాంకేతిక, రాజకీయ రంగాల్లో మగవారితో సమానంగా ముందుకు సాగుతున్నారు. ఇంత గొప్ప స్థానంలో ఉన్నమహిళలను కొన్నిచోట్ల వివక్షకు గురి అవుతూనే ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆడ పిల్ల పుట్టిందంటే చంపేస్తున్నారు.. అనాథలుగా వదిలేయడం లేదా అంగట్లో సరుకుల్లా అమ్మేస్తున్నారు. ఆడపిల్లలు తమకు భారం అవుతారని.. కొంతమంది ముందుగానే లింగ నిర్ధారణ చేయించి ఆడపిల్ల అని తేలితే అబార్షన్ చేయిస్తున్న దారుణాలు ఎన్నో జరుగుతున్నాయి. ఓ భర్త రాక్షసుడిగా మారి కడుపుతో ఉన్న భార్యపై దారుణానికి తెగబడ్డాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది.

ఉత్తర్ ప్రదేశ్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తనకు పుట్టబోయే బిడ్డ ఆడపిల్లా, మగ పిల్లాడా అని తెలుసుకునేందుకు గర్భంతో ఉన్న భార్య కడుపు కోసిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. ఈ ఘటన యూపీలోని బదౌన్ లో 2020 లో చేటు చేసుకుంది.. తాజాగా ఈ కేసులో భర్తకు కోర్టు జీవిత ఖైదు విధించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బదౌన్ లోని సివిల్ లైన్స్ లో నివాసం ఉంటున్న పన్నాలాల్ కి 22 ఏళ్ళ క్రితం పెళ్లైంది. వీరికి అప్పటికే ఐదుగురు ఆడపిల్లలు. తనకు మగ పిల్లాడు కావాలన భార్యతో గొడవకు దిగేవాడు. ఈ విషయం భార్య అనిత తన పుట్టింటి వాళ్లతో చెప్పడంతో..మరింత రెచ్చిపోయి తనకు మగ పిల్లాడు పుట్టకపోతే వేరు మహిళను పెళ్లి చేసుకుంటా అంటూ బెదిరించేవాడు.

ఈ క్రమంలోనే ఒకరోజు పుట్టబోయే బిడ్డ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. కోపంతో ఊగిపోయిన పన్నాలాల్ పక్కనే ఉన్న కొడవలితో నీ కడుపులో ఉన్నది మగ పిల్లాడా? ఆడ పిల్లా? అంటూ ఆమె కడుపు కోశాడు. తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ పన్నాలాల్ కిరాతకంగా ఆమె కడుపు చీల్చే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో అనితకు ఏడో నెల. గాయాలతో అరుస్తూ సమీపంలోని దుకాణంలో పనిచేసే ఆమె సోదరుడి వద్దకు వచ్చింది. అప్పటికే పన్నాలాల్ అక్కడ నుంచి పారిపోయాడు. అనితను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించడంతో ప్రాణాలతో బయటపడింది. అయితే ఆమె కడుపులో ఉన్నది మగ శిశువు.. అప్పటికే కన్నుమూశాడు. ఈ ఘటన 2020 లో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇప్పటి వరకు కోర్టులో ఇరు పక్షాల నుంచి వాదనలు జరిగాయి. నేడు కొర్టు పన్నాలాల్ కి జీవిత ఖైదు విధించింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom